ఉద్యోగార్హత నైపుణ్యాలలో ఆంధ్రప్రదేశ్ యువత మెరుగు

Sunday, 20 November 2016

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగార్హత నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయి. 29 రాష్ట్రాల నుండి 5.6 లక్షల మంది విద్యార్థులలో ఉద్యోగార్హత నైపుణ్యాలను అంచనావేసిన వీబాక్స్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రముఖ ఆన్ లైన్ టాలెంట్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ AICTE, UNDP మరియు CII సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన నైపుణ్య పరీక్షలో దేశంలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని తేలింది. వివిధ రంగాలకు చెందిన 125 సంస్థల కోసం, ఆ సంస్థల ఉద్యోగులకు ఉండాల్సిన నైపుణ్యాలను పరీక్షించేందుకు వీబాక్స్ సంస్థ ఈ ఆన్ లైన్ పరీక్షను నిర్వహించింది.

ఆంధ్రప్రదేశ్ నుండి 70,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మార్కెట్ డిమాండుకు అనుగుణంగా న్యూమరికల్, లాజికల్, సాఫ్ట్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్ అంశాలలో విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించగా గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన విద్యార్థులు మరింత ముందంజలో ఉన్నారు. యువకులతో పోలిస్తే యువతులు మరింత మెరుగైన నైపుణ్యాలతో ఉన్నారని వీబాక్స్ తెలిపింది.

ప్రముఖ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ...
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) గారు చెన్నైలోని తన నివాసంలో మంగళవారం...
దేశంలో రాష్ట్రాలవారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. 2....
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగార్హత నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయి....
రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే సంకల్పంతో నిరుపేద గిరిజన...

ఇటీవలి వార్తలు