ఇటీవలి వార్తలు

  • కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు ఒక వేదిక ఎంతైనా అవసరం. అందుకు విశాఖ అనువైనదిగా చంద్రబాబు నిర్ణయించడంతో, దాదాపు రూ.350 కోట్ల అంచనా వ్యయంతో ఒక ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ విలేజ్ (సమీకృత క్రీడా గ్రామం)ను విశాఖ నగర శివారు గండిగుండంలో 79.2 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రీడా గ్రామ నమూనాను ఎనిమిది ప్రఖ్యాత అర్కిటెక్చర్‌ సంస్థలు సిద్ధం చేయగా, వీటిలో మూడింటిని ప్రాథమికంగా కమిటీ ఎంపిక చేసింది. ఇందులో ఒక నమూనాను త్వరలో ఖరారు చేసి.. క్రీడా గ్రామ నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలువనున్నారు. ఏడాదిన్నర వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సమీకృత క్రీడా గ్రామంలో క్రికెట్‌ మినహా అన్ని ఇండోర్‌, అవుట్‌డోర్‌ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమివ్వనున్నారు. ఆయా క్రీడల్లో శిక్షణతోపాటు జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేలా దీన్ని తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రతి క్రీడ కోసం రెండు సింథటిక్‌ ట్రాకులు సిద్ధం చేయనున్నారు. ఒకటి శిక్షణ నిమిత్తం, మరొకటి పోటీల కోసం ఉపయోగిస్తారు. ఇలా రెండు ట్రాకులు ఉంటే తప్ప అంతర్జాతీయ క్రీడా పోటీలకు అవకాశం లేదు. దీంతో ఆ దిశగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకుంటోది. ఇక్కడ ఇండోర్‌ క్రీడలైన బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌, కరాటే, జిమ్మాస్టిక్స్‌, టేబుల్‌ టెన్నీస్‌, రింగ్‌ టెన్నీస్‌, కబడ్డీ, చెస్‌ ... అవుట్‌డోర్‌ క్రీడలైన ఆర్చరీ, షూటింగ్‌, అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌.. ఇలా అన్ని రకాల క్రీడల కోసం ఏర్పాట్లు చేయనున్నారు. ఏడాది పొడవునా ఈ క్రీడా గ్రామంలో కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. 0 ఇంకా చదవండి 851 ఏపీలో మొదటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా విశాఖ
  • తెదేపా అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు బిల్లును తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించి బిల్లుకు శాసనసభ ఆమోదం పొందింది. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం వర్సిటీల ఏర్పాటుకు 15 విద్యా సంస్థలు దరఖాస్తు చేశాయి. వీటిని నిపుణుల కమిటీ మూడు దఫాలుగా పరిశీలించింది. అమిటీ, ఎస్‌.ఆర్‌.ఎం., విట్‌, ఫిషరీస్‌, సెంచూరియన్‌, ఐఎఫ్‌ఎంఆర్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చి), వరల్డ్‌ పీస్‌ యూనివర్సిటీ, వేల్‌టెక్‌, కారుణ్య, సవితా, ఇతర సంస్థలు దరఖాస్తులు చేయగా... ప్రత్యేక కమిటీ తొలివిడత ఐదింటికి అంగీకార పత్రాలు (లెటర్‌ ఆఫ్‌ ఇటెంట్‌) అందించనుంది. వీటిల్లో 'అమిటీ', 'విట్' వర్సిటీలు ఈ ఏడాది నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. అమిటీ: పదేళ్లలో 11 వేల మంది విద్యార్థుల్ని చేర్చుకుంటుంది. రూ. 425 కోట్లు వ్యయం చేయనుంది. విశాఖపట్నం, అమరావతిల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఎన్విరాన్‌మెంట్‌ టెక్నాలజీ, లాజిస్టిక్స్‌లో డిగ్రీ, పీజీ కోర్సులు నిర్వహించనుంది. విట్‌: పదేళ్లలో 32 వేల మందిని చేర్చుకోనుంది. అమరావతిలో కార్యకలాపాల్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సుమారు రూ. 3400 కోట్లు వ్యయంచేసే అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ, మల్టీడిసిప్లనరీ కోర్సులు నిర్వహించనుంది. మిగిలిన మూడింటిలో ఎస్‌.ఆర్‌.ఎం. సంస్థ మెరైన్‌ బయాలజీలో డిగ్రీ, పీజీ కోర్సుల్ని నిర్వహించనుంది. భవిష్యత్తులో మెడికల్‌, డెంటల్‌, నర్సింగ్‌ కళాశాలలను స్థాపించే అవకాశం ఉంది. ఆనంద్‌ సంస్థ భీమవరంలో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఐదు యూజీ, ఐదు పీజీ కోర్సుల్ని ప్రారంభించనుంది. సెంచూరియన్‌: ఒడిశాకు చెందిన ఈ విశ్వవిద్యాలయం విజయనగరంలో రానుంది. దీనిని నైపుణ్యాలభివృద్ధికి దోహదపడే విశ్వవిద్యాలయంగా పేర్కొంటున్నారు. చదువులను మధ్యలో ఆపేసిన వారికి, ఇతరులకు ఈ వర్సిటీ తరగతులు నిర్వహించనుంది. 0 ఇంకా చదవండి 852 ఏపీలో అయిదు ప్రైవేట్ వర్సిటీలు ఈ ఏడాది నుంచే రెండు వర్సిటీల కార్యకలాపాలు
  • 5నెలల్లో నదుల అనుసంధానం చేసిన చంద్రబాబు కార్యదక్షతకు మరో నిదర్శనంగా ఫైబర్ గ్రిడ్ నిలువనుంది  జూన్‌ నాటికి 1.30 కోట్ల కుటుంబాలకు ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, కేబుల్‌ టీవీ సౌకర్యాలు కల్పిస్తామన్న చంద్రబాబు మాటను నిలబెట్టేలా గ్రిడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి 0 ఇంకా చదవండి 847 చంద్రబాబు పట్టుదలకు నిదర్శనంగా... వేగంగా కొనసాగుతున్న ఫైబర్ గ్రిడ్ పనులు.
  • రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే సరిపోదని. వాటిని నిరూపిస్తే మంత్రులను ఇప్పుడే తప్పిస్తానని జగన్ కు అసెంబ్లీలోనే సవాలు విసిరారు చంద్రబాబు. నిజంగా ఇదొక సంచలనం. తమ ఆరోపణల్లో దమ్ముంటే ప్రతిపక్షానికి ఇదొక సదవకాశం. ముఖ్యమంత్రి సవాలునే స్పీకర్ కూడా ప్రతిపాదించారు. ఇంత ధైర్యంగా ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు ప్రతిపక్షం తోక ముడిచింది. సిబిఐ విచారణ కావాలంటూ మెలిక పెట్టి సభనుండి జారుకుంది. తాము చేసేవన్నీ నిరాధారమైన ఆరోపణలని చెప్పకనే చెప్పింది. 0 ఇంకా చదవండి 840 రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే సరిపోదని
  • ''కులం, మతం, ప్రాంతం అనేవి ప్రజల మధ్య అనుబంధాలు పెంచేలా ఉండాలే తప్ప విడదీసేలా ఉండకూడదు. ''ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం, అందుకే అన్ని కులాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నా.  ''మాల, మాదిగలకు న్యాయం జరగలేదని ఒకాయన, కాపులకు అన్యాయం జరిగిందని ఇంకొకాయన మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఇన్నాళ్లుగా ఏంచేశారు? 0 ఇంకా చదవండి 841 నేను తప్పు చేయను... అభివృద్ధికి అడ్డుపడితే సహించను. - చంద్రబాబు నాయుడు

Pages