ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు అభివృద్ధి కార్యక్రమాలను, అటు పేదలకు ఉపాధినీ ఏకకాలంలో అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Saturday, 16 May 2015 19:30

ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు అభివృద్ధి కార్యక్రమాలను, అటు పేదలకు ఉపాధినీ ఏకకాలంలో అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సీసీ రోడ్లు, జలసంరక్షణ పనులు వంటి కార్యక్రమాలతో ప్రతి గ్రామంలోని పేదలు ఉపాధిని పొందుతున్నారు. వలస మాట మరిచి ఉన్న ఊళ్లోనే కుటుంబమంతా హాయిగా పనులు చేసుకుంటోంది. ఏ పని చేసినా చరిత్ర సృష్టించే స్థాయిలో నిర్వహించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధి హామీ పనులను కూడా రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఉపాధి హామీ నిధులను సక్రమంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాలలో ఒకటిగా సగర్వంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. రూ. 2600 కోట్ల వేతన చెల్లింపులను చేసింది. 20 కోట్ల పనిదినాలను ఉపాధి కూలీలకు అందించింది. అంతేకాదు ఎటువంటి వాయిదాలు వేయకుండా పని చేసిన మూడు రోజుల్లోనే వేతనాన్ని చెల్లించి, శ్రమజీవుల చిరునవ్వులకు కారణమవుతోంది.