ఇటీవలి వార్తలు

  • జాతీయపార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ రెండేళ్ల క్రితం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విజయవంతంగా 56 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది. నాడు సభ్యత్వం తీసుకున్న వారందరికీ రెండు లక్షల ప్రమాదబీమా పథకాన్ని కూడా అందించింది. ఈ రెండేళ్లలో ఎంతో మంది కార్యకర్తలు ప్రమాదాలలో చనిపోగా, ఈ బీమా ఫలితంగా 1223 మంది కార్యకర్తల కుటుంబాలకు రెండేసి లక్షల రూపాయల చొప్పున 24 కోట్ల రూపాయలకు పైగా అందించడం జరిగింది.  రెండేళ్ల క్రితం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగుస్తోంది. అందువల్ల మీరందరూ వెంటనే మీ దగ్గర లోని తెదేపా సభ్యత్వ నమోదు కేంద్రంలో గానీ, ఆన్ లైన్లో గానీ మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోండి. మీ కుటుంబ సంక్షేమం కోసం తెదేపా అందిస్తున్న రూ.2 లక్షల ప్రమాదబీమాను మరో రెండేళ్లు పొడిగించుకోండి.  సభ్యత్వ పునరుద్ధరణ (రెన్యువల్) విధానం: ఆన్ లైన్లో చేసుకోవాలంటే www.telugudesham.org కు వెళ్లి అందులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం పునరుద్ధరణ చేసుకోవచ్చు. లేదా మీ స్మార్ట్ ఫోన్లో తెదేపా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మీ దగ్గరలో తెదేపా సభ్యత్వ కేంద్రం ఎక్కడుందో తెలుసుకుని అక్కడ మీ పాత మెంబర్ షిప్ కార్డు లేదా రిజిస్టర్డ్ ఓటర్ ఐడి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లతో మెంబర్ షిప్ ను రెన్యూవల్ చేసుకోవచ్చు. సభ్యత్వ రుసుము కింద రూ.100 చెల్లించాలి. వెంటనే మీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోండి. మీ కుటుంబ సంక్షేమం కోసం తెదేపా అందిస్తున్న రూ.2 లక్షల ప్రమాదబీమాను మరో రెండేళ్లు (2017 జనవరి 1 నుండి 2018 డిసెంబర్ 31 వరకు) పొడిగించుకోండి. 0 ఇంకా చదవండి 1056 జాతీయపార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ రెండేళ్ల క్రితం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విజయవంతంగా 56 లక్షల సభ్యత్వాలను నమోదు చేసింది
  • ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా, 2019కల్లా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి అందించే లక్ష్యంతో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 54 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా ఎంతో పురోగతిని సాధించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 1368 గ్రామాలను ఓడిఎఫ్ ప్రాంతాలుగా ప్రకటించి దేశంలో ఈ రకంగా ప్రకటించిన తొలిరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలచింది. పట్టణాలను ఓడీఎఫ్‌లుగా ప్రకటించాలనే క్రమంలో గత ఏడాదిగా ప్రభుత్వం భారీగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టింది. ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో 1,94,336 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా, 1,53,779 మరుగుదొడ్ల పనులు పూర్తయ్యాయి. అలాగే 4,614 సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా, 3,887 మరుగుదొడ్ల పనులు పూర్తయ్యాయి 0 ఇంకా చదవండి 1055 నేడు వరల్డ్ టాయిలెట్ డే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి దిశగా ఆంధ్రప్రదేశ్
  • 'బాబు వస్తే జాబు వస్తుంది' అని ఆశించిన యువత 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటంలో ముఖ్యపాత్ర పోషించారు. అది ఓర్వలేని ప్రతిపక్షం 'బాబు వచ్చాడు... జాబేదీ?' అంటూ యువత కనిపించినప్పుడల్లా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. రెండేళ్ళ పాలన సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువతకు రెండేళ్ళలో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు చంద్రబాబు. దీంతో ప్రతిపక్షానికి గొంతులో వెలక్కాయ అడ్డుపడినట్టయ్యింది. ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో యువతకు వచ్చిన ఉద్యోగాల వివరాలను ఓసారి పరిశీలిద్దాం. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.5 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. ఒక్క భాగస్వామ్య సదస్సులోనే 4.8 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. సత్వర అనుమతులు, భూకేటాయింపులు, ఏకగవాక్ష విధానం వంటి వాటి సంగతి అలా ఉంచితే ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రూ.2వేల కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి పారిశ్రామిక వర్గాల్లో భరోసానిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో ఇప్పటికే 175 ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించాయి. దాదాపు 94వేల మందికి ఉపాధి లభించింది. మరో 180 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పెట్టుబడుల హామీలన్నీ ఆచరణలోకి వస్తే మరో 7.88లక్షల మందికి ఉద్యోగాలొచ్చే అవకాశముంది. డీఎస్సీ 2014కు 4.20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.96 లక్షల మంది పరీక్షరాశారు. జూన్ 2, 2015న పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. అయితే కోర్టు కేసులతో పలు దఫాలుగా నియామక ప్రక్రియ వాయిదా పడింది. పరిపాలన ట్రెబ్యునల్‌ నుంచి ఈమధ్యే స్పష్టత రావడంతో నియామకాల కోసం ఏడాదిన్నరగా నిరీక్షిస్తున్న డీఎస్సీ-2014 అభ్యర్థులకు ఇటీవలే చంద్రబాబు చేతులమీదుగా నియామకపత్రాలు అందించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి 10వేల మంది నూతన ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. ఇక 3,634 వ్యవసాయ విస్తరణాధికారుల ఖాళీలు సహా, గిరిజన, వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ జరిగింది. రానున్న కాలంలో 20 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, త్వరలో 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఇవేకాకుండా 6 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 0 ఇంకా చదవండి 890 'బాబు వస్తే జాబు వస్తుంది' అని ఆశించిన యువత 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటంలో ముఖ్యపాత్ర పోషించారు.
  • శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కడప లో ఉన్న అమీన్పీర్ దర్గా వద్ద నమస్కారములు చెల్లించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వారి దీవెనలు పొందారు.   0 ఇంకా చదవండి 889 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కడప లో ఉన్న అమీన్పీర్ దర్గా వద్ద నమస్కారములు చెల్లించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వారి దీవెనలు పొందారు.
  • జూన్ 15వ తేదీ నుంచి వృద్ధులకు బస్‌టికెట్‌లో 25 శాతం రాయితీని ఇచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలపడంతో కార్యాచరణ, విధివిధానాలపై ఏపీఎస్‌ఆర్టీసీ దృష్టి సారించింది. కనీసం 60 ఏళ్ల వయసు, ఆపై ఉన్న వారిని సీనియర్‌ సిటిజన్లుగా పరిగణించి, వారికి టికెట్‌ రాయితీ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటగా ముందస్తు రిజర్వేషన్‌ ఉన్న బస్సుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. , ఒకవేళ జాప్యం జరిగితే జులై 1వ తేదీ నుంచి తప్పనిసరిగా అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  సీనియర్ సిటిజన్లు 25 శాతం రాయితీ పొందేందుకు టికెట్‌ను ముందస్తుగా తీసుకునే సమయంలో పేరు, ఫోన్‌ నెంబర్‌ వంటి వివరాలతో పాటు వయసును పేర్కొనాల్సి ఉంటుంది. వయసు ధ్రువీకరణకు ఆధార్‌తో పాటు ఇంకా ఏయే గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత వయసు ధ్రువీకరణ కార్డు లేకుంటే రాయితీగా ఇచ్చిన 25శాతం ఛార్జీని తిరిగి వసూలు చేస్తారు. ముందుగా రిజర్వేషన్‌ బస్సుల్లో వృద్ధులకు రాయితీ అమలుతీరును పరిశీలించి, ఆ తర్వాత తెలుగు వెలుగు (ఆర్డినరీ) సహా ఆర్టీసీకి ఉన్న మొత్తం 12 వేల బస్సుల్లో రాయితీని విస్తరించే యోచనలో ఉంది ఏపీఎస్‌ఆర్టీసీ. 0 ఇంకా చదవండి 891 జూన్ 15వ తేదీ నుంచి వృద్ధులకు బస్‌టికెట్‌లో 25 శాతం రాయితీని ఇచ్చేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది.

Pages