చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

విభజన చట్టం ప్రకారం విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టులు

సీఆర్డీఏ అథారిటీ నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి నారాయణ

చైతన్యరధం by చైతన్యరధం
August 30, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రెండు దశల్లో చేపట్టేందుకు కేంద్రానికి నివేదికలు
  • సీఆర్డీఏ భవనం నిర్మాణానికి రూ.160 కోట్లు
  • హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ తిరిగి చేపట్టాలని నిర్ణయం
  • తాజాగా భూములిస్తున్న వారికి సొంత గ్రామాల్లో ప్లాట్లు
  • వచ్చే నెల 15 లోపు రైతులకు ఒక విడత కౌలు నిధులు
  • జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమరావతి పనులు
  • సీఆర్డీఏ అథారిటీ నిర్ణయాలు వెల్లడిరచిన మంత్రి నారాయణ

అమరావతి(చైతన్యరథం): ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా రాజధానికి భూములిస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నా మని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి లో ఇంకా 3,550 ఎకరాలు భూసమీకరణ ద్వారా రైతుల నుంచి సేకరించాల్సి ఉందని వెల్లడిరచారు. గతంలో భూములు ఇవ్వని వారు తాజాగా సీఆర్డీఏకు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. గత నెలరోజులుగా 120 ఎకరాలు భూమిని రైతులు ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సీఆర్డీఏకు ఇచ్చినట్లు వివరించారు. గతంలో ల్యాండ్‌ పూలింగ్‌కు భూములి చ్చిన వారికి లాటరీ విధానంలో రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయించేవారని, తాజాగా భూములి చ్చిన వారికి ప్రస్తుతం సీఆర్డీఏ వద్ద ఉన్న భూముల్లో ప్రాధాన్యత ప్రకారం రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన 37వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకు న్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడిరచారు.
సీఆర్డీఏ భవన నిర్మాణానికి రూ.160 కోట్లు
ముఖ్యంగా మూడు అంశాలపై అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. వీటిలో మొదటిది ల్యాండ్‌ పూలింగ్‌ రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు అంశం కాగా ఇక రెండో అంశం రాజ ధానిలో నిర్మాణంలో ఉన్న సీఆర్డీఏ భవనంపై చర్చించినట్టు చెప్పారు. రాయపూడి సమీపంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును ఆనుకుని సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ భవనం నిర్మాణానికి రూ.160 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసు కున్నట్లు తెలిపారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్‌ 7 విధానంలో భవనం నిర్మిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ భవనం నిర్మాణం పూర్తయితే సీఆర్డీఏ, ఏడీసీతో పాటు మొత్తం మున్సి పల్‌ శాఖకు చెందిన అన్ని విభాగాలు ఇక్కడి నుంచే పనిచేస్తాయన్నారు. దీనివల్ల పాలన సులభతరం అవుతుందని చెప్పారు. ఈ భవనం నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయా లని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు పేర్కొన్నారు.
హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం
హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుపైనా చర్చించినట్టు చెప్పారు. సీడ్‌ క్యాపిటల్‌లో మొత్తం 14.46 ఎకరాల్లో జీ ప్లస్‌ 18 అంతస్తులు ఉండేలా మొత్తం 12 టవర్లను నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించగా దానికి తగ్గట్లుగా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రారంభించగానే కేవలం గంటలోనే అన్ని ప్లాట్లు బుక్‌ అయిపోయాయన్నారు. రూ.714 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టగా గత ప్రభుత్వం దీనిని నిలిపివేసిందని చెప్పారు. దీంతో ప్లాట్లు బుక్‌ చేసిన వారు నష్ట పోకుండా ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఐదేళ్లుగా ప్రాజెక్ట్‌ చేపట్టకపోవడంతో రూ.713 కోట్లతో పూర్తికావలసిన ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.930 కోట్లకు పెరిగిపోయిందని చెప్పారు.
రాజధాని రైతులకు వచ్చే నెల 15 లోగా కౌలు నిధులు
రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం కౌలు చెల్లించలేదని మంత్రి నారాయణ ఆరోపించారు. గత ఏడాది కౌలు నిధులు రూ.175 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.225 కోట్లు బకాయి ఉందన్నారు. అయితే గత ఏడాది ఇవ్వాల్సిన రూ.175 కోట్లు వచ్చే నెల 15లోగా రైతుల ఖాతాలకు జమ చేసేలా సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని, ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు నిధులు కొంత గ్యాప్‌ తర్వాత చెల్లిస్తామన్నారు. పెన్షన్లకు నిధులు భారీగా వెచ్చిస్తుండటంతో ప్రభుత్వానికి కొద్దిగా ఆదాయం వచ్చిన తర్వాత పెండిరగ్‌ కౌలు నిధులు చెల్లిస్తామని రైతు సోదరులకు స్పష్టం చేశారు.
విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలుకు మళ్లీ కదలిక
సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం విజయ వాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్ట్‌లు చట్టంలో పేర్కొన్నారని, దానికి తగ్గట్లుగానే మెట్రో ప్రాజెక్ట్‌ కు సంబంధించిన ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. విజయ వాడలో రెండు దశల్లో మెట్రో ప్రాజెక్ట్‌ చేపట్టేలా డీపీఆర్‌ సిద్ధం చేశారు. మొదటి దశలో విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ వరకు 25.95 కిమీ, అలాగే బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు 12.45 కిమీ నిర్మాణం చేపట్ట నున్నారు. మొత్తం మొదటి దశలో 38.40 కిమీ మేర నిర్మాణానికి తాజా అంచనాల ప్రకా రం 11,009 కోట్లు ఖర్చవుతుంది. ఇక రెండో విడతలో పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి అమరావతి రాజధానికి మొత్తం 27.80 కిమీ మేర మెట్రో నిర్మాణం చేసేలా డీపీఆర్‌ రూపక ల్పన చేశారు. దీనికి 14,121 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అంటే విజయవాడ మెట్రోకు మొత్తం రెండు దశలకు కలిపి 66.20 కిమీ మేర నిర్మించే ప్రాజెక్ట్‌కు 25,130 కోట్లు ఖర్చవుతుందని మంత్రి చెప్పారు.
విశాఖలో రెండు దశల్లో మెట్రో నిర్మాణం
ఇక విశాఖపట్నంలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో రెండు దశల్లో మెట్రో నిర్మాణానికి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం అయింది. మొదటి దశలో స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాడి వరకు 34.40 కిమీ మేర మొదటి కారిడార్‌, గురుద్వారా నుంచి ఓల్డ్‌ పోస్టాఫీస్‌ వరకు మొత్తం 5.07 కిమీ మేర రెండో కారిడార్‌, తాడిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు 6.75 కిమీ మేర మూడో కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశలో మొత్తం 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో మెట్రో చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వరకు 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. అంటే విశాఖలో మొత్తం 76.90 కిమీ మేర మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి మొదటి దశలో రూ.11,498 కోట్లు, రెండో దశలో రూ.5,734 కోట్లు కలిపి మొత్తం రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల ఫేజ్‌ 1కు సంబంధించిన అంచనాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం నిర్ణయించారు. అయితే మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద నాలుగు రకాల ప్రతిపాదనలు ఉన్నాయని నారాయణ చెప్పారు. విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం మొత్తం కేంద్రమే భరించాలని పేర్కొన్నట్లు చెప్పారు. విజయవాడకు ఇప్పటికిప్పుడు మెట్రో రైలు అవసరం లేకపోయినా రాబోయే పదేళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలకమైన మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ కోసం ప్రపం చం మొత్తం మెట్రో రైలుపై ఆధారపడిరదని…పెరిగే జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో అవసరం ఉంటుందని చెప్పుకొచ్చారు.
జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమరావతి పనులు
అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం అధ్యయనం జరుగుతుందని తెలిపారు. త్వరలో అన్ని పనులకు టెండర్లు పిలిచి జనవరి 1 నుంచి పూరిస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించేలా ముందుకెళుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు.

Previous Post

రివర్స్‌ టెండరింగ్‌ రద్దు

Next Post

రూ.200 కోట్లు స్వాహా…జగన్‌ అండ్‌ కో భారీ మోసం

Next Post
రూ.200 కోట్లు స్వాహా…జగన్‌ అండ్‌ కో భారీ మోసం

రూ.200 కోట్లు స్వాహా...జగన్‌ అండ్‌ కో భారీ మోసం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.