Testimonials

 • శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వ్యాయామ విద్యపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సమీక్షలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, ఫిట్ నెస్ ట్రైనర్ దినాజ్ వెర్వెత్ వాలా, కెనడాకు చెందిన క్రీడ, మానసిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పాఠశాలలో వ్యాయమవిద్యను ప్రవేశపెట్టాలన్నారు.
  వ్యాయామ విద్య (ఫిజికల్‌ లిటరసీ)ను ప్రజాఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. కార్యాచరణను తక్షణమే సిద్ధం చేయాలని క్రీడాశాఖను ఆదేశించారు. ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ దీనిపై చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. క్రీడ, విద్యాశాఖలు సమన్వయం చేసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచే వ్యాయామ విద్య కార్యక్రమాలను గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అమలు చేయాలని ఆదేశించారు. సంప్రదాయ గ్రామీణ క్రీడలైన ఖోఖో, కబడ్డీ, బిళ్లంగోడు తదితరాలకు ఆదరణ కల్పించాలని.. కూచిపూడి, యోగా, ధ్యానంలాంటి మానసిక ఉల్లాసం కల్పించే అంశాలనూ చేర్చాలని సూచించారు.

 • ఎన్టీఆర్ తన పాలనాకాలంలో నిజాయితీగా పనిచేసే అధికారులకు స్వేచ్చనిచ్చారు... వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువనిచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ గా జయప్రకాష్ నారాయణ ఉండేవారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఆయన రెండేళ్లలో జిల్లాలోని లక్షన్నర ఎకరాలకి సాగునీటి సౌకర్యం కల్పించగలిగారు. వీరిద్దరి ఆలోచనల ఫలితంగా ప్రకాశం జిల్లాలో ఆనాడు చిన్నతరహా ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఒక ఉద్యమంలా సాగింది.
  నాడు జరిగిన ఓ సంఘటనను జెపీ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ గుర్తుచేసుకున్నారు. ఎత్తిపోతల పథకాల నిర్మాణంలో భాగంగా చేపట్టిన తొలి ప్రాజెక్ట్ ను ప్రకాశం జిల్లాలోని ఉలిచి గ్రామంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నారు కలెక్టరు. ముఖ్యమంత్రి పర్యటన తేదీ కూడా ఖరారయ్యింది. అయితే ఉలిచి గ్రామం కాంగ్రెస్ కి పట్టున్న గ్రామమని, ఆ ఊరికి ముఖ్యమంత్రి వెళ్లి ప్రాజెక్ట్ ప్రారంభించడం మంచిది కాదని కొందరు స్థానిక నేతలు అభ్యంతరం చెప్పారంట. ఎటూ తేల్చుకోలేని అధికారులు విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్ళగా... “పని బాగా జరిగితే కాంగ్రెస్ గ్రామం అయితే ఏంటి, తెలుగుదేశం గ్రామం అయితే ఏంటి, అంతా మనవాళ్ళే కదా.. మన రాష్ట్రం వాళ్ళే కదా.. అయినా, మేము పార్టీ పెట్టకముందు అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా.. ఇప్పుడు కొందరు మేమంటే అభిమానంతో తెలుగుదేశం లోకి వచ్చారు. మనం మంచి పనులు చేసి అన్ని గ్రామాల ప్రజల్ని మనతో కలుపుకోవాలి గాని,కొన్ని గ్రామాలకి వెళ్ళము అని మనమే వెలేస్తే ఎలా..మేము ఆ గ్రామానికి వస్తాం, ప్రాజెక్ట్ ప్రారంభిస్తాం” అని ఎన్టీఆర్ చెప్పారట. అన్నట్లు గానే ఆ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ విశాల దృక్పథానికి ఇదొక ఉదాహరణ

 • బ్రెజిల్ కు చెందిన ఉక్కు తయారీ సంస్థ గెర్డావు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత ఏడాది రూ. 500 కోట్ల పెట్టుబడితో, ఏడాదికి మూడు లక్షల టన్నుల కోక్ ను ఉత్పత్తి చేయగల భారీ కోక్ ఓవెన్ ప్లాంటును ప్రారంభించింది. నేల బొగ్గు నుంచి వాయువులను బయటకు తీసిన తర్వాత మిగిలే ఘన పదార్ధాన్ని కోక్ అంటారు. దీంతో నాణ్యమైన ఉక్కును తయారుచేయవచ్చు. ఇప్పుడా ప్లాంటును రూ.1000 కోట్లతో విస్తరింప చేయనుంది. దీనివల్ల ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం మరో రెండేళ్లలో అదనంగా రెండు లక్షల టన్నుల సామర్థ్యానికి పెరుగుతుంది. ఇంతవరకూ బ్రెజిల్ కు చెందిన ఏ సంస్థ కూడా ఇంత భారీ పెట్టుబడులను ఇండియాలో పెట్టలేదు. 
  గెర్డావు స్టీల్ కు ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో 60 ప్లాంట్ల వరకూ ఉన్నాయి. మొత్తంగా 200 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని గెర్డావూ సంస్థ కలిగివుంది.

 • గత ఏడాది నవ్యాంధ్ర తొలి మేడే ఉత్సవాలను రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్రప్రభుత్వం... ఈ ఏడాది విజయవాడలోని ఎ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో కార్మిక దినోత్సవం అయిన మేడేను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం ఈ నెల 29, 30 తేదీలలో రాష్ట్ర స్థాయి కార్మిక క్రీడా, సాంస్కృక పోటీలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో (ఐజిఎంసిఎస్‌)లో నిర్వహించారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లలో నిర్వహించిన పోటీల విజేతలు విజయవాడలో జరిగే ఈ తుది పోటీలకు హాజరయ్యారు. ఈ ఏడాది వాలీబాల్‌, కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, అథ్లెటిక్స్‌, నాటికలు, పాటల పోటీలు, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు.
  గత ఏడాది మేడే నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రవాణా వాహన డ్రైవర్ల సామాజిక భద్రతా పథకాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం రవాణా వాహన డ్రైవర్లకు రూ. 5 లక్షల వరకు ప్రమాదబీమా వర్తిస్తుంది. డ్రైవరు ప్రమాదంలో మరణిస్తే, ఆ వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యానికి రూ.75,000లు, పాక్షిక వైకల్యానికి రూ.37,500లు, సహజ మరణం అయితే రూ.30,000లు పరిహారం అందచేస్తారు. 9, 10వ తరగతి, ఇంటర్ లేదా ఐటిఐ చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1,200ల చొప్పున ఉపకారవేతనం ఇస్తారు. అలాగే గత ఏడాది ఇదే రోజున ఎపి ఉద్యోగులకు పిఆర్ సి పై 43 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేశారు చంద్రబాబు.
  కార్మికులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తోంది తెలుగుదేశం.

 • ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖకు 2014-15 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘ఇంక్రిమెంటల్‌ డెవల్యూషన్‌ ఇండెక్స్‌ అవార్డు’ లభించింది. దీన్ని సాధించేందుకు కృషిచేసిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. పంచాయతీ, ఇతర నిధులను ఉపాధి హామీ పథకంతో జోడించి గ్రామాల్లో పనిచేసే ప్రతి కుటుంబానికీ అదనపు ఆదాయం కల్పించడం, మెరుగైన సిమెంటు రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించడం, మొక్కలు పెంచడం, నీటి సంరక్షణ విధానాలు పాటించడంతోపాటు సత్వర గ్రామీణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ పురస్కారం లభించింది. 
  ఆదివారం జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జె ఆర్ డి టాటా కాంప్లెక్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని చేతులమీదుగా ఏపీ పంచాయత్ రాజ్ శాఖామంత్రి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతోపాటు రూ.2 కోట్ల నగదు బహుమతిని కూడా ఆయన అందుకున్నారు. 
  అలాగే ఆదాయసృష్టి, ఆదాయవృద్ధి విభాగాల్లో విజయనగరం జిల్లా ప్రజాపరిషత్‌, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, చిత్తూరు జిల్లా పూతలపట్టు, కుప్పం, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ప్రజాపరిషత్‌, విశాఖపట్నం జిల్లా ధర్మసాగరం పంచాయతీలకు అవార్డులు వచ్చాయి. ఇక సాధారణ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా వెలివెన్ను, ప్రకాశం జిల్లా పామూరు, కృష్ణా జిల్లా చోడవరం పంచాయతీలకు పురస్కారాలు లభించాయి.

Pages