కృష్ణా డెల్టాకు సకాలంలో నీరిస్తాం నీటి హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తాం

Tuesday, 28 April 2015 20:37

ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కుల సాధన కోసం పోరాడతామని, ఈ విషయంలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. కృష్ణానదిపై కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, తెలంగాణలోనూ అనుమతి లేకుండా పనులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రెండు రాష్ట్రాలు జలాల్ని పంచుకోవాలని.. అదనంగా ప్రాజెక్టులు కడితే డెల్టా దెబ్బతింటుందన్నారు. నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని, నిరంతర పోరాటం సాగిస్తామని స్పష్టంచేశారు. 
కృష్ణా డెల్టాకు గత ఏడాది నదుల అనుసంధానంతో గోదావరి నీరు 8 టీఎంసీలు మళ్లించి ఇక్కడి పంటలను కాపాడామని చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కృష్ణా జిల్లాలో నిర్వహించిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గన్నవరం మండలం చిక్కవరంలో బ్రహ్మయ్యలింగం చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించి గోదావరి నీటిని బ్రహ్మయ్యలింగం చెరువుకు మళ్లిస్తామని తెలిపారు. పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో జల సంరక్షణ పనులు అమలు చేయాలని పిలుపిచ్చారు. ప్రతి ఇంట్లో తప్పకుండా ఇంకుడు గుంత తవ్వేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇది ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయాలని కోరారు. గత పాలకులు ప్రాజెక్టులు, కాలువల పేరిట అవినీతికి పాల్పడ్డారని జలసంరక్షణపై దృష్టిపెట్టలేదని ఆరోపించారు

ప్రముఖ పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక

ఇటీవలి పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక