- కౌన్సిలర్లే బ్రోకర్లుగా జోరుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ
- గుట్కా-మట్కాలతో నెలకు రూ.50 కోట్ల వ్యాపారం
- ప్రొద్దుటూరును భూకబ్జాలకు అడ్డాగా మార్చిన ఘనుడు
- పోలీసుల వద్ద కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్న ఆదర్శనేత
- ఎమ్మెల్యే నేతృత్వంలో అక్రమాలకు అడ్డాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – కడప) : ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రం యూనిట్‌గా చేసుకొని అడ్డగోలుగా దోచుకుంటుంటే ఆయనను ఆదర్శంగా తీసు కొని ముందుకు సాగుతున్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నరరూప రాక్షసుడు ఎలా ఉంటాడని చిన్నపిల్లలు ప్రశ్నిస్తే శివప్రసాదరెడ్డి ఫోటో చూయిస్తే సరిపోతుంది. ఇళ్లపట్టాలకు సంబంధించి తమ అవినీతిని బట్టబయలు చేస్తున్నాడన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీకి చెందిన బిసి నేత, జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను అతిదారుణంగా హతమార్చిన కిరాతకుడు రాచమల్లు. తమకు అడ్డువచ్చిన వారిని హతమార్చడానికి కూడా వెనుకాడని ఈ కసాయి గత మూడున్నరేళ్లలో వందలకోట్లరూపాయలు పాపపు సొమ్ము పోగేశాడు.
బంగారం వ్యాపారానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు ఇప్పుడు బెట్టింగ్‌కు, గుట్కా-మట్కాలకు, లిక్కర్, శాండ్, ల్యాండ్ మాఫియా లకు అడ్డాగా మార్చాడు రాచమల్లు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి జె-ట్యాక్స్ పేరుతో జనాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే ప్రొద్దుటూరులో ఆర్ బికె ట్యాక్స్ వసూలుచేస్తూ నియోజకవర్గ ప్రజలకు నరకం చూపి స్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు నేతృత్వంలో నియోజక వర్గంలో అసాంఘిక కార్యకలాపాలను మూడు భాగా లుగా విభజించి అడ్డంగా దోచేస్తున్నారు. కడప జిల్లా లో సాహిత్య,సాంస్కృతిక ఆధ్యాత్మిక,వ్యాపార, వాణిజ్య చరిత్ర కలిగిన ప్రొద్దుటూరును మాఫియా కేంద్రంగా మార్చిన ఘనత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికే దక్కుతుంది. ప్రొద్దుటూరులో నిత్యం ఎక్కడో ఒకచోట అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన అవాంఛ నీయ ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. నియోజక వర్గంలో సామాన్య ప్రజలతో సహా ఏ వర్గానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న ఆర్‌బికెల్లో ఆర్ అంటే రాచమల్లు, బి అంటే బంగారు మునిరెడ్డి(ఎమ్మెల్యే బావమరిది), కె అంటే కిరణ్‌కుమార్‌రెడ్డి(ఎమ్మెల్యే అన్న). బంగారం వ్యాపారానికి పెట్టిందిపేరైనా ప్రొద్దు టూరును మాఫియా సామ్రాజ్యంగా మార్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
గుట్కా – మట్కా మాఫియాకు అడ్డా
ఎమ్మెల్యే రాచమల్లు నేతృత్వంలో గ్యాంబ్లింగ్, మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు ప్రొద్దుటూరు కేంద్రంగా మారింది. ఈ 3 వ్యాపారాల ద్వారా నెలకు రూ.50 కోట్లు చేతులు మారుతుం టాయి. ఎమ్మెల్యే బామ్మర్ది మునిరెడ్డి వద్ద నుంచి గుట్కా కొనుగోలు చేస్తే జిల్లాలో ఎక్కడా ఎటువంటి కేసులు ఉండవు. అతని వద్ద కాకుండా మరెవరి వద్ద అయినా కొనుగోలు చేస్తే కేసులతో వేధిస్తారు. ప్రొద్దు టూరు నుంచి అన్ని ప్రాంతాలకు గుట్కా సరఫరా చేస్తున్నారు. ప్రొద్దుటూరులో తమ అనుయాయులతో వీధికో మట్కా కేంద్రాన్ని నిర్వహిస్తూ యువతను పెడదార్లపట్టేలా చేస్తున్నాడు. ఈ వ్యసనానికి బాని సలైన యువత ఎటువంటి అఘాయిత్యాలకైనా తెగబడుతూ చివరకు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. ఇంత జరిగినా ఎమ్మెల్యేకి కావాల్సిన పాపపు సంపా దన భారీగా వస్తుండటంతో ఈ చట్టవిరుద్దమైన గేమ్ ను పోలీసు సహకారంతో రాచమల్లు యథేచ్చగా తమ అనుయాయులతో నిర్వహిస్తున్నారు. కొన్నిసార్లు రాచమల్లు శివప్రసా ద్‌రెడ్డి నేరుగానే బెదిరింపులు, వేధింపులు, దాడులు, భూవివాదాల్లో తలదూరు స్తున్నారు. గల్లీలోని చిల్లర కొట్టు యజమాని నుంచి భూవివాదంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు ఆర్ బికెలకు ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే అవకాశమేలేదు.
రాచమల్లు నేతృత్వంలోనే కబ్జాల పర్వం
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పై లెక్కలేనన్ని భూకబ్జా ఆరోపణలున్నాయి. అవినీతి ఆకలి తీరక ఏకంగా చెరువునే మింగేయబోగా జనం ఎమ్మెల్యేపై తిరగబడ్డారంటే ఎంతటి ఘనుడో అర్థం చేసుకోవచ్చు.
1. ప్రొద్దుటూరు మండలం చౌటుపల్లి గ్రామంలో దశాబ్దాల కాలం నుంచి ఉన్న క్రిష్టియన్ చర్చికి చెందిన రూ.50 కోట్లు విలువ చేసే 7 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారు. అన్యాయాన్ని బెదిరించిన క్రైస్తవ సంఘాలపై కేసులు పెడతాన ని బెదిరింపులకు దిగారు.ఈస్థలాన్ని ప్లాట్లు చేసి ఎమ్మెల్యే బామ్మర్ది మునిరెడ్డి అమ్మకానికి పెట్టాడు.
2. ప్రొద్దుటూరు పట్టణంలో పేదవిద్యార్థులకు విద్య నందించే దేవరశెట్టి ఆదిలక్ష్మమ్మ ఉమెన్స్ కాలేజ్ (డీఏడబ్ల్యు) చెందిన 11 ఎకరాల భూమిని కబ్జా చేసి రూ.3 కోట్ల నగదు, సగానికి పైగా భూమి వాటా కొట్టేశారు. ఈ ఒక్క డీల్‌లో ఎమ్మెల్యే రూ.80 కోట్లు వెనకేసుకున్నాడు.
3. దొరసానిపల్లిలో దేవాలయాల భూములను కూడా వదిలిపెట్టకుండా మింగేశారు. 12ఎకరా ల దేవాలయ భూములను ఆక్రమించి అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడ్డారు.
4. కొత్తపల్లి కాలనీలో జగనన్న కాలనీ వస్తుందని ముందేఆలోచించి రైతులనుంచి తక్కువరేటుకు 60ఎకరాలు కొనుగోలు చేసి తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.100 కోట్లు సంపా దించారు.
5. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి అప్పగించిన భూమి మొత్తాన్ని ఎమ్మెల్యే సోదరుడు కిరణ్ కుమార్‌రెడ్డి బినామీల నుంచి అందించిందే. రైతుల నుంచి లక్ష నుంచి 2లక్షలకు కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వానికి రూ.15 నుంచి రూ.20 లక్షలకు అమ్మి రూ.192 కోట్లు సంపాదించారు.
6. ప్రొద్దుటూరు బ్కెపాస్ రోడ్డులో ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద 14 ఎకరాల పోరంబోకును కబ్జా చేసి ఎమ్మార్వోను బెదిరించి మరీ దొంగ పత్రాలు సృష్టించారు. ఈ భూమి విలువ రూ.170 కోట్లు ఉంటుంది.
7. భారతి థియేటర్‌కుచెందిన ఎకరాభూమిని ఎమ్మె ల్యే బామ్మర్ది బంగారు మునిరెడ్డి ఆధ్వర్యంలో మింగేశారు. ఈ భూమి విలువ రూ.30 కోట్లు.
8. దొరసానిపల్లె సర్వే నెం.347/1,390, 349/1 లో 12ఎకరాల భూమిని కొనుగోలుచేసి పక్క రై తులను బెదిరించి 20ఎకరాలు ఆక్రమించారు.
9. రాజుపాలెం మండలంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న గోడౌన్ యజమాని కుటు ంబ సభ్యులకు కూడా తెలియకుండా గోడౌన్‌తో పాటు రూ.30 కోట్ల విలువచేసే 13 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు. గోడౌన్ యజ మాని రైతులకు చెల్లించాల్సిన డబ్బులను నేను చెల్లిస్తానని అవినీతి రాచమల్లు ప్రగల్బాలు పలికి రైతులను నిండా ముంచారు.
కౌన్సిలర్లే బెట్టింగ్ బ్రోకర్లు
కడప జిల్లా మొత్తానికి క్రికెట్ మాఫియా ప్రొద్దుటూరు అడ్డాగా నడుస్తోంది. ప్రొద్దుటూరు పట్టణంలో ఎమ్మెల్యే సొంత భవనాల్లోనే ఈ మాఫియా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. పోలీసులు ఈ మాఫియా వైపు కన్నెత్తి కూడా చూడరు. మాఫియా బారినపడి కుటుంబాలు రోడ్డున పడుతూ ఆత్మ హత్యలకు పాల్పడుతున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయరు. ప్రతి క్రికెట్ మ్యాచ్‌కి రూ.10 నుంచి రూ.50 కోట్ల వరకు చేతులు మారతాయి. ఈ మాఫి యా నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యత ఎమ్మెల్యే సొంత బామ్మర్ది బంగారు మునిరెడ్డి చూస్తుంటాడు. ఈ చట్టవిరుద్దమైన బెట్టింగ్‌లో వైసీపీ కౌన్సిలర్లే క్రికెట్ బుకీల అవతారమెత్తడం విశేషం. కౌన్సిలర్లు ఆయిల్ మిల్ ఖాజా, నూరి, కంకర గౌస్, రఫీ, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి (ఎమ్మెల్యే బామ్మర్ధి) ప్రత్యక్ష పర్యవేక్షణలో బెట్టింగ్ యథేచ్చగా సాగుతోంది. ఈ 5 గురిని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే క్రికెట్ జరిగే సమ యాల్లో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ మాఫియా మొత్తానికి బంగారు మునిరెడ్డి సారధ్యం వహిస్తున్నారు.
అక్రమాలకు అడ్డగా మున్సిపాలిటీ
ఎమ్మెల్యే రాచమల్లు పుణ్యమా అని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అవినీతికూపంగా మారిపోయింది. ఏ ఫైల్ కదలాలన్నా ఎమ్మెల్యే ఇంటికి ట్యాక్స్ పంపాల్సిం దే. శానిట్కెజేషన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిప ల్ కమీషనర్ ఒక దశలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారనే వార్తలు వెలువడ్డాయంటే పరి స్థితి ఎంత తీవ్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే రాచమల్లు కుటుంబ సభ్యుల ఆగడాలు భరిం చలేక ఎంతోమంది అధికారులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. మున్సిపల్ పరిధిలో చిన్న వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు వసూలుచేసే బాధ్యతను ఎమ్మెల్యే రాచమల్లు బావమ రిది ప్రధానఅనుచరుడు సుదర్శన్‌రెడ్డికి అప్పగించారు. కొత్తగా భవనాలు నిర్మించుకునే మధ్య తరగతి కుటుం బీకులకూ ఈ తిప్పలు తప్పడం లేదు. స్థానిక వైసిపి నేతలైనా తృణమో, ఫణమో సమర్పించుకోవాల్సిందే. లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులతో దాడులు చేయి స్తామనో,భవనాలను కూల్చివేయిస్తామనో బెదిరిస్తున్నా రు. ఇలా ఒకటేమిటి… స్థానికంగా ఉండే షాపులు, వైన్‌షాపులు, పరిశ్రమలు, రియల్‌ఎస్టేట్ వెంచర్ల నుం చి యథేచ్చగా దందాలు కొనసాగిస్తున్నారు.
పోలీసుల నుంచి కూడా ఆర్-ట్యాక్స్
సాధారణ ప్రజలనుంచే గాకుండా పోలీసుల నుంచి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న ఆదర్శనేత ఎమ్మెల్యే రాచమల్లు. నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు ఏ పోస్టింగ్ కావాలన్నా ఎమ్మెల్యే ఇంటికి ప్రత్యేక స్వీట్ బాక్స్ కోడ్ తో నోట్లకట్టలు పంపాల్సిందే. ఇటీవల ఎమ్మెల్యే సారధ్యంలో వేసిన పోస్టింగుల్లో భారీఎత్తున చేతులు మారాయని నియోజకవర్గం మొత్తం కోడై కూస్తోంది. దీంతోపాటు ప్రతినెలా డీయస్పీ కార్యాలయం నుంచి రూ.30 లక్షలు, సీఐలనుంచి 15 నుంచి రూ.20 లక్షలు, ఒక్కో ఎస్‌ఐ నుంచి రూ.5 నుంచి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. భార్యాభర్తల పంచాయతీ వచ్చినా కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వాలిపోయి ట్యాక్స్ వసూలు చేస్తుండటంతో పోలీసు అధికారులు తలపట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే వత్తిడితో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని కేసుల్లో ఇరికించి వేధించడమే పోలీసుల విధిగా మారిపోయింది. పోలీసులు తమకు సహకరించకపోతే.. బదిలీ చేయిస్తున్నారు.
అక్రమాల అనకొండ రాచమల్లు
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇతను సంపాదిం చిన అక్రమ సంపాదనతో ప్రజలందరికీ ఉచితంగా సంవత్సరంపాటు రేషన్, నిత్యావసరాలు సరఫరా చేయవచ్చు. మాఫియా కార్యకలాపాల ద్వారా సంపా దించిన మొత్తంతో బెంగుళూరులో రూ.140 కోట్లతో రెండు భారీ కాంప్లెక్స్‌లు కొనుగోలు చేశారు. హైదరా బాద్‌లోని గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నల్లగండ్లలో మొత్తం 32 ఎకరాలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుమీదే ఉన్నాయి. దీని విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుంది.
ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్మికుల నుంచి రిజి స్ట్రార్ వరకు, వాలంటీర్ నుంచి డీయస్పీ వరకు ప్రతి ఉద్యోగానికి ఒక రేటు ఉంటుంది. పశువుల ఆసుపత్రి లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగానికి 8 మంది నుంచి రూ.80 లక్షలు, పవర్ సబ్‌స్టేషన్స్‌లో ఆపరే టర్స్ ఉద్యోగాలకు 20మంది నుంచి రూ.1 కోటి, కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక ఈ అవినీతి తిమింగలం ఆటకట్టించడం ప్రజలచేతుల్లోనే ఉంది.