ఇటీవలి వార్తలు

  • ఈ రోజు ఉదయం 9 గంటలకు తిరుపతిలో 34వ మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు.. ప్రజాప్రతినిధులు.. వివిధ కేడర్‌లోని నాయకులు ఏటా కలుసుకునే పెద్దపండుగ మహానాడు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని జరిగే ఈ మహానాడులో పార్టీపరంగా మున్ముందు వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన విధివిధానాలు ఇందులో చర్చిస్తారు. తిరుపతిలో తెదేపా మహానాడును నిర్వహించడం ఇది మూడోసారి. 2003లో తిరుచానూరు మార్గంలోని శిల్పారామంలో జరిగింది. 2007లో నెహ్రూ మున్సిపల్‌ మైదానంలో జరిగింది. ఇప్పుడు నెహ్రూ మున్సిపల్‌ మైదానాన్ని వేదికగా చేసుకున్నారు 1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో.. ఆవిర్భావ ప్రకటన చేసింది తిరుపతిలోనే. ఆ సందర్భంగా అదే ఏడాది మే 27న ప్రతినిధుల మహాసభను త్యాగరాయ మండపంలో పెద్దఎత్తున నిర్వహించారు ఎన్టీఆర్. కొంతమంది దానినే తొలి మహానాడుగా అనుకుంటారు. ఆపై 28, 29 తేదీల్లో రెండ్రోజులపాటు తరలివచ్చిన అశేష అభిమానుల నడుమ తిరుచానూరు మార్గంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. అలా తిరుపతి వేదికగా తెదేపా కార్యక్రమాలకు ఎన్టీఆర్ నాంది పలికారు. అప్పటినుంచి ప్రతీ కార్యక్రమాన్ని పరమపవిత్రమైన తిరుపతి నుంచి ప్రారంభించడం తెలుగుదేశం పార్టీకి సంప్రదాయంగా మారింది. ఎన్టీఆర్‌ హయాంలోనూ పలు కార్యక్రమాలకు ఇక్కడే బీజం పడింది. ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలను ధరించింది కూడా ఇక్కడే. చంద్రబాబునాయుడు సారథ్యంలో కూడా ‘యువ శంఖారావం’, ‘రైతు కోసం’, ‘మీకోసం’, ‘ఎన్నికల శంఖారావం’, అమరావతి రాజధాని నిర్మాణానికి ‘మనమట్టి-మననీరు- మనరాజధాని’.. ఇలా ఎన్నో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు తిరుక్షేత్రం వేదికగా నిలిచింది. అవన్నీ విజయవంతమయ్యాయి కూడా. దీంతో ఇదే సెంటిమెంట్‌తో జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత తొలి మహానాడుకు తిరుపతి వేదిక అయ్యింది. 0 ఇంకా చదవండి 855 ఈ రోజు ఉదయం 9 గంటలకు తిరుపతిలో 34వ మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది.
  • కరవును ఎదుర్కోడానికి ముందు చూపుతో రైతు పొలంలోనే పంటకుంట త్రవ్వే వినూత్న పంటసంజీవని కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు. వర్షాకాలం రాకముందే ఈ కుంటల త్రవ్వకాన్ని పూర్తిచేయాల్సి ఉంది. అయితే తమ పొలంలో కొంత స్థలాన్ని ఇలా గుంట తవ్వకానికి కేటాయించడం నచ్చని కొంత మంది రైతులు ప్రభుత్వ పిలుపుకు స్పందించలేదు. చంద్రబాబు ఎండలను సైతం లెక్కచేయక ప్రతి జిల్లాలోనూ సభలు, సమావేశాలూ ఏర్పాటుచేసి రైతులకు జల సంరక్షణ గురించి వివరించారు. పంటకుంట తవ్వించుకోమని రైతులకు నచ్చచెప్పారు. దీంతో కొంతమంది రైతులు ముందుకు రాగా ఎట్టకేలకు 2 లక్షల పంటకుంటలను నిర్మించారు. ఇటీవల రాష్ట్రంలో దాదాపు 7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలకు కొత్త పంటకుంటల్లో నీరు నిండింది. తమ పొలంలోనే నీటి వనరును చూసిన రైతులు సంబరపడుతున్నారు. దీంతో కథ మారింది. నిన్నటి వరకు పంటకుంట తవ్వకాన్ని ఇష్టపడని రైతులు, ఇప్పుడు 'మా పొలాల్లో కూడా పంటకుంట తవ్వించ'మని అధికారులను స్వయంగా కలుస్తున్నారు. రైతుల నుంచి వస్తున్న స్పందన చూసిన చంద్రబాబు పంటకుంటల తవ్వకాన్ని ఉదృతం చేయాలనీ, సంప్రదించిన ప్రతి రైతు పొలంలో కుంట ఏర్పాటుచేయాలనీ అధికారులను ఆదేశించారు. ఇది వరకు రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల కుంటల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి, ఇప్పుడు 10 లక్షల కుంటలను లక్ష్యంగా ఇచ్చారు చంద్రబాబు. జూన్ 13కల్లా 5లక్షల పంటకుంటలను ఏర్పాటుచేయాలని నిర్దేశించారు. 0 ఇంకా చదవండి 854 కరవును ఎదుర్కోడానికి ముందు చూపుతో రైతు పొలంలోనే పంటకుంట త్రవ్వే వినూత్న పంటసంజీవని కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు.
  •  శ్రీ  నారా చంద్రబాబు నాయుడు  అధ్యక్షత న విజయవాడ లో  రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. రెండంకెల వృద్ధి వేగాన్ని అందుకోవడంలో దృష్టి ఉంటుంది. అతను 'రెండంకెల వృద్ధి మరియు హ్యాపీనెస్ కోసం గవర్నెన్స్' తన ప్రారంభ ప్రసంగం ఇచ్చారు. 0 ఇంకా చదవండి 853 శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత న విజయవాడ లో రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు.
  • విజయవాడ స్వరాజ్‌ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ‘సిటీ స్క్వేర్‌’ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. చైనాకు చెందిన జీఐసీసీ సంస్థ రూపొందించిన ఈ డిజైన్లను, ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి దృవీకరించారు. సిటీ స్క్వేర్‌ లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పార్కింగ్‌ ఏరియాలు ఉంటాయి. సిటీ స్క్వేర్‌ నిర్మాణం పూర్తయితే...స్వరాజ్‌ మైదానంలో సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించుకోవటానికి గతంలో కంటే రెండున్నర రెట్ల మేర ఎక్కువ స్థలం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ మైదానంలో ఉన్న రైతుబజారును స్థానిక అలంకార్‌ థియేటర్‌ సమీపంలోకి తరలించనున్నారు. అక్కడ రూ.4 కోట్ల వ్యయంతో, 350 అధునాతన స్టాళ్ళతో అత్యాధునికంగా రైతు బజారును ఏర్పాటు చేయనున్నారు. 0 ఇంకా చదవండి 848 విజయవాడ స్వరాజ్‌ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ‘సిటీ స్క్వేర్‌’ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు.
  • శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పరిశీలించేందుకు ఒక రోజు బిజీగా  గడిపారు. గుంటూరు జిల్లాలో విజయవాడ మరియు వెలగపూడి చుట్టూ జరుగుతున్న పనులను పరిశీలించారు. 0 ఇంకా చదవండి 850 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పరిశీలించేందుకు ఒక రోజు బిజీగా గడిపారు.

Pages