తిరుపతి, అమరావతిలలో మిలీనియం టవర్లు ఐటి నగరాలుగా విశాఖ సరసన తిరుపతి, అమరావతి

Tuesday, 05 May 2015 10:02

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌, ఇన్నోవేషన్స్‌, స్టార్టప్స్‌, ఈ-గవర్నెన్స్‌, మీ-సేవ, ఈ-ప్రగతి తదితర కార్యక్రమాల పురోగతిని చంద్రబాబు సమీక్షించారు. విశాఖపట్నంలో నిర్మిస్తున్న మిలీనియం టవర్స్‌ తరహాలోనే...అమరావతి, తిరుపతి నగరాల్లో కూడా మిలీనియం టవర్స్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. ఆ మూడు నగరాలకూ సమ ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....‘‘ప్రపంచంలోని అత్యుత్తమ ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను తక్షణమే ఆరంభించాలి. మూడు ప్రధాన నగరాల్లో ఐటీ సంస్థలకు అనువైన స్థలాలను కేటాయించేందుకు సిద్ధం చేయాలి. పెద్ద సంస్థలకే కాకుండా...సరికొత్త ఆలోచనలతో వచ్చే చిన్న తరహా ఐటీ సంస్థలకూ ప్రొత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ సవ్యంగా అందడానికి 133 ప్రభుత్వ విభాగాలలో అన్ని రకాల సేవలను డిజిటలైజ్‌ చేసే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి'' అని చంద్రబాబు అన్నారు. ఐటీ సింగిల్‌ విండో విధానంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీ కంపెనీలకు సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో సూపర్‌ కంప్యూటర్‌ వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రముఖ పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక

ఇటీవలి పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక