ఇటీవలి వార్తలు

  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ ఎ-1 కన్వెన్షన్ సెంటర్ లో నవనిర్మాణ దీక్ష వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు అన్నివిధాలా కృషి జరుగుతోందని అన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు కనీసం రూ.10 వేల ఆదాయం వచ్చేలా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని, ఉపాధిహామీ కూలీలకు రూ.194ల వేతనం అందుతుందని అన్నారు.  సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు విద్యుత్తు లేకుండా నానా తంటాలు పడితే ఇప్పుడు నిమిషం తక్కువ కాకుండా ఏడు గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులను రైతులు గమనించాలన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పూర్తిచేసి రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. రైతులకు రాయితీతో పశుగ్రాసం అందిస్తామన్నారు. ఊరిని బాగుచేసుకోవడం కూడా దేశభక్తే అవుతుందని చంద్రబాబు అన్నారు. 0 ఇంకా చదవండి 881 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ ఎ-1 కన్వెన్షన్ సెంటర్ లో నవనిర్మాణ దీక్ష వారోత్సవాలను నిర్వహించారు.
  • మనిషి లేకపోయినా ప్రకృతికి ఏమీకాదు. కానీ ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధక మవుతుంది. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత. అందుకే ప్రపంచవ్యాప్తంగా నేడు పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. 1972 సవంత్సరం జూన్ 5 వ తేదీన స్వీడన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను సంతరించుకుంది. దార్శనిక దృక్పథం కలిగిన చంద్రబాబు పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ఏనాడో గుర్తించారు. నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా ఉద్యమస్థాయిలో చెట్లను నాటిస్తున్నారు. భూగర్భ జలాల పెంపుకు పంట కుంటలు తవ్విస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చెట్లు పూర్తిగా క్షీణించిన ఆవరణ వ్యవస్థను సైతం పునరుజ్జీవించేలా చేస్తాయి. భూగర్భ నీటి మట్టాన్ని రీచార్జి చేస్తాయి. వరదలు, భారీ వర్షాల సమయంలో నేల కోతను అరికడతాయి. కురిసే వర్షం ఎక్కడికక్కడ భూమిలో ఇంకకుండా ప్రవహిస్తూ పొతే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితో పాటు కొట్టుకుపోతాయి. దానివల్ల భూమి సారం తగ్గుతుంది. దీనివల్ల రైతులు రసాయనాలను వాడవలసి వస్తోంది. అందుకే చెట్లను నాటడం అవసరం. అలాగే వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయేలా ఇంకుడుగుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పంట సంజీవని పథకం ద్వారా పదిలక్షల పంట కుంటల త్రవ్వకానికి నడుం కట్టింది. ప్రభుత్వానికి సహకరిస్తూ మనమూ పర్యావరణ పరిరక్షణ చేద్దాం. 0 ఇంకా చదవండి 877 మనిషి లేకపోయినా ప్రకృతికి ఏమీకాదు.
  • స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలోని, అరకు మండలం కింది 'పెదబలుడు' పంచాయితీని జనవరి 2015లో దత్తత తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లా మన్యంలోని అరకులోయ నియోజకవర్గ పరిధిలోని పెదలబుడు పంచాయతీ పరిధిలో అరకులోయతోపాటు గంజాయిగూడ , నువగూడ, పిట్టమామిడి వలస, పాత విష్ణుగూడ, లిట్టిగూడ, గరుడగూడ, కాంగులగూడ, శరభగూడ తదితర 22 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. 11,280 మంది జనాభా ఉన్న ఈ పంచాయతీలో 2,655 కుటుంబాలు ఉన్నాయి. విశాఖ మన్యంలోని ఆ పల్లెల్లో ప్రస్తుతం ప్రగతి పరుగులు పెడుతోంది. తాగునీరు, సిమెంట్‌ రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంట కుంటలు, ఇంకుడు గుంతలు, పాఠశాల భవనాలు, సౌర వెలుగులు ఇలా.. అన్నీ చకచకా వచ్చేస్తున్నాయి. ఆకర్షణీయ గ్రామాలు, వార్డుల కార్యక్రమంలో భాగంగా అన్ని కుటుంబాలకు పక్కా ఇళ్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, తాగునీటి కుళాయి, ప్రతి గ్రామానికి సిమెంటు రహదారులు, అనుసంధాన రహదారులు, సాగునీటి అభివృద్ధి పనులు, పచ్చదనం అభివృద్ధికి పనులు, పాఠశాలల అభివృద్ధి, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులకు రూ.13 కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.4.89 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. పెదలబుడు పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులు: పెదలబుడులో రూ.16 లక్షలతో తాగునీటి పథకం.  లిట్టిగుడలో రూ.5 లక్షలతో సౌర విద్యుత్తు తాగునీటి పథకం.  పానిరంగిని, రవ్వలగుడ గ్రామాల్లో రూ.6 లక్షలతో తాగునీటి పథకాలు.  గరడగుడలో రూ.4 లక్షలతో హైడ్రాలిక్‌ విధానంలో తాగునీటి పథకం.  పెదలబుడులో రూ.25 లక్షలతో సామాజిక భవనం నిర్మాణం జరుగుతోంది.  అరకులోయలో రూ.25 లక్షలతో సామాజిక భవన నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి  22 గ్రామాల పరిధిలో 25 కిలోమీటర్ల మేర సిమెంట్‌ రహదారులకు 9.7 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఎనిమిది రోడ్ల నిర్మాణం పూర్తయింది.  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.85 లక్షలతో 85 పొలం కుంటల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు.  పంచాయతీలో ఇప్పటివరకు 1,261 మందికి గృహాలిచ్చారు. ఇంకా 413 మందికి గృహాల మంజూరుకు ప్రతిపాదనలను పంపించారు 0 ఇంకా చదవండి 875 స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలోని, అరకు మండలం కింది 'పెదబలుడు' పంచాయితీని జనవరి 2015లో దత్తత తీసుకున్నారు.
  • ఏడు మిషన్లతో ఆరంభమైన మన ప్రగతి ప్రస్థానం ఏడాది తిరిగే సరికే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా నిరుత్సాహకర పరిస్థితి వుండగా, దానికి భిన్నంగా జాతీయస్థాయిలో కనిపించిన ఆశావాహ దృక్పధాన్ని ఆలంబనగా తీసుకుని, కొత్త రాష్ట్రంలో పరవళ్లు తొక్కే ఉత్సాహాన్నే ఊతంగా మార్చుకుని తొలి ఏడాదిలోనే అద్భుతమైన ఆర్థిక ఫలితాల్ని సొంతం చేసుకున్నాం. 10.9శాతం వృద్ధి రేటును సాధించాం. పదేళ్ల పాలనకు సంబంధించిన సమస్యలు, రాష్ట్ర విభజన తెచ్చిన సంక్లిష్టతలు, ఇలా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వున్నా రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఈ ప్రభుత్వం సాధించిన తొలి విజయం. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా 7వ స్థానంలో, జనాభాపరంగా 10వ స్థానంలో ఉంది. అయినా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 10.9 శాతం వృద్ధిరేటు నమోదుచేసుకుంది. అంతకుముందు ఏడాది కంటే 2.1 శాతం వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలలో కలిపి 8.40 శాతం, పరిశ్రమల రంగంలో 11.13 శాతం, సేవల రంగంలో 11.39 శాతం వృద్ధి కనిపించింది. తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష రూపాయిలకు పైగా నమోదు కావడం మరో రికార్డు. 7జిల్లాలలో తలసరి ఆదాయం లక్ష రూపాయిలుగా ఉంది. అంతకుముందు ఏడాది తలసరి ఆదాయం రూ.97,855 కాగా, 2015లో 1.07 లక్షలకు చేరుకుంది. జీఎస్‌డీపీలో మన రాష్ట్రం 8వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చింది. తలసరి ఆదాయంలో 9వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరుకుంది.  నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన రెండేళ్ల వ్యవధిలోనే రెండంకెల సుస్థిర వృద్ధి రేటు సాధించడం నిజంగా అపూర్వం, అనితర సాధ్యం. అభివృద్ధి దార్శనికత, ఆర్థికాభివృద్ధికి అనుసరిస్తున్న సమగ్ర ప్రణాళిక, సమర్ధ కార్యాచరణ వల్లనే ఈ వృద్ధి మనకు సాధ్యమైంది. ఇదే ఉత్సాహంతో 2016-17 సంవత్సరానికి 15 శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.  2016-17కు భారీగా లక్ష్యాలు 2016-17 ఆర్ధిక సంవత్సరంలో లక్ష్యాలను కూడా ప్రభుత్వం నిర్దేశించుకుంది. రూ. 6,66,634 కోట్లు జీవీఏ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రాథమికరంగంలో రూ.2,02,365 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.1,52,706 కోట్లు, సేవల రంగంలో 3,11,563 కోట్లు ఆర్జించాలని నిర్ణయించింది.  ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 19.54 శాతం 2016-17లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు 19.54 శాతంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16లో దేశ సగటు వృద్ధి 7.6 శాతంగా ఉండగా, రాష్ట్ర వృద్ధి 10.99 శాతంగా ఉంది. దాంతో రాష్ట్ర వృద్ధి గణనీయంగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర స్థూల అదనపు విలువ రూ.6,66,634 కోట్లుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు తిరోగమనంలో ఉన్న వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళిక రూపొందించారు. 0 ఇంకా చదవండి 876 ఏడు మిషన్లతో ఆరంభమైన మన ప్రగతి ప్రస్థానం ఏడాది తిరిగే సరికే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 3 నుండి  జూన్ 8 వరకు ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి సంబందించిన విషయాలపై చర్చించడానికి ప్రోత్సహించడం జరుగుతుంది.  'మహా సంకల్పం' కార్యక్రమం దీక్ష అంతిమ ప్రోగ్రాం, జూన్ 8 న ఒంగోలు వద్ద నిర్వహించబడుతుంది. 0 ఇంకా చదవండి 874 విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అతను ప్రజలందరితో ప్రమాణం చేయించారు.

Pages