మా ప్రభుత్వమే ఓ స్టార్టప్ కంపెనీ, ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టే ఇందుకు నిదర్శనం

Friday, 01 May 2015 05:15

మా ప్రభుత్వమే ఓ స్టార్టప్ కంపెనీ, ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టే ఇందుకు నిదర్శనం. 
- చంద్రబాబు నాయుడు
వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వమే అన్నిటికంటే బెస్ట్‌ స్టార్టప్‌ సంస్థ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, టీఎంఐ, కేశినేని ఫౌండేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఉద్యోగ రథం’ వాహనాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల ముంగిటకు ఉద్యోగావకాశాలను తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈ ‘ఉద్యోగ రథం’ పనిచేస్తుంది. స్థానిక ఉద్యోగాలు, స్థానిక ఉద్యోగార్థుల నడుమ సంధానకర్తగా ఈ రథం రూపుదిద్దుకుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు జాబ్స్‌ డైలాగ్‌ యాప్‌ ద్వారా 7097298399కు మిస్ట్‌కాల్‌ ఇచ్చి, తమ పేర్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో యువతకు ఉపాధి కల్పించడంలో ఇది తోడ్పడుతుంది.