- బ్రహ్మోత్సవాలకు వచ్చింది 5.69లక్షల మంది భక్తులు
- అన్నప్రసాదం పేరుతో రాసిన దొంగలెక్క 22లక్షలు!
- విస్తరాకుల కొనుగోళ్లలోనూ జె-గ్యాంగ్ మాయాజాలం
- 2019లో ఒక్కో ఆకు రూ.1.17పైసలు… ప్రస్తుతం 1.89పైసలు
- ఏడుకొండలవాడి సాక్షిగా అడుగడుగునా దోపిడీ పర్వమే!
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – తిరుపతి)
లక్షకోట్ల ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకుని 16 నెలలు చిప్పకూడుతిని బెయిల్‌పై తిరుగుతున్న ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రంలో ఏ ఆదాయ మార్గాన్ని వదలడం లేదు. చివరకు కోట్లాదిప్రజలు పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండను సైతం ఆదాయవనరుగా మార్చుకున్నారు. వాములు తినే స్వాములకు పచ్చి గడ్డి పలహారం అన్నట్లుగా వేలకోట్లు దోచుకున్న జె-గ్యాంగ్ ఏడు కొండలవాడి ఆలయాన్ని వదలడం లేదు. కంచే చేనుమేసిన చందంగా తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని చైర్మన్‌గా, తన జిల్లాకే చెందిన ధర్మారెడ్డిని ఈఓగా నియమించుకొని వెంకన్న సన్నిధిలో అడ్డగో లు దోపిడీ పర్వానికి తెరలేపారు.భగవంతుడంటే భక్తి, భయమూ రెండులేని జె-గ్యాంగ్ తిరుమల వెంకన్న అన్నప్రసాదం నుంచి విస్తరాకుల వరకు అన్నింటా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా జరిగిన తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలను సైతం వద లని దొంగలముఠా బాగోతం ఆధారాలతో సహా మీ ముందుకు తెస్తోంది చైతన్యరథం.
10లక్షల భోజనాలు ఎవరుతిన్నారు?
పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లి తరించాలని భక్తజనకోటి కలలుగంటారు. ప్రతిఏటా మాదిరిగానే ఏ ఏడాది కూడా టిటిడి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. 2020, 2021 సంవత్సరాల్లో కోవిడ్ కారణంగా నిరాడంబరంగా నిర్వహించగా, మూడేళ్ల తర్వాత ఈసారి బ్రహోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించాలని టిటిడి భావించింది. ఇసుకలో నుంచి వేలకోట్లు కొట్టేయవచ్చని నిరూపించిన జె-గ్యాంగ్ తిరుమల బ్రహ్మోత్సవాల్లో సైతం తమ చేతివాటానికి పదునుపెట్టింది. గతనెల 27వతేదీ నుంచి ఈనెల 4వతేదీవరకు (8రోజులు) తిరుమల బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. బ్రహోత్సవాలకు వచ్చిన భక్తులు, టిటిడి చేసిన ఏర్పాట్లపై నిన్నటి రోజున(5-10-2022)న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటుచేసి తాము బ్రహోత్స వాల్లో చేసిన ఏర్పాట్లపై ఒక నోట్ విడుదల చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు 5,68,738మంది హాజ రయ్యారని, ఈ 8రోజుల్లో 20.43కోట్ల రూపాయల హుండీల ద్వారా ఆదాయం లభించిందని తెలిపారు. అంతవరకు బాగానే ఉంది. ఆ కిందకు వెళ్తేనే అసలు మతలబు కనిపించింది. బ్రహ్మోత్సవాల్లో 20,99, 093 (దాదాపు 21లక్షలమంది)కి అన్నప్రసాదం అందించినట్లు ఆ నోట్‌లో తెలిపారు. సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల్లో గరిష్టంగా 60శాతం మంది మాత్రమే టిటిడి అన్నప్రసాదం స్వీకరిస్తారు. బ్రహ్మో త్సవాలకు వచ్చిన భక్తులంతా రెండుపూటలా టిటిడి వారందించే అన్న ప్రసాదం స్వీకరించారని అనుకున్నా 11లక్షల భోజనాలు మాత్రమే అవుతాయి. మరి ఏ లెక్కన 21లక్షలమంది అన్నప్రసాదం స్వీకరించారని టిటిడి అధికారులు లెక్కలు రాశారో వారికే ఎరుక. దీనినిబట్టి దాదాపు 10లక్షల భోజనాలను దొంగలెక్కలు రాసి జె-గ్యాంగ్ బొక్కేసినట్లు స్పష్టమవుతోంది. ఒకరోజు దాతలపేరుతో రెండుపూటల అన్నదానానికి టిటిడి 30లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. రోజూ 50వేలమంది భోజనం చేస్తారన్న అంచనాతో ఈ సొమ్ము నిర్ణయించారు. సగటున ఒక్కొక భోజనానికి అయ్యే ఖర్చు 30రూపాయలుగా నిర్ణయించారు. దీనినిబట్టి బ్రహ్మోత్సవాల్లో 10లక్షల భోజనాలను పెట్టకుండానే పెట్టినట్లు దొంగలెక్కలు రాసినట్లు వారిచ్చిన గణాంకాలను బట్టే స్పష్టమవుతోంది. బ్రహోత్స వాల్లో అన్నప్రసాదం పేరుతో జె-గ్యాంగ్ బొక్కింది అక్షరాలా 3కోట్లరూపాయలు.
పుష్పాలంకరణ పేరుతోనూ భారీ దోపిడీ
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వెంకటేశ్వ ర్వునికి పుప్పాలంకరణ పేరుతో కూడా జె-గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం ఉంది. బ్రహోత్సవాల్లో ఎనిమిదిరోజులపాటు వేంకటేశ్వర స్వామి ఆలయం, స్వామివారి అలంకరణకు దాదాపు 35టన్నుల పూలను ఉపయోగించినట్లు చైర్మన్ పేర్కొ న్నారు. ఈ పూల అలంకరణ కోసం టిటిడి దాదాపు 3కోట్లరూపాయలు వెచ్చించింది. వాస్తవానికి టిటిడి బ్రహ్మోత్సవాల్లో వాడిన పూల అలంకరణకు వాడిన నమూనాలను ఉత్పత్తిదారులకు పంపి మేం వివరాలు సేకరించగా, ఎనిమిదిరోజులకు అలంకరణ పనివారి తో కలిపి 1.3 కోట్లరూపాయలు మాత్రమే ఖర్చవు తుందని తెలిపారు. మిగిలిన 1.7కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్లాయి?
విస్తరాకుల్లోనూ జె-గ్యాంగ్ మాయాజాలమే!
తిరుమల సన్నధిలో జె-గ్యాంగ్ గత మూడేళ్లుగా వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతోంది. చివరకు అన్నదా నానికి ఉపయోగించే విస్తరాకులను సైతం వారు వదలడం లేదు. అంతా పద్ధతిప్రకారమే జరిగిందని చూపిస్తూ తమవారు తప్ప ఇతర పోటీదారులెవరూ సరఫరాకు ముందుకు రాకుండా చేసి భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. 2018 సెప్టెంబర్ నుంచి 2019 అక్టోబర్ నడుమ టిడిపిహయాంలో తిరుమలలో అన్న దానానికి వినియోగించే విస్తరాకుల కోసం పారదర్శ కంగా టెండర్లు పిలిచి రూ.1.17 చొప్పున 1.10కోట్ల విస్తరాకులు కొనుగోలు చేశారు. ఇక వైసిపి ప్రభు త్వం, కొత్త పాలకమండలి బాధ్యతలు స్వీకరించాక అక్టోబర్ 2019నుంచి మే 2021 మధ్య ఒక్కో విస్తరా కు ధర ఏకంగా 50శాతానికి పైగా పెరిగిపోయింది. ఒక్కో విస్తరాకును రూ.1.62రూపాయలు పెట్టి కొను గోలు చేశారు. కాగా, 11-7-2022న నిర్వహించిన బోర్డు మీటింగ్ లో 1.5కోట్ల విస్తరాకుల కొనుగోళ్లకు గాను ఒక్కో విస్తరాకుకు రూ.1.89రూపాయల టెండ రును ఆమోదించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం తో పోలిస్తే ఒక్కొక విస్తరాకు అదనంగా ఇస్తున్న మొత్తం 72పైసలు. పైగా దీనికి రివర్స్ టెండరింగ్ ముసుగుకూడా తగిలించారు. విస్తరాకుల టెండర్లలో పోటీలో ఉన్న శ్రీ పద్మావతి ప్లాంటెయిన్ లీవ్స్ (తిరు పతి) వారు రూ.2.04కు, చంద్రగిరికి చెందిన సురేఖ ప్లాంటెయిన్ లీవ్స్ వారు రూ.1.98కి, రేణిగుంట శ్రీ సాయి ప్లాంటెయిన్ లీవ్స్ వారు 1.94కి కోట్ చేశారు. తర్వాత రివర్స్ ఆక్షన్ కు వెళ్లగా రేణిగుంట శ్రీ సాయి ప్లాంటెయిన్ లీవ్స్ వారు 1.89పైసలకు కోట్ చేస్తే ఆ టెండరును ఆమోదించారు.
ఆ సొమ్మంతా ఎవరిజేబుల్లోకి వెళ్లింది?
2016 ఏప్రిల్‌లో తెలుగుదేశం ప్రభుత్వ హయాం లోని పాలకవర్గం కోటి విస్తరాకులకు ఖరారుచేసిన టెండరు విలువ 90పైసలు మాత్రమే. 2018 సెప్టెంబర్ వరకు గరిష్టంగా 99పైసలకు టెండర్లు ఖరారు చేశారు. 2018 సెప్టెంబర్ నుంచి 19 అక్టోబర్ వరకు కేవలం 18పైసలు అదనంగా విస్తరాకుల టెండరు ఖరారుచేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో (2016-19నడుమ) మూడేళ్లలో ఏడాదికి సగటున ఒక్కొక విస్తరాకు ధర 9పైసలు పెరిగితే, వైసిపి ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఏడాదికి సగటున 24పైసలు పెంచే శారు. ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళుతుందో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. స్వతంత్ర సంస్థ తో పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే టిటిడిలో తిష్టవేసిన జె-గ్యాంగ్ అవినీతి బయటకొచ్చే అవకాశముంది.