- ఎలక్ట్రానిక్ వాహనాల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టాలి
- 500 ఈవీ స్టేషన్ల ఏర్పాటు దిశగా సిద్ధం చేయాలి
- సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలను రప్పించాలి
- అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024పై దిశానిర్దేశం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. ఇంటి ిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాంప్రదాయేతర విద్యుదుత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటే దేశంలోనే సాంప్రదాయేతర విద్యుదుత్పత్తికి ఏపీ అతి పెద్ద కేంద్రం అవుతుందని తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలోనే టాప్‌లో ఉన్న ఏపీ 2019 తరువాత వచ్చిన ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా కొత్త పాలసీ ఉండాలని సూచించారు.
పర్యావరణ హితంగా టెక్నాలజీ ఉపయోగంతో తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై చర్చించారు. ఈ పాలసీ ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా వినియోగ దారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని సూచించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుదుత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాల ను మరింత విస్తృతంగా స్టడీ చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలని ఆదేశించారు. 2029కి, 2047 నాటికి విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిని మదింపు చేసి పాలసీ సిద్ధం చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు తీసుకో వాల్సిన చర్యలపైనా చర్చించారు.
రాష్ట్రంలో కనీసం 500 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు, సంస్థలు స్వయంగా సోలార్ విద్యుదుత్పత్తి చేసుకోవడం, తమ అవసరాలు తీరిన తరువాత మిగిలిన విద్యుత్‌ను అమ్ము కోవడాన్ని సులభతరం చేసేలా పాలసీ తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో లభించే క్వార్జ్ట్ ఖనిజం ద్వారా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు తయారు చేస్తారని, ఈ కారణంగా సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైనా దృష్టిపెట్టాలని సూచించారు.