ఆంధ్రప్రదేశ్ నూతన మత్స్య విధానం నోడల్‌ ఏజెన్సీగా ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్‌ సొసైటీ

Tuesday, 05 May 2015 05:45

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015-20 మధ్య కాలానికి నూతన మత్స్య విధానాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గత అక్టోబర్‌ 31 తర్వాత వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులకూ ఈ నూతన విధానం కింద ప్రోత్సాహకాలు పొందడానికి అర్హత ఉంటుంది. రాష్ట్రంలో ఆక్వా ప్రాసెసింగ్‌ ప్రాజెక్టుల ఏర్పాటు పర్యవేక్షణ కోసం ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్‌ సొసైటీని నోడల్‌ ఏజెన్సీగా నియమించారు. కొత్త విధానంలో భాగంగా ఉత్పత్తి కేంద్రాల వద్దే శీతలీకరణ గోదాములు, సంచార శీతలీకరణ ఏర్పాట్లు చేస్తారు. సప్లై చైన్ విధానంలో మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అర్హులను ఎంపికచేస్తారు