జాతీయపార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ రెండేళ్ల క్రితం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విజయవంతంగా 56 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది

Monday, 07 November 2016

జాతీయపార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ రెండేళ్ల క్రితం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విజయవంతంగా 56 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది. నాడు సభ్యత్వం తీసుకున్న వారందరికీ రెండు లక్షల ప్రమాదబీమా పథకాన్ని కూడా అందించింది. ఈ రెండేళ్లలో ఎంతో మంది కార్యకర్తలు ప్రమాదాలలో చనిపోగా, ఈ బీమా ఫలితంగా 1223 మంది కార్యకర్తల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున 24 కోట్ల రూపాయలకు పైగా అందించడం జరిగింది. 
రెండేళ్ల క్రితం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగుస్తోంది. అందువల్ల మీరందరూ వెంటనే మీ దగ్గర లోని తెదేపా సభ్యత్వ నమోదు కేంద్రంలో గానీ, ఆన్ లైన్లో గానీ మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోండి. మీ కుటుంబ సంక్షేమం కోసం తెదేపా అందిస్తున్న రూ.2 లక్షల ప్రమాదబీమాను మరో రెండేళ్లు పొడిగించుకోండి. 
సభ్యత్వ పునరుద్ధరణ (రెన్యువల్) విధానం:
ఆన్ లైన్లో చేసుకోవాలంటే www.telugudesham.org కు వెళ్లి అందులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం పునరుద్ధరణ చేసుకోవచ్చు. లేదా మీ స్మార్ట్ ఫోన్లో తెదేపా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మీ దగ్గరలో తెదేపా సభ్యత్వ కేంద్రం ఎక్కడుందో తెలుసుకుని అక్కడ మీ పాత మెంబర్ షిప్ కార్డు లేదా రిజిస్టర్డ్ ఓటర్ ఐడి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లతో మెంబర్ షిప్ ను రెన్యూవల్ చేసుకోవచ్చు. సభ్యత్వ రుసుము కింద రూ.100 చెల్లించాలి. వెంటనే మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోండి. మీ కుటుంబ సంక్షేమం కోసం తెదేపా అందిస్తున్న రూ.2 లక్షల ప్రమాదబీమాను మరో రెండేళ్లు (2017 జనవరి 1 నుండి 2018 డిసెంబర్ 31 వరకు) పొడిగించుకోండి.

ప్రముఖ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ...
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) గారు చెన్నైలోని తన నివాసంలో మంగళవారం...
దేశంలో రాష్ట్రాలవారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. 2....
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగార్హత నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయి....
రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే సంకల్పంతో నిరుపేద గిరిజన...

ఇటీవలి వార్తలు