అనంతపురం(చైతన్యరథం): రాష్ట్రాన్ని కూల్చే ప్రభు త్వం కావాలా.. అభివృద్ధి బాటలో నవనిర్మాణం సాగిం చే పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు చేతుల్లో ఈ రాష్ట్రం భద్రంగా ఉంటుందన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భం గా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం వచ్చిన భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తు న సంఫీుభావం తెలిపారు. ఈసందర్భంగా భువనేశ్వరి మహిళలతో మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి పరిపా లనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో గుద్దిచంపడం, కళ్లు పీకే యడంవంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు దిగుతున్నారు.మనంప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్ష సులపాలనలో ఉన్నామా? లేక బ్రిటీషువారి చేతిలో బానిసల్లా ఉన్నామా అనేది ప్రజలు ఆలోచించాలి. మన కు స్వాతంత్య్రం,రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నా యా.. లేవా? ప్రజలు వీటి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని భువనేశ్వరి అన్నారు.
భయం గుప్పిట్లో మహిళలు…
చంద్రబాబు పాలనలో ధైర్యంగా బతికిన మహిళలు నేడు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వైసీపీ నాయ కులు మహిళలు అని కూడా చూడకుండా రాడ్లతో దాడులు చేసి, కొట్టి చంపేస్తున్నారు. నాయకుడు ఎలా ఉన్నాడో కింద ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. చంద్రబాబు పాలనలో 8ఏళ్ల బాలికపై అత్యా చారం జరిగితే నిందితుడిని ప్రభుత్వం ఎంత కఠినంగా శిక్షిస్తుందోననే భయంతో అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.మహిళలకు ఏదైనా జరిగితే చంద్రబాబు ఆ స్థాయిలో స్పందించి చర్యలు తీసుకునేవారు. అమ రావతి రైతులు 1600 రోజులుగా రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. అమరావతి మహిళలపై వైసీపీ ప్రభుత్వం అత్యంతకర్కశంగా వ్యవహరించింది. గర్భిణి కడుపుపై పోలీసులు తన్నడంతో బిడ్డని కూడా కోల్పో యారు. రాత్రిపూట కూడా స్టేషన్లలో నిర్బంధించినా మహిళలు ఎక్కడా తగ్గకుండా తమ పోరాటాలను కొన సాగించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో శాంతియుత ర్యాలీలు, నిరసనలు చేసిన మహిళలపైనా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది.. అక్రమకేసులు పెట్టింది. రాత్రిపూట కూడా మహిళలను స్టేషన్లలో ఉంచి ఇబ్బందులు పెట్టారని భువనేశ్వరి దుయ్యబట్టారు.
కార్యకర్తల కోసం ఎంతదూరమైనా..
తెలుగుదేశం కార్యకర్తలను గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చిత్రహింసలు పెడుతూనే ఉంది. అక్రమ కేసులు పెడుతూనే ఉంది. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలను నడిరోడ్డుపై గొంతుకోసి చంపేసిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్ మోహన్‌రెడ్డిది. ప్రాణాలు కోల్పోయినాసరే పార్టీ కార్య కర్తలు, వారి కుటుంబాలు పసుపు జెండాను కిందికి దించకుండా పైకి ఎగరేస్తూనే ఉన్నారు. అది తెలుగు దేశంపార్టీ గొప్పతనం. ఇబ్బందులు పడిన కార్యకర్తలు, అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు… మీతో మేమున్నాం… మీకు అండగా నిలబడతాం.. మీకు మీ నాయకుడు చంద్ర బాబు అన్నివేళలా అందుబాటులో ఉన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అక్రమకేసులు పెట్టి చంద్రబాబును 53రోజు లు జైల్లో నిర్బంధించింది. ప్రజలకు చంద్రబాబును దూరం చేయాలని చూశారు. కానీ చంద్రబాబు జైల్లో ఉండి కూడా ప్రజల గురించే ఆలోచించారు. చంద్ర బాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపో యిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలని, పార్టీ అండగా ఉందనే విషయాన్ని చెప్పి ఓదార్చాలని నన్ను పంపారు. నిజం గెలవాలి కార్యక్రమం చేయాలం టే ప్రారంభంలో నేను భయపడ్డాను..కానీ నాకు రోజు పెరిగిన కొద్దీ ధైర్యం పెరిగిపోతోంది. దానికి కారణం కార్యకర్తలు నన్ను అడుగడుగునా ఓ తల్లిని బిడ్డలు ఎలా కాపాడుకుంటారో అలా నన్ను కాపాడుకుంటు న్నారు. మీకోసం ఎంత దూరమైనా రావడానికి నేను బెదిరే పరిస్థితే లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు తపన…
రాష్ట్రం విడిపోయిన సమయంలో దీన్ని పునర్ నిర్మించడానికి చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడిపా రు.కష్టపడి కంపెనీలు,పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చా రు. 33వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించేందుకు అనేక పనులు చేపట్టారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక 3 రాజధానులు అంటూ కనీసం ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు. ఇది రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటు విష యం. చంద్రబాబు తెచ్చిన కంపెనీలన్నీ జగన్ వేధిం పులు, కమీషన్ల కోసం ఒత్తిళ్లు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఏపీలో నేడు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు మిగిలిపోయారు. ఏపీకి రావాలంటే కంపెనీలు, పెట్టుబడిదారులు భయపడుతున్నారు.జగన్ ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్నాడు..ప్రభుత్వ కార్యాల యాలు, ఆస్తులను తాకట్టు పెడుతున్నాడు. చివరకు రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు? ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో ఎవరికీ తెలియదు. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దిగిపోకపోతే ఏపీ ప్రజలంతా రానున్న రోజు ల్లో పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు వస్తాయని మర్చిపోవద్దు. మహిళలు భద్రంగా ఉండా లంటే, ఆర్థికంగా బలోపేతం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని భువనేశ్వరి అన్నారు.
రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలి…
ఒకప్పుడు అభివృద్ధిలో నంబర్ 1 స్థానంలో ఉన్న ఏపీని జగన్ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్, శాండ్ మాఫి యా, మహిళలపై దాడులు, అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యల్లో నంబర్‌వన్ స్థానానికి తీసుకొచ్చింది. ఏపీ భవిష్యత్తు చంద్రబాబు చేతిలో పెడితే రాష్ట్రమంతా బాగుంటుంది. జగన్‌కు మరో అవకాశం ఇస్తే రాష్ట్ర పరిస్థితిని ఊహించలేం…పక్కనున్న రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిందే. మహిళలను,ఈ రాష్ట్రాన్ని మీ ఓటే కాపా డుతుంది. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించాలని భువ నేశ్వరి పిలుపు ఇచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరికీ ముందుగానే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.