ఇటీవలి వార్తలు

  • శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహా సంకల్పం సభ నేడు కడప లో జరుగుతున్న నవ నిర్మాణ  దీక్ష లో భాగంగా పాల్గొన్నారు. 0 ఇంకా చదవండి 887 శ్రీ నారా చంద్రబాబు నాయుడు మహా సంకల్పం సభ నేడు కడప లో జరుగుతున్న నవ నిర్మాణ దీక్ష లో భాగంగా పాల్గొన్నారు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో రెండేళ్ళ క్రింద పునాదుల నుండి మొదలైన ప్రగతి నిర్మాణం, రెండేళ్ళు తిరిగేసరికి స్పష్టమైన ఆకృతిని దాల్చి, భవిష్యత్తులో ఉజ్వల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందన్న గట్టి నమ్మకాన్ని ప్రజలకు కలిగించింది. అద్వితీయంగా సాగిన చంద్రబాబు పాలన అనితర సాధ్యమైన ఘట్టాలతో కొనసాగి ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ వివిధ రంగాల పురోగతిని ఒకసారి మననం చేసుకుందాం. రైతు సంక్షేమం:  దేశంలోనే తొలిసారిగా రూ. 24 వేల కోట్ల రైతు రుణ ఉపశమనం. ఇప్పటివరకు 57.21 లక్షల ఖాతాలలో రూ. 7,950 కోట్లు జమ. 5 జిల్లాలలో కొబ్బరి సాగుచేసే 5 లక్షల మందికి బీమా సౌకర్యం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి. సాగునీరు:  దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానం. ఏడాదిలోనే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి. 8.5 లక్షల ఎకరాల్లో రూ 2,400 కోట్ల విలువైన పంటకు ఊపిరి. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల. వ్యవసాయ ప్రగతి :  ప్రాధమిక రంగ మిషన్ వల్ల వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో 8.4 శాతం వృద్ధి రేటు నమోదు. రూ.1.64 లక్షల కోట్ల సంపద సృష్టి. 2015-16లో ఉద్యానవన రంగంలో 9.96% వృద్ధి రేటు. ఆక్వారంగంలో 32.78% వృద్ధిరేటు. ఉద్యోగాలు:  10 వేల ఉపాధ్యాయ, 3,634 వ్యవసాయ విస్తరణాధికారుల ఖాళీలు సహా, గిరిజన, వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ. 20 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం. త్వరలో 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు. ప్రతి పేద కడుపుకూ అన్నం: రూ. 2,459 కోట్లతో నెలనెలా కోటి 36 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదార్లకు సరుకుల పంపిణీ.  కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం. రెండంకెల వృద్ధిరేటు:  జాతీయ సగటు వృద్ధి రేటు 7.6% కన్నా అధికంగా రాష్ట్ర వృద్ధి రేటు 10.99%. 2015-16లో సేవల రంగంలో 11.39 శాతం వృద్ధి, పారిశ్రామికరంగంలో 11.13 శాతం వృద్ధి. నిరంతర విద్యుత్తు:  22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు పూడ్చి నిరంతర విద్యుత్ సరఫరా. సంస్కరణలతో విద్యుత్ రంగానికి 6 జాతీయ అవార్డులు. పరిశ్రమలు:  విశాఖ సీసీఐ సదస్సులో 4.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. రాష్ట్రానికి ఇసుజు, క్యాడ్ బరీ, హీరో మోటార్స్, పెప్సీకో సంస్థలు ఈ - గవర్నెన్స్ : 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవల డిజిటైజేషన్. 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ‘ఇ-ప్రగతి’ రూపకల్పన. ఫైబర్‌గ్రిడ్‌: ఫైబర్‌గ్రిడ్‌తో రూ.149కే ఇంటింటికీ త్వరలో ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్. సోలార్, పవన విద్యుత్ హబ్‌గా రాయలసీమ:  అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ పార్కుల అభివృద్ధి. 0 ఇంకా చదవండి 886 అద్వితీయంగా సాగిన చంద్రబాబు పాలన అనితర సాధ్యమైన ఘట్టాలతో కొనసాగి ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ వివిధ రంగాల పురోగతిని ఒకసారి మననం చేసుకుందాం.
  • లాభసాటి వ్యవసాయం-కరవు రహిత రాష్ట్రం లక్ష్యంగా సాగిన చంద్రబాబు రెండేళ్ల పాలన, ఆంధ్రప్రదేశ్ రైతులకు పచ్చని సిరులను పంచింది. ఆర్థిక ఉపశమనం కలిగించింది. వ్యవసాయంపై భరోసా కలిగించింది.  సాగునీటి కోసం...  ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానాన్ని చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఏడాదిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి 8.5 లక్షల ఎకరాల్లో రూ 2,400 కోట్ల విలువైన పంటకు ఊపిరి పోసింది. డెల్టాలో ఈసారి కరవు ఏర్పడింది. అలాంటిలాంటి కరవుకాదు. గత 160 ఏళ్లలో చూడని కరవు అది. అయినప్పటికీ చంద్రబాబు ముందు చూపు వల్ల, ముందుగానే చేపట్టిన పంట పరిరక్షణ చర్యల వల్ల.. కరవును అధిగమించి 137.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలిగాం. అలాగే తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, ఆర్థిక వెసులుబాటు కోసం...  దేశంలోనే తొలిసారిగా అధిక మొత్తంలో రూ. 24 వేల కోట్ల వ్యవసాయ రుణ ఉపశమనానికి ప్రభుత్వం నడుం కట్టింది. మనసుంటే మార్గం ఉందని నిరూపిస్తూ ఇప్పటివరకు 57.21 లక్షల ఖాతాలలో రూ. 7,950 కోట్లు జమచేసింది. 5 జిల్లాలలో కొబ్బరి సాగుచేసే 5 లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. లాభసాటి వ్యవసాయం కోసం...  సాగు ఉత్పాదన పెంపునకు 16.25 లక్షల సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. 3,634 వ్యవసాయ విస్తరణాధికారుల నియామకాన్ని చేపట్టింది ప్రభుత్వం. కరవు రహిత రాష్ట్రం కోసం...  కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు తొలి అడుగు వేస్తూ పంటసంజీవని కార్యక్రమం ద్వారా పంటకుంటలు, రెయిన్‌గన్స్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నీరు-చెట్టు కార్యక్రమంతో 10 వేల చెరువుల్లో పూడికతీయించింది. రూ.134 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి లక్షా 54 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. సాధించిన వ్యవసాయ ప్రగతి...  ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయనడానికి నిదర్శనంగా 2015-16లో ఉద్యానవన రంగంలో 9.96% వృద్ధి రేటు సాధించాం. ఆయిల్ పామ్, బొప్పాయి, మొక్కజొన్న పంటల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఆక్వారంగంలో 32.78% వృద్ధిరేటుతో అద్భుత ప్రగతిని సాధించాం. 0 ఇంకా చదవండి 884 లాభసాటి వ్యవసాయం-కరవు రహిత రాష్ట్రం లక్ష్యంగా సాగిన చంద్రబాబు రెండేళ్ల పాలన, ఆంధ్రప్రదేశ్ రైతులకు పచ్చని సిరులను పంచింది.
  • శ్రీ చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ వారం సందర్భంగా విజయవాడలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు. 0 ఇంకా చదవండి 883 శ్రీ చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ వారం సందర్భంగా విజయవాడలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్నారు
  • ప్రస్తుతం బస్టాండ్లలో టీవీలు ఏర్పాటు చేయడం, వైఫై సౌకర్యం కల్పించడం చూస్తూనే ఉన్నాం. కానీ బస్టాండ్‌లో సినిమా థియేటర్‌ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనను నిజం చేసి చూపించింది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచనకు ‘వై స్ర్కీన్’ అనే థియేరట్ల నిర్మాణ సంస్థ కార్యరూపమిచ్చింది. విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌లో మల్టీప్లెక్స్‌ అందుబాటులోకి వచ్చింది. ‘వై స్క్రీన్స్‌’ సంస్థ దేశంలోనే తొలిసారిగా విజయవాడ బస్టాండ్‌లో మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ‘వై స్క్రీన్స్‌’ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంటున్న విజయవాడ బస్టాండ్‌... మల్టీప్లెక్స్‌ ఏర్పాటుతో దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు. కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని గుర్తు చేశారు. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదాల బారిన పడి మరణిస్తే రూ.10లక్ష బీమా సౌకర్యం కల్పించామన్నారు. ఇవన్నీ కూడా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలని వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం 7 కోట్ల 36లక్షల రూపాయలను రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా అందజేశారు. 0 ఇంకా చదవండి 882 ప్రస్తుతం బస్టాండ్లలో టీవీలు ఏర్పాటు చేయడం, వైఫై సౌకర్యం కల్పించడం చూస్తూనే ఉన్నాం.

Pages