ఎన్టీఆర్ ఇద్దరమ్మల ముద్దుల కొడుకు

Tuesday, 28 April 2015 20:37

ఎన్టీఆర్ ఇద్దరమ్మల ముద్దుల కొడుకు. తల్లి వెంకట్రావమ్మ, పెదతల్లి చంద్రమ్మలు అక్కా చెల్లెళ్ళు. పిల్లలు లేకపోవడంతో ఎన్టీఆర్ పుట్టగానే ఆయనను చంద్రమ్మగారే సాకడం మొదలు పెట్టారు. తమ్ముడు త్రివిక్రమరావు తల్లి దండ్రుల వద్ద పెరుగగా, ఎన్టీఆర్ పెద్దమ్మ, పెదనాన్నల దగ్గర పెరిగారు. తారకరాముడు అన్న పేరు కూడా పెదనాన్న రామయ్య పెట్టిన పేరే. కానీ తల్లి వెంకట్రావమ్మకు మాత్రం ఎన్టీఆర్ కు కృష్ణుడి పేరు పెట్టాలని అనుకున్నారట. తల్లిగారి మనోవాంఛ ఫలమో ఏమో, ఎన్టీఆర్ శ్రీకృష్ణ అవతారంగా అఖిలాంద్ర ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. మూడు దశాబ్దాల పాటు ఒకే పాత్రను వయస్సుతో నిమిత్తం లేకుండా పోషించి మెప్పించగలిగారు. అంతేకాదు తన కొడుకు పెద్ద పోలీసాఫీసరు కావాలని అనుకున్నారంట వెంకట్రావమ్మగారు. యాదృచ్చికంగా ఎన్టీఆర్ తన సినీ నటనా జీవితాన్ని పోలీసు పాత్రతోనే మొదలు పెట్టారు. అలా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతుడయ్యేందుకు తల్లి శుభాశీస్సులు, శుభకామనలు సదా ఆయన వెంటే నిలిచాయి.

అందుకేనేమో ఎన్టీఆర్ కు మహిళలంటే అమితమైన గౌరవాభిమానాలుండేవి. సమాజంలో ఇంచుమించు సగం మంది స్త్రీలు ఉన్నా వారి సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం జరగవలసిన కృషి జరగలేదని ఆయన బాధపడుతుండేవారు. అర్థికంగా తన కాళ్లమీద తాను నిలబడినప్పుడే, రాజకీయ, సామాజిక రంగాలలో పురుషుడి సరసన ధీటుగా నిలబడి స్త్రీ పురోగమించగలుగుతుందని ఎన్టీఆర్ భావించారు. స్త్రీలకు సమాన గౌరవ మర్యాదలుగల హోదాను అనుభవించడానికి వీలుగా అనేక రకాల కార్యక్రమాలకు, చట్టాలకు ఎన్టీఆర్ పాలనలోనే బీజం పడింది.

ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి మాతృమూర్తికీ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం

ప్రముఖ పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక

ఇటీవలి పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక