ప్రత్యేక హోదాపై పార్లమెంటులో తెదేపా గళం ప్రత్యేక హోదా... ఆంధ్రప్రదేశ్ హక్కు

Tuesday, 28 April 2015 20:36

"చేతులు జోడించి వేడుకుంటున్నా... ఏపీకి అన్యాయం చేయవద్దు" 
- టిడిపి పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్

ప్రత్యేక హోదాపై పార్లమెంటులో తెదేపా గళం

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదాపై కేంద్రంతో ఇప్పటివరకు వేచిచూచే ధోరణి అవలంబించింది తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి ప్రధాని, కేంద్రమంత్రులను కలిసి విభజన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చమని అడుగుతూ వచ్చారు. అలా వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకు వస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం నెరవేర్చని విభజన హామీలు, ప్రధాని నోట వెలువడిన హామీలు అలాగే ఉండిపోయాయి. నేడు రేపు అంటూనే రెండేళ్ళు గడిపేసిన కేంద్రం ఇప్పుడు స్వరం మార్చింది. పార్లమెంటులో హోం శాఖ, ఆర్థిక శాఖ సహాయమంత్రులు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రధాన ఆకాంక్షగా మారిన తరుణంలో 5కోట్ల ప్రజల వాణిని పార్లమెంటులో ఘాటుగా వినిపిస్తున్నారు మన తెలుగుదేశం ఎంపీలు.

టిడిపి పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రి తేల్చి చెప్పడంతో టిడిపి పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ లోకసభలో స్పందించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, ఏపీకి అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేంద్రంపై ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఉందన్న విషయం గుర్తు చేశారు. 
మాటలు చెప్పే సమయం ముగిసిపోయిందని, ఇంకా మాటలు చెప్పుకుంటూ పోతే ప్రజలు మనలను నమ్మరని చెప్పారు. తక్షణం ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరముందంటూ కేంద్రానికి సభాముఖంగా నాలుగు ప్రశ్నలు సంధించారు. 
ఏపీకి నిధులు ఎలా కేటాయిస్తారు? 
ఎంత కేటాయిస్తారు? 
ఇచ్చిన హామీలు ఎలా నేరవేరుస్తారు? 
ఎంత సమయం లోపు నెరవేరుస్తారని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

ప్రముఖ పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక

ఇటీవలి పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక