ఇటీవలి వార్తలు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ & ఆహారశుద్ధి (అగ్రో & ఫుడ్ ప్రాసెసింగ్ ) రంగంలో అనేక పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించింది. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులతో తరలివచ్చిన పరిశ్రమల వివరాలివి... పెప్సికో - శ్రీ సిటీలో ఏప్రిల్ 3, 2015న రూ.1600 కోట్లతో నిర్మించిన పెప్సికో ప్లాంటును జాతికి అంకితం చేశారు చంద్రబాబు. రూ.1200 కోట్ల వ్యయంతో చేపట్టిన పెప్సికో సంస్థ తొలి యూనిట్ పనిని ప్రారంభించింది. అంతకు ముందు దావోస్ 2015 సమావేశాలలో పెప్సీ సంస్థ తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి శుద్ధి ప్లాంటును పెట్టేందుకు కూడా ప్రతిపాదించింది. మొత్తమ్మీద పెప్సికో సంస్థ ద్వారా 8000 ఉద్యోగాలు రానున్నాయి.  క్యాడ్ బరీ - ప్రఖ్యాత చాక్లెట్ ఉత్పత్తుల తయారీ సంస్థ మాండలేజ్ (పాత పేరు క్యాడ్ బరీ)  పసిఫిక్ ఆసియా లోనే అతిపెద్ద ప్లాంటును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పనుంది. రూ. 1000 కోట్ల పెట్టుబడితో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీ సిటీ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్లాంటును స్థాపిస్తున్నారు. ఉత్పాదక ప్లాంటు గానే కాకుండా దీనిని ఎగుమతుల కేంద్రంగా కూడా తీర్చిదిద్దనున్నారు. ఈ మల్టీ కేటగిరీ ఫుడ్ క్యాంపస్ లో చాక్లెట్లతో పాటు బిస్కట్లు, పానీయాలు, క్యాండీలు కూడా తయారవుతాయి  కెల్లొగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - చిత్తూరులో రూ.338 కోట్లతో చాకోస్, ఓట్స్ వంటి రెడీ టు ఈట్ ఆహార ఉత్పత్తుల విభాగాన్ని ప్రారంభించింది. దీనివల్ల 360 మందికి ఉపాధి లభించింది బ్రిటానియా - చిత్తూరు జిల్లాలో రూ.145 కోట్లతో అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే భూ కేటాయింపులు జరిగాయి. దీనివల్ల వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి. తొలిదశ ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ప్రారంభిస్తారు ఏపీకి తరలివచ్చిన మరికొన్ని ప్రసిద్ధ సంస్థలలో గోద్రెజ్ అగ్రోవెట్, ఆంధ్రా షుగర్స్, గోడ్ ఫ్రెయ్ ఫిలిప్స్, పెన్నార్ ఆక్వా ఎక్స్ పోర్ట్స్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ వంటివి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్, నెల్లూరు జిల్లాకు ఫెడోర సీఫుడ్స్, తూర్పు గోదావరి జిల్లాకు సీపీఎఫ్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్, సీపీ ఆక్వాకల్చర్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ తదితర సంస్థలు వచ్చాయి.  ఇక రానున్న అగ్రో & ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలలో అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ రూ.90 కోట్ల పెట్టుబడితో 900 మందికి ఉపాధి ఇవ్వనుంది. ఒలం అగ్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రూ.20కోట్లతో జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. మరో సంస్థ పెన్వెర్ ప్రొడక్ట్స్ రూ.50 కోట్లతో నెలకొల్పనున్న ఆక్వా ప్రాసెసింగ్ ద్వారా 2,000 మందికి ఉపాధి అందనుంది. రుచి సోయా ఇండస్ట్రీస్, ముల్పురి ఆక్వా, చరోన్ పోక్ఫాండ్ గ్రూప్ సంస్థలు కూడా రాష్ట్రానికి త్వరలో రానున్నాయి. 0 ఇంకా చదవండి 870 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ & ఆహారశుద్ధి (అగ్రో & ఫుడ్ ప్రాసెసింగ్ ) రంగంలో అనేక పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించింది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, రాయలసీమను ఉద్యానవనాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో ఏయే పంటల్లో ఏయే దేశాలు, రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయో అధ్యయనం చేయించింది. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానశాఖ ఇందుకు సంబంధించిన గణాంకాలు సేకరించింది. ఈ వివరాల ప్రకారం ఉద్యానవన పంటల దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. కొబ్బరి, మిర్చి, ఆయిల్‌ పామ్‌, బొప్పాయి దిగుబడుల్లో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కొబ్బరి: రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. హెక్టారుకు 10.39 టన్నుల దిగుబడి వచ్చింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఇండోనేషియా ప్రథమ స్థానంలో, భారతదేశం మూడో స్థానంలో ఉన్నాయి. మిర్చి: రాష్ట్రం తొలిస్థానాన్ని దక్కించుకుంది. హెక్టారుకు సగటున 4.59 టన్నుల దిగుబడి వస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లు ఆ తర్వాత రెండు స్థానాల్లో నిలిచాయి.  ఆయిల్‌పామ్‌: హెక్టారుకు 12 టన్నుల సగటు దిగుబడితో ఆంధ్రప్రదేశే అగ్రభాగంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. బొప్పాయి: హెక్టారుకు 80 టన్నుల సగటు దిగుబడితో మొదటి ర్యాంకు పొందింది. కర్ణాటక, గుజరాత్‌లు ఆ తర్వాత రెండు స్థానాలు దక్కించుకున్నాయి. 0 ఇంకా చదవండి 867 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యానవన పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, రాయలసీమను ఉద్యానవనాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
  • గత రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ కు ఏరో స్పేస్ అండ్ డిఫెన్సు రంగాలలో పలు పరిశ్రమలు తరలివచ్చాయి. వాటిలో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) తన కార్యాలయాన్ని చిత్తూరు జిల్లాలో స్థాపించనుంది. ఎస్ ఆర్ పురం మండలం లోని కొక్కిరాల కొండ వద్ద సంస్థకు 1,103 ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.  రాష్ట్ర ప్రభుత్వంతో జనవరిలో 10న రెండు ఒప్పందాలను చేసుకున్న భారత్ ఫోర్జ్- కళ్యాణి గ్రూప్, అనంతపురంలో రూ. 1300 కోట్లతో నెలకొల్పే రక్షణ, ఏరోస్పేస్‌ తయారీ హబ్‌ ద్వారా 1000 ఉద్యోగాలు వస్తాయి. విఠల్ ఇన్నోవేషన్ సిటీ అనంతపురంలో రూ.200 కోట్లతో ఏర్పాటుచేస్తున్న డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు భూకేటాయింపు జరిగింది. దీనిద్వారా 300 మందికి ఉద్యోగాలు వస్తాయి.  ఎస్సెల్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.6,691 కోట్లతో రాష్ట్రంలో ఏరో & డిఫెన్స్ పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ విషయమై ప్రభుత్వానికి సంస్థకు మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. 0 ఇంకా చదవండి 866 గత రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ కు ఏరో స్పేస్ అండ్ డిఫెన్సు రంగాలలో పలు పరిశ్రమలు తరలివచ్చాయి.
  • రాయలసీమ ప్రాంతంపై వరుణుడు కరుణించాడు. చాలా ప్రాంతాలలో భారీ నుంచి రికార్డు స్థాయి వర్షాలు కురిపించి రైతన్నల కళ్ళల్లో ఆశలు నింపుతున్నాడు. నిన్నా మొన్న కురిసిన భారీ వర్షాలకు అనంతపురంలో వందేళ్ళ రికార్డు నమోదయ్యింది. శతాబ్దం కిందట మే16, 1915లో 80 మిల్లీమీటర్ల వర్షం కురువగా తిరిగి ఇప్పుడు 95 మిమీ వర్షం కురిసింది. కనగానిపల్లి మండలంలో అత్యధికంగా 100.3 మిమీ వర్షం కురవగా, అనంతపురం మండలంలో 89.9 మిమీ, గుంతకల్లులో 80 మిమీ కురిసింది. నిజానికి అనంతపురం జిల్లా సగటు వర్షపాతం సీజన్లో 53 మిమీ మాత్రమే ఉంటుంది. ఇక కర్నూలులోనూ 2009 తర్వాత ఇప్పుడు 46 మిమీ వర్షపాతం నమోదయ్యింది. . ఈ వర్షాలకు సీమలోని చెక్ డ్యాములతో పాటు నీటి సంరక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలన్నీ నీటితో నిండాయి. అనంతపురం జిల్లాలో 62 మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు... పంట సంజీవని కార్యక్రమం కింద జిల్లాలో ఇటీవల తవ్విన 25,000 పంట కుంటలు నీటితో నిండాయి. జిల్లాలో మొత్తం లక్ష పంట కుంటలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో రూ. 600 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. వీటిల్లో ఇప్పటివరకు 25 వేల కుంటలు ఏర్పాటు కాగా అవన్నీ వర్షపు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఉత్సాహంతో మిగిలిన లక్ష్యాన్ని అతిత్వరగా పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 0 ఇంకా చదవండి 865 రాయలసీమ ప్రాంతంపై వరుణుడు కరుణించాడు.
  • విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తరలి వచ్చిన మొదటి భారీ పరిశ్రమ హీరో మోటార్స్. ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చారు చంద్రబాబు. నవ్యాంధ్రకు సంబంధించి పారిశ్రామికంగా ఇది తొలివిజయం. చిత్తూరు జిల్లా శ్రీసిటీకి దగ్గరలో మాదన్న పాలెం వద్ద ప్లాంటును నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వంతో సెప్టెంబర్ 2014లో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న హీరో మోటార్స్ కార్పొరేషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలు తయారు చేసుకుంది. ఈ మేరకు సంస్థ మార్చి 31న ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని ప్రకారం తొలిదశలో ఏడాదికి 5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో, రూ.800 కోట్లతో నెలకొల్పే విభాగం డిసెంబర్ 2018 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. మరో రెండు దశలు వరుసగా డిసెంబర్ 2020, 2023లలో ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. తొలిదశలో 1500 మందికి, ఆ తర్వాత ఒక్కో దశకు 3,500 మందికి చొప్పున ఉద్యోగాలు వస్తాయి. శ్రీసిటీ సెజ్‌లో రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఇసుజు వాహన కర్మాగారం, భారతదేశంలో ప్రప్రధమ అడ్వెంచర్ యుటిలిటీ వెహికల్ (AUV) D-MAX V-cross వాహనం తయారీని ప్రారంభించింది. 107 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇసుజు వాహన కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 27, 2016న ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జనవరిలో 10న రెండు ఒప్పందాలను చేసుకున్న భారత్ ఫోర్జ్- కళ్యాణి గ్రూప్, ఆంధ్రప్రదేశ్ లో రూ. 2700 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. నెల్లూరు జిల్లాలో రూ.1400 కోట్ల పెట్టుబడితో ఆటోమేటివ్‌ పార్కులో పూర్తిస్థాయి బాడీ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ ప్లాంటుతో మూడు వేల మందికి ప్రత్యక్ష, మరో మూడు వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. అనంతపురంలో రూ. 1300 కోట్లతో నెలకొల్పే రక్షణ, ఏరోస్పేస్‌ తయారీ హబ్‌ ద్వారా 1000 ఉద్యోగాలు వస్తాయి. భాగస్వామ్య సదస్సులో తొలిరోజు పారిశ్రామిక రంగంలో రూ. 50,090 కోట్ల విలువైన 9 ఒప్పందాలు కుదిరాయి. వీటిల్లో అశోక్ లేలాండ్, చిత్తూరు జిల్లాలో రూ.1000 కోట్లతో బాడీ బిల్డింగ్ యూనిట్ ను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా 2000 ఉద్యోగాలు వస్తాయి. 0 ఇంకా చదవండి 864 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తరలి వచ్చిన మొదటి భారీ పరిశ్రమ హీరో మోటార్స్.

Pages