చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

మద్యపాన నిషేదం హామీ ఏమైంది జగన్‌రెడ్డి : టీడీపీ నేతలు

by చైతన్యరధం
Jul 14, 2022 at 12:05pm
in తాజా సంఘటనలు
మద్యపాన నిషేదం హామీ ఏమైంది జగన్‌రెడ్డి : టీడీపీ నేతలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.విషపు మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తారా?
.వైసీపీ నేతల బినామీల డిస్టలరీల్లోనే జె-బ్రాండ్స్‌ తయారీ
.అదాన్‌ డిస్టలరీపై జగన్‌ రెడ్డికి ఎందుకంత ప్రేమ ?
.మందుబాబులపై రూ.58 వేల కోట్ల అప్పులు సిగ్గుచేటు
.మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
.లేకుంటే కేంద్రాన్ని, రాజ్యాంగ సంస్ధల్ని ఆశ్రయిస్తాం
.అదాన్‌ డిస్టలరీ జగన్‌రెడ్డి బినామీది కాదని చెప్పగలరా?
.టిడిపి నేతలు సాంబశివరావు, స్వామి, అనిత స్పష్టీకరణ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అక్రమ సంపాదన కోసం తన బినామీల డిస్టరీల్లో కల్తీ మద్యం తయారు చేయిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని టీడీపీ నేతలు ద్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాజంనేయస్వామి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ… ప్లీనరీ పేరుతో వైసీపీ చేసుకున్న భజన సభలో భజన బృందమంతా కలిసి సామాజిక న్యాయం, జగన్‌ మాట తప్పడు, మడమ తిప్పడు అని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారన్నారు. మద్యపాన నిషేధమని చెప్పిన జగన్‌ రెడ్డి భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 58 వేల కోట్లు అప్పులు ఏవిధంగా తెచ్చారో వారు సమాధానం చెప్పగలరా అని టిడిపినేతలు సవాల్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం మహిళల మాంగల్యాలు తాకట్టు పెట్టడం సిగ్గుచేటు. ఇదేనా మీరు చెబుతున్న సామాజిక న్యాయం? మహిళల భావోద్వేగాలతో ఆడుకుంటూ వీధిన పడేస్తుండటం సామాజిక న్యాయమా? మద్యపాన నిషేదం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు. తాగుబోతులనే తాకట్టు పెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్‌ రెడ్డికే చెల్లింది. మద్యంపై ఈ మూడేళ్లలో రూ. 58,500 కోట్లు అప్పు రూపంలో తెచ్చిన జగన్మోహన్‌ రెడ్డి…ఇసుక నుంచి కూడా తైలం పిండగలరు. టీడీపీ హయాంలో చీప్‌ క్వార్టర్‌ రూ. 5.20 కి ప్రభుత్వం కొనేది. కానీ నేడు అదే చీప్‌ క్వార్టర్‌ రూ. 25 కు కొంటున్నారు. టీడీపీ హయాంలో ప్రభుత్వాని మద్యంపై ఏడాదికి రూ. 6,400 కోట్లు వస్తే నేడు వైసీపీ పాలనలో అది రూ. 21 వేల కోట్లకు పెరిగిందని టిడిపి నేతలు దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

జనం నిన్నెలా నమ్ముతారు జగన్‌రెడ్డి?

మేం భయపడే రకం కాదు

సామాజిక న్యాయమంటే సొంతవారికి పదవులు కట్టబెట్టడమా?

తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ…
వైసీపీ ప్రభుత్వం మద్యం ద్వారానే నడుస్తోంది. మద్యం సరఫరా చేసేందుకు ఏపీ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లో 100కు పైగా కంపెనీలు నమోదు చేసుకుంటే జగన్‌ రెడ్డి మాత్రం కేవలం తన వారికి చెందిన 16 డిస్టలరీల నుంచే అధికంగా మద్యం కొంటున్నారు. చీప్‌ లిక్కర్‌ వల్ల ప్రాణాలు పోతున్నాయని మేమంటే అబ్బే అదేం లేదు చంద్రబాబు గారి హయాంలో డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని సకలశాఖ మంత్రి అంటున్నారు. అదానీ డిస్టలరీ ఎవరిది? విజయసాయిరెడ్డి అల్లుడి పెనక రోహిత్‌ రెడ్డికి చెందింది కాదా? 2019కి ముందు జగన్‌ దగ్గర క్రియాశీలకంగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డికి ఇప్పుడు ఐటి అడ్వైజర్‌ పదవి ఇచ్చారు, ఈయనే తోడల్లుడు అనిరుధ్‌ రెడ్డికి అదాన్‌ డిస్టలరీలో భాగస్వామ్యం ఉంది. 2019, డిసెంబర్‌ 2న స్థాపించిన అదాన్‌ డిస్టలరీ మూడేళ్లలోనే రూ. 2 వేల కోట్లు టర్నోవర్‌ ఎలా సాధించింది? చిన్న ఉద్యోగానికే అనుభవం అడుగుతారు. ఈ కంపెనీకి కేవలం రెండేళ్ళలో రూ.1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరాకు జగన్‌ రెడ్డి అనుమతి ఇచ్చారు. ఎందుకు ఈ కంపెనీ అంటే అంత ప్రేమంటే ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన కాశీచాయనుల శ్రీనివాసులు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. విషపు మందుతో మహిళల మాంగల్యాలతో ఆడుకుంటున్నారు. మద్యంపై అక్రమంగా జగన్‌ రెడ్డి ఆర్జిస్తున్న ఆదాయం నెలకు రూ. 500కోట్ల పైమాటే. జనం రక్తపు పీల్చి లాక్కున్న సొమ్ము జగన్‌ ఖజానాకు వెళ్తోంది. అదాన్‌ డిస్టలరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో జగన్మోహన్‌ రెడ్డి సమాధానం చెప్పాలని వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…
జే ట్యాక్స్‌, జే బ్రాండ్‌ ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం జగన్మోహన్‌ రెడ్డికి అలవాటుగా మారింది. తడి గుడ్డతో గొంతు కోసినట్టు తండ్రి జయంతి నాడే తల్లిని పార్టీ నుంచి సాగనంపిన జగన్‌ రెడ్డి మద్యపాన నిషేదం ఎలా చేస్తాడని ప్రజలు ఆలోచించాలి. జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం ఘటనపై జ్యుడీషియరీ విచారణ మేము కోరితే సహజ మరణాలు అని ముఖ్యమంత్రి హేళనగా మాట్లాడారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న ఆంద్రా గోల్డ్‌, సిల్వర్‌ స్ట్రైప్స్‌, నైన్‌ సీ హార్స్‌ మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాలున్నాయని చైన్నైలోని ఎస్‌.జి.ఎస్‌ ల్యాబ్‌ నివేదిక మేం బయపెట్టాం. కానీ అది తప్పంటూ వైసీపీ నేతల మాట్లాడటం సిగ్గుచేట. సూట్‌ కేసు కంపెనీలు పెట్టడం, సకిలీ పత్రాలు సృష్టించడం జగన్‌ కు వెన్నతో పెట్టిన విద్య. అమరావతి ముంపుకు గురవుతుందని చెన్నై ఐఐటీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించింది ఎవరో ప్రజలు తెలియదా? తప్పుడు పత్రాలు, సూట్‌ కంపెనీలు సృష్టించటంలో ఏ1, ఏ2, ఏ3, ఏ4 సిద్ధహస్తులు. మీకు దమ్ముంటే మేం చెప్పిన మూడు బ్రాండ్లు మీరు చెప్పిన ల్యాబ్‌ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేయిద్దాం దీనికి వైసీపీ నేతలు సిద్దమేనా? జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం తాగి చనిపోయిన ఘటనలో అల్కాహాల్‌ బేస్‌ డ్‌ లిక్కర్‌ తాగడం వల్లే చనిపోయారని డాక్టర్లు రిపోర్టు ఇవ్వటం వాస్తవం కాదా? జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్తగా 106 బ్రాండ్లకు అనుతమిచ్చారని ఆర్టీఐ సమాచారం ద్వారా ప్రభుత్వమే చెప్పింది. జగన్‌ రెడ్డి తన అక్రమ ఆదాయం కోసం విషపు మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నకిలీ మద్యంపై రాష్ట్రపతి, కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. విషపూరిత జె-బ్రాండ్స్‌ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని డోలా బాలవీరాజంనేయస్వామి అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ…
నయవంచనకు, నమ్మించి మోసం చేయడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌ రెడ్డి. నాడు మద్య పాన నిషేదమనిచెప్పి నేడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారు. 800 బార్లకు 2020 వరకు లైసెన్స్‌ పొడిగించారు. మరో వైపు భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయం చూపి రూ. 58 వేల కోట్లు అప్పులు తెచ్చారు. అంటే మద్యపాన నిషేదం చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్టే కదా. జగన్‌ రెడ్డి అక్రమ సంపాదన కోసం మద్యాన్ని వ్యాపారంగా మార్చుకుని ప్రభుత్వ ఖజానాతో పాటు తన తాడేపల్లి ఖజానాను నింపుకుంటున్నారు. దేశంలో ఎక్కడైనా ఏదైనా వస్తువు కొనేటప్పుడు కస్టమర్‌ చాయిస్‌ ఉంటుంది, కానీ జగన్‌ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న మద్యం దుకాణాల్లో కేవలం తమకు ముడుపులు ఇచ్చిన డిస్టలరీల మద్యం బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. జగన్‌ రెడ్డి డిస్టలరీ దగ్గర ముక్కుపిండి కమీషన్లు వసూలు చేయటం వల్లే క్వాలిటీ లేని మద్యం తయారు చేస్తున్నారు. అదాన్‌ డిస్టలరీ, ఎప్సీవై డిస్టలరీ జగన్‌ రెడ్డి, వైసీపీ నేతలకు చెందిన బినామీలవే. మద్యం దుకాణాల్లో నెలకు 25 లక్షల మద్యం కేసులు అమ్మితే వాటిలో సుమారు 15 లక్షల మద్యం జగన్‌ రెడ్డి బినామీ డిస్టలరీల మద్యం బ్రాండ్లే అమ్ముతున్నారు. జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మద్యం మాఫియాతో పాటు గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. దేశానికి మొత్తం ఏపీ నుంచే గంజాయి సప్లై అవుతోంది. మద్యపాన నిషేదమ చెప్పిన జగన్‌ రెడ్డి ఊరూరా బెల్టుషాపులు పెట్టి మద్యం తాగిస్తున్నారు, జగన్‌ రెడ్డి అమ్ముతున్న మద్యం తాగినవాళ్లు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. ప్రభుత్వ మద్య దుకాణాల్లో నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ అమ్ముతున్నారు. అందుకే మద్యం షాపుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ తీసుకోవటం లేదు. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదని నిలదీశారు.

 

Tags: అక్రమ సంపాదనఅదానీఏలూరి సాంబశివరావుకల్తీ మద్యంకస్టమర్‌ చాయిస్‌గంజాయి మాఫియాచీప్‌ లిక్కర్‌జగన్ రెడ్డిడిస్టరీడోలా బాల వీరాజంనేయస్వామితాకట్టుతాడేపల్లి ఖజానాప్లీనరీబినామీలుబ్రాండ్‌ అంబాసిడర్‌మడమ తిప్పడుమాంగల్యాలుమాట తప్పడురోహిత్‌ రెడ్డివంగలపూడి అనితవిజయసాయిరెడ్డి
Previous Post

తెలుగుదేశం ద్వారానే మహిళా సాధికారిత సాధ్యం

Next Post

రాష్ట్రంలో ఏ రోడ్డు చూసిన గోతులే : సోమిశెట్టి వెంకటేశ్వర్లు

మరిన్ని వార్తలు

chandra babu
ఆంధ్రప్రదేశ్

జగన్ సమాధానం చెప్పాలి వివేకా హత్యపై చంద్రబాబు డిమాండ్

చైతన్యరధం
@ May 27, 2023
mahanadu celebrations 2023 at rajamahendravaram
ఆంధ్రప్రదేశ్

LIVE : Day-1: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు – మహానాడు @రాజమహేంద్రవరం.

చైతన్యరధం
@ May 27, 2023
tdp
ఆంధ్రప్రదేశ్

టిడిపి జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక

చైతన్యరధం
@ May 27, 2023
TDP Mahanadu 2023
ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి ‘ బ్రహ్మోత్సవం ‘

చైతన్యరధం
@ May 27, 2023
nara lokesh
ఆంధ్రప్రదేశ్

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం : నారా లోకేష్ వెల్లడి

చైతన్యరధం
@ May 26, 2023
mahanadu 2023
ఆంధ్రప్రదేశ్

నిన్న.. నేడు.. రేపు

చైతన్యరధం
@ May 26, 2023
nara lokesh
ఆంధ్రప్రదేశ్

యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం

చైతన్యరధం
@ May 25, 2023
chandrababu tweet on new parliament building
ఆంధ్రప్రదేశ్

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం.. దేశానికే గర్వకారణం – చంద్రబాబు

చైతన్యరధం
@ May 25, 2023
Load More

ముఖ్య వార్తలు

TDP Mahanadu

గోదావరి తీరంలో పసుపు కెరటం

చైతన్యరధం
@ May 27, 2023
nara lokesh

అర్హులు అందరికీ బేషరతుగా దుల్హన్ పధకం అమలు చేస్తాం : నారా లోకేష్ హామీ

చైతన్యరధం
@ May 26, 2023
nara lokesh

దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం జమ్మలమడుగులో నారా లోకేష్ హామీ

చైతన్యరధం
@ May 26, 2023
nara lokesh

విద్యార్ధుల సంఖ్యను బట్టి జూనియర్ కళాశాలల ఏర్పాటు : నారా లోకేష్ వెల్లడి

చైతన్యరధం
@ May 25, 2023
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

చైతన్యరధం
@ November 30, 2022 10:43 AM
డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

చైతన్యరధం
@ November 17, 2022 10:59 AM
యూనివర్సిటీ మీ అబ్బ జాగీరా?

యూనివర్సిటీ మీ అబ్బ జాగీరా?

చైతన్యరధం
@ November 3, 2022 10:45 AM
ఎవడబ్బ సొమ్ము జగన్‌రెడ్డీ?

ఎవడబ్బ సొమ్ము జగన్‌రెడ్డీ?

చైతన్యరధం
@ October 1, 2022 12:27 PM
మరిన్ని

తాజా సంఘటనలు

chandra babu

జగన్ సమాధానం చెప్పాలి వివేకా హత్యపై చంద్రబాబు డిమాండ్

చైతన్యరధం
@ May 27, 2023
mahanadu celebrations 2023 at rajamahendravaram

LIVE : Day-1: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు – మహానాడు @రాజమహేంద్రవరం.

చైతన్యరధం
@ May 27, 2023
tdp

టిడిపి జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక

చైతన్యరధం
@ May 27, 2023
TDP Mahanadu 2023

తెలుగుజాతి ‘ బ్రహ్మోత్సవం ‘

చైతన్యరధం
@ May 27, 2023
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2022 తెలుగు దేశం పార్టీ. కోడెడ్ బై టెక్ బ్రైన్స్

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist