ఇటీవలి వార్తలు

  • పార్టీ కోసం మీరు... మీకోసం పార్టీ... పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం, రావిపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ళ శిరాలం నరేష్ గారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఫిబ్రవరి 8, 2015వ తేదీన పని మీద బైక్ పై వెళుతున్నప్పుడు, ప్రమాదవశాత్తూ బైక్ అదుపు తప్పింది. ఆ ప్రమాదంలో తీవ్ర గాయలై అక్కడికక్కడే మరణించారు నరేష్ గారు.  నరేష్గారికి తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి వెంకటేశ్వర రావు, ఇంటర్ చదివిన చెల్లెలు నాగకుమారి, 8వ తరగతి చదివిన తమ్ముడు ప్రసాద్ ఉన్నారు.ఈయన మరణంతో వీరి కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. నరేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వీరి కుటుంబానికి పార్టీతో 10 సంవత్సరాల అనుబంధం ఉంది. తెదేపా తన కార్యకర్తల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రమాదబీమా పథకం ద్వారా నామినీ అయిన వెంకటేశ్వర రావుగారి పేరున రూ.2 లక్షల ఆర్థిక సాయం బ్యాంకులో జమచేయబడింది. 'పార్టీ కోసం అహరహం కృషిచేసే కార్యకర్తల కాళ్ళకు మొక్కుదాం... సంక్షేమ విభాగం ద్వారా వారి ఋణం తీర్చుకుందాం' అన్నది తెదేపా నినాదం, సిద్ధాంతం. 0 ఇంకా చదవండి 467 పార్టీ కోసం మీరు... మీకోసం పార్టీ...
  • గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ ఈ రోజు (25 ఏప్రిల్, 2016.. సోమవారం) ఉదయం 4.01 లకు ప్రారంభించారు. అనంతరం విశ్వక్సేనపూజ, వాస్తుపూజ, గణపతి హోమం తదితర కార్యక్రమాలను చంద్రబాబు నిర్వహించారు. సీఎం ఆఫీసు కోసం నాలుగో బ్లాక్‌లో రెండు గదులను అధికారులు సిద్ధం చేయగా, చంద్రబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన కార్యాలయంలో ఉత్తరాభిముఖంగా ముఖ్యమంత్రి ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల చేస్తూ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూన్‌లో మంచి రోజులు లేనందున ఈరోజే సచివాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. జూన్‌ 15 నాటికి సచివాలయ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు కార్యాలయం లేకపోతే బస్సులోనే ఉండి పనిచేశానన్నారు. డబ్బులు లేకపోయినా... రైతుల జీవితాల్లో వెలుగులు చూడాలని రూ.24వేల కోట్లతో రుణమాఫీ చేసినట్లు చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తానని చెప్పారు. రైతులు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు. విభజించే ముందు కనీసం మనల్ని పిలిచి మాట్లాడకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. 0 ఇంకా చదవండి 466 గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనం
  • రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మూడోవంతుకు పైగా డ్రైవర్ల కారణంగానే జరుగుతున్నాయి. ఇందులో డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు సరైన అనుభవం లేకపోవడమూ ఓ కారణం. అందుచేత  డ్రైవర్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చేందుకు దక్షిణభారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐడీటీఆర్‌) ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ.18.51 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుకు సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లిలో భూమిపూజ జరిగింది. 2018 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇందులో డ్రైవింగ్‌ నేర్చుకొనేవారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రమాదాలు, వాటి నివారణపై పరిశోధనలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వెయ్యి మందికి ఈ కేంద్రంలో హెవీ & లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తారు. 14,500 మంది హెవీ వెహికల్ డ్రైవర్లకు, ప్రమాదకర సరుకుల్ని తీసుకెళ్లే 4 వేల మంది డ్రైవర్లకు పునశ్చరణ శిక్షణ నిర్వహిస్తారు.  ఐడీటీఆర్‌లో డ్రైవింగ్‌ పరీక్షలో అధికారుల ప్రమేయం ఉండదు. కంప్యూటరైజ్డ్‌ పరీక్ష విధానం ఉంటుంది. డ్రైవింగ్‌ ట్రాక్‌లో సెన్సర్లుంటాయి. సరిగా డ్రైవింగ్‌ చేసినవారే పాస్‌ అవుతారు. దీనివల్ల అవినీతికీ అడ్డుకట్ట పడుతుంది. సుశిక్షితులైన డ్రైవర్లకే లైసెన్సు వస్తుంది. ఐడీటీఆర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో 3.5 కిమీ మేర డ్రైవింగ్‌ ట్రాక్‌తోపాటు శిక్షకులు ఉంటారు. కొత్తగా డ్రైవింగ్‌ నేర్చుకునేవారికి శిక్షణ, లైసెన్సు ఉన్నవారికి పునశ్చరణతో పాటు డ్రైవింగ్‌ స్కూల్స్‌ శిక్షకులకు కూడా ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు 0 ఇంకా చదవండి 465 దక్షిణ భారతదేశంలో తొలి ఐడీటీఆర్‌ కేంద్రం దర్శిలో అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం
  • ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖకు 2014-15 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘ఇంక్రిమెంటల్‌ డెవల్యూషన్‌ ఇండెక్స్‌ అవార్డు’ లభించింది. దీన్ని సాధించేందుకు కృషిచేసిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. పంచాయతీ, ఇతర నిధులను ఉపాధి హామీ పథకంతో జోడించి గ్రామాల్లో పనిచేసే ప్రతి కుటుంబానికీ అదనపు ఆదాయం కల్పించడం, మెరుగైన సిమెంటు రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించడం, మొక్కలు పెంచడం, నీటి సంరక్షణ విధానాలు పాటించడంతోపాటు సత్వర గ్రామీణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ పురస్కారం లభించింది.  ఆదివారం జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జె ఆర్ డి టాటా కాంప్లెక్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని చేతులమీదుగా ఏపీ పంచాయత్ రాజ్ శాఖామంత్రి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతోపాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని కూడా ఆయన అందుకున్నారు.  అలాగే ఆదాయసృష్టి, ఆదాయవృద్ధి విభాగాల్లో విజయనగరం జిల్లా ప్రజాపరిషత్‌, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, చిత్తూరు జిల్లా పూతలపట్టు, కుప్పం, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ప్రజాపరిషత్‌, విశాఖపట్నం జిల్లా ధర్మసాగరం పంచాయతీలకు అవార్డులు వచ్చాయి. ఇక సాధారణ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా వెలివెన్ను, ప్రకాశం జిల్లా పామూరు, కృష్ణా జిల్లా చోడవరం పంచాయతీలకు పురస్కారాలు లభించాయి. 0 ఇంకా చదవండి 25 ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖకు జాతీయ పురస్కారం

Pages