•  

  ''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే''

  ''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే'' మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద ఉన్న నమ్మకం ఇది.

 •  

  నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’

  నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి. రూ.149కే కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు అందించే ఈ ‘సాంకేతిక విప్లవం’ సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా అందుబాటులోకి వస్తుంది. దీనికి అవసరమైన రుణం, ఇతర ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం ఎపి ఫైబర్ బ్యాంకుల నుంచి రూ.300కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి రూ.100కోట్లు... వెరసి రూ.400కోట్ల రుణం తీసుకుంటుంది. ఈ డబ్బుతో టీవీ ప్రసారాలు, వైఫై, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవల కోసం పది లక్షల ఐపీటీవీ, జీపాన్‌ బాక్సులు కొనుగోలు చేస్తారు.

 •  

  తిరుపతి, అమరావతిలలో మిలీనియం టవర్లు ఐటి నగరాలుగా విశాఖ సరసన తిరుపతి, అమరావతి

  శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌, ఇన్నోవేషన్స్‌, స్టార్టప్స్‌, ఈ-గవర్నెన్స్‌, మీ-సేవ, ఈ-ప్రగతి తదితర కార్యక్రమాల పురోగతిని చంద్రబాబు సమీక్షించారు. విశాఖపట్నంలో నిర్మిస్తున్న మిలీనియం టవర్స్‌ తరహాలోనే...అమరావతి, తిరుపతి నగరాల్లో కూడా మిలీనియం టవర్స్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. ఆ మూడు నగరాలకూ సమ ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను తక్షణమే ఆరంభించాలి.

Pages