తిరుమలను అపవిత్రం చేసిన జగన్ కు దండన లేదా?

Monday, 06 November 2017 04:45

తిరుమలను అపవిత్రం చేసిన జగన్ కు దండన లేదా?

ఎన్నాళ్లూ ఈ ఉదాశీనత అని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు..

జగన్ పాదయాత్రపై పదేపదే విమర్శల వలన ప్రయోజనం కన్నా తిరుమలను అపవిత్రం చేసిన జగన్ దురాగతాలను ఎండగడితే ప్రయోజనం ఉంటుంది.

ప్రజల మనోభావాలను, అన్ని మతాలూ, సంస్కృతిని కాపాడంటంపైనే భవిషత్తు ఉంటుందన్నది సత్యం...నిజం ... తిరుమల, శ్రీవేంకటేశ్వరుడిని అవమాన పరచినందుకు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కీ పట్టిన దుర్గతి వంటి చరిత్ర నుంచి ఆయన వారసుడు పాఠాలు నేర్చుకోకపోవడం దురదృష్టకరం.

ప్రతి దినం తిరుమలకు సుమారు 50 నుంచి 60 వేలమంది భక్తులు తిరుమలలో నియమనిబంధనలు పాటిస్తూ దైవసన్నిధికి పవిత్రంగా వచ్చి దర్శించుకుపోతుంటారు...

వైకాపా అధ్యక్షుడు జగన్ వెంట మహా అయితే వేయి మంది వచ్చినా ఎక్కువే..

అయితే వైకాపా నేతలకు శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తి లేకపోతె ఎందుకు వచ్చినట్లు.. చెప్పులువేసుకుని, జగన్ జిందాబాదు అంటూ నినాదాలు ఇచ్చి తిరుమల పవిత్రతను నాశనం చేస్తుంటే .. తిరుమలలో రక్షణ ఏమయింది అని ప్రజల్లో చర్చ మొదలైంది.

శ్రీ వేంకటేశ్వరునికి మాత్రమె గొడుగు పట్టాల్సిన ప్రాంతంలో జగన్ ఓ పోలీసు గొడుగు పట్టించుకోవడం సరైన దేనా?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్దు సభ్యులు, పోలీసులు శ్రీ వేంకటేశ్వర స్వామీ వారి సేవలు మరిచి జగన్ కు దాసోహం అవడం యావత్తు భక్తులను విస్మయం పరిచింది...

జగన్ అరాచకాలకు రాష్ట్ర సంపద లక్ష కోట్ల మేర కోల్పోవడమే కాదు పవిత్ర తిరుమలలో కూడా చోటు చేసుకోవడం సహించరానిదిగా భావిస్తున్నారు...

హిందూ ధర్మాన్ని, దెవుళ్లని నమ్మని వ్యక్తిని తిరుమలకు ఎలా అనుమతించరని ప్రశ్న ఎదురవుతోంది?

ఇది వార్తా: నటుడు కమల్ హాసన్ పై పరిపూర్ణానందస్వామి - హిందువులు ఉగ్రవాదులన్న వాఖ్యలను కమల్ ఉపసంహరించుకోవాలి -

సోషల్ మీడియా ఏమంటోంది ? ఎక్కడో హిందూయిజాన్ని తప్పుబట్టారని కమల్ ను విమర్శిస్తున్న పరిపూర్ణానందస్వామి ఇక్కడ గోవిందుడుని అవమానపరిచే విధంగా డిక్లరేషన్ పై సంతకం చేయని, నినాదాలతో అపవిత్రం చేసిన జగన్ అండ్ కో దురాచారాలను ఎందుకు ఖండించలేదు.. ఈయన పండితుడా ..రాజకీయవేత్తా ? ఇలాంటి స్వాములు, సన్నాసుల వలన సమాజం, సంప్రదాయం, సంస్కృతీ బ్రష్టుపట్టిపోతొంది? ఆర్థిక నెరస్థుడు, అనేక అక్రమాలకు పాల్పడిన జగన్ కు పరిపూర్ణానందస్వామి, చినజీయర స్వాముల లాంటి వారు స్వాగతించి ఆశీర్వాదం ఇవ్వడమేమిటి?