- అదృశ్యశక్తి అండదండలతో విచ్చలవిడిగా దోపిడీ పర్వం
- కోట్లాదిరూపాయల యడవల్లి భూములు మింగేందుకు ప్లాన్
- బార్లనుంచి స్టోన్ క్రషర్ల వరకు అడుగడుగునా అక్రమ వసూళ్లు
- సొంతపార్టీ వారికి సైతం తప్పని బెదిరింపులు, కేసులు
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
నియోజకవర్గంలో యథేచ్చగా సాగుతున్న రేషన్ మాఫియాకు మంత్రిగారి మరిది అండదండలున్నాయి. ఇందుకుగాను నెలకు 10లక్షలరూపాయలు ముడుపులు అందుకుంటున్నారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా చౌకబియ్యాన్ని పెద్దఎత్తున తరలిస్తున్నా ఇక్కడి అధికారులుగానీ, పోలీసులుగానీ పట్టించుకోరు.
రిజిష్ట్రార్ ఆఫీసులో రజని ట్యాక్స్
చిలకలూరిపేట రిజిస్టర్ ఆఫీసులో సాధారణంగా ఏ రిజిస్ట్రేషన్ జరిగినా అదనంగా 2శాతం వసూలు చేస్తుంటారు. ఇప్పుడు అదనంగా 3శాతం రజని ట్యాక్స్ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా ప్రభుత్వ ఫీజులకు అదనంగా 5శాతాన్ని చెల్లించాల్సి వస్తోంది. చిలకలూరిపేట పరిధిలో ఏ అపార్ట్ మెంట్ నిర్మాణం జరిగినా ఫ్లాట్ కు 5లక్షల రూపాయలు రజని ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. లేకపోతే కొర్రీలు వేసి సంబంధిత అపార్ట్ మెంట్ నిర్మాణాన్ని నిలుపుదల చేయిస్తున్నారు.
గ్రానైట్ లారీలనుంచి వసూళ్లు
ఎటువంటి వేబిల్లులు లేకుండా పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా అద్దంకి, మార్టూరు నుంచి చిలకలూరిపేట మీదుగా గ్రానైట్ పెద్దఎత్తున తరలిపోతోంది. ఇందుకుగాను లారీకి 10వేల రూపాయలు వసూలు రజని ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రతిరోజూ 30లారీలకు పైగా గ్రానైట్ తరలిపోతోంది. మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఇసుక డంపింగ్ యార్డును పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడనుంచి ఎటువంటి బిల్లులు లేకుండా లారీ 20వేలరూపాయల చొప్పున తీసుకొని కావాల్సిన వారికి విక్రయిస్తున్నారు.
స్టోన్ క్రషర్లనుంచి భారీగా ముడుపులు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని స్టోన్ క్రషర్స్ యజమానులు ఏడాదికి 5కోట్లరూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకుగాను మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించకుండా ఆమె చూసుకుంటున్నారు. చిలకలూరిపేట పరిధిలో తిరిగే క్వారీ డస్ట్, గ్రావెల్ లారీలు ఏవైనా బండికి వెయ్యిరూపాయల చొప్పున రజని ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ రూపంలో నెలకు దాదాపు 50లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
అడ్డగోలు వ్యవహారాలకు అడ్డొస్తే వేటే
చిలకలూరిపేటకు చెందిన ఎస్టీ మహిళ టీచర్ ధనలక్ష్మిని తాను చెప్పిన వారిని విద్యాకమిటీ చైర్మన్ గా నియమించలేదని వేధించి సస్పెండ్ చేయించారు. చివరకు ఆమె కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో గత ప్రభుత్వ హయాంలో రెండు అంతస్తులకు నిధులు మంజూరు కాగా, ఒక అంతస్తుతో సరిపెట్టి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి నిధులు దిగమింగారు. చిలకలూరిపేట పట్టణంలో చిన్నపిల్లలకు ఏకైక రిక్రియేషన్ గా ఉన్న గాంధీపార్కును అన్ని రాజకీయపక్షాలు వద్దని చెబుతున్నా ఏకపక్షంగా తాకట్టుపెట్టేశారు. మంత్రి రజని, ఆయన మరిది గోపి అరాచకాలను వైసిపి నేతలు ప్రశ్నించినా వారికి పోలీసులనుంచి వేధింపులు మొదలవుతాయి. అడ్డగోలు అవినీతిని ప్రశ్నించిన వారికి తమదైన శైలిలో చుక్కలు చూపిస్తున్నారు.