2018 ఆఖరుకు విజయవాడ మెట్రో. కారిడార్ -2 మార్గం పూర్తి చేయనున్న డీఎంఆర్‌సీ.

Sunday, 17 May 2015 19:30

విజయవాడలో అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైలు సంస్థకు అప్పగించనుంది. ఈ మేరకు మరో పది రోజుల్లో అమరావతి మెట్రోరైలు సంస్థ (ఏఎంఆర్‌సీ), ఢిల్లీ మెట్రోరైలు సంస్థ (డీఎంఆర్‌సీ)లు అధికారికంగా ఒప్పందం చేసుకోనున్నాయి. ప్రాజెక్టు తొలి దశలో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌టెర్మినల్‌ నుంచి నిడమానూరు వరకు 13.27 కి.మీ దూరంలో నిర్మించతలపెట్టిన కారిడార్‌-2 మార్గాన్ని 2018 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి మెట్రోరైలు నిర్మాణ బాధ్యతను డీఎంఆర్‌సీకి అప్పగించాలని గత ఏడాది జూన్‌లో ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో పనులు ప్రారంభించేందుకు ముందస్తు చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.పది కోట్లు కూడా మంజూరుచేసింది.