కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటుకు ఓఎన్‌జీసీ సంసిద్ధత

Thursday, 24 November 2016

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. పది బిలియన్‌ డాలర్ల (సుమారు 68,000 కోట్ల రూపాయల) పెట్టుబడులతో ఈ రెండు ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామని ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌నందన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. విజయవాడలో సోమవారం రాత్రి ఆయన సీఎంను కలిసి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. గోదావరి-కృష్ణా బేసిన్‌లో అపార చమురు-సహజ వాయు నిక్షేపాలను వెలికి తీస్తున్న ఓఎన్‌జీసీ, మరికొన్ని అదే తరహా సంస్థల కన్సార్టియంను ఏర్పాటు చేసి రాష్ట్రంలో హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఇందులో భాగంగానే కన్సార్టియం ద్వారానే తాజా రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై కూడా పరిశీలన జరుగుతోంది. ఓఎన్‌జీసీ చేపట్టే ప్రాజెక్టులు, కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు వెల్లడించారు.

ప్రముఖ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ...
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) గారు చెన్నైలోని తన నివాసంలో మంగళవారం...
దేశంలో రాష్ట్రాలవారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. 2....
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగార్హత నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయి....
రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే సంకల్పంతో నిరుపేద గిరిజన...

ఇటీవలి వార్తలు