చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సైకోల భరతం పడతా

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

చైతన్యరధం by చైతన్యరధం
November 8, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నేరస్థుడికి మరణశిక్ష పడేలా చూడాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులపై సీఎం హెచ్చరిక
  • డబిడ్డలపై పోస్టింగులు పెడితే వదిలి పెట్టాలా?
  • భావప్రకటనా స్వేచ్ఛ అంటే అశ్లీల పోస్టులా?
  • అలాంటివాళ్లకూ, మృగాలకు తేడా ఏముంది?
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికోసం అవసరమైన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్‌ (జీఐఎస్‌)ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. అధికారం పోయాక వైకాపా నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. మానసికంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి అనిత, ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ బిడ్డలపైనా ఇష్టారీతిన పోస్టులు పెట్టారని.. అలాంటి వారిని వదిలిపెట్టాలా? అని ప్రశ్నించారు. బాంబులకు కూడా భయపడలేదని.. కానీ తన గురించి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. కొవ్వు ఎక్కువై నేరస్థులుగా తయారవుతున్నారని తీవ్ర స్వరంతో సీఎం వ్యాఖ్యానించారు. ఆ కొవ్వును కరిగిస్తామన్నారు.

‘సోషల్‌ మీడియాలోనూ కొందరు సైకోలు ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారు. అడ్డూఅదుపు లేకుండా ఆడబిడ్డలపై పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వెధవలకు కుటుంబాలు లేవేమో… కానీ మనం గౌరవంగా బతుకుతున్నాం. నా సతీమణి గురించి అసెంబ్లీలో అసభ్యకరంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా. అలాంటి మాటలు విన్నప్పుడు ఎంతటి సహనం గల మనిషికైనా బాధ, రోషం కలుగుతుంది. మదమెక్కిన ఆంబోతుల మాదిరి సోషల్‌ మీడియాలో చెప్పకూడని బాషలో పోస్టులు పెడుతున్నారు. వీళ్లపై చర్యలు తీసుకోకూడదా? వదిలి పెట్టాలా? మదం, కొవ్వు ఎక్కువై నేరస్తులుగా మారారు. వివేకానందరెడ్డి హత్యను సాక్షిలో మొదట గుండెపోటు అని ప్రసారం చేశారు. మరుసటి రోజు నారాసుర రక్తచరిత్ర అని నాపై వార్తలు రాశారు. శాంతిభద్రతలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి. మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై పోరాడి మతసామరస్యాన్ని కాపాడాం. సీమలో ఫ్యాక్షన్‌ ముఠాలను అణగదొక్కాం. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్లను ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా చదివించాం. హత్యకు హత్య సమాధానం కాదని చెప్పాం. జీవితాలు కోల్పోతారని చెప్పి చట్టపరంగా శిక్షిస్తామని నాడు చెప్పా. ఏ పార్టీ అయినా సమానంగా చూశాను… మా పార్టీ వాళ్లను కూడా అరెస్టు చేయించాను. కొందరు నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్నారు… ఘోరాలు చేస్తున్నారు. మనుషులను చంపుతున్నారు…ఆస్తులను కొట్టేస్తున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అశ్లీల పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా?
‘ప్రజాస్వామ్యం అంటూ ఆడబిడ్డలను తిడతారా? యజ్ఞంలా అభివృద్ధి చేస్తుంటే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని చట్టాలు పరిశీలిస్తాం. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తే ఖబడ్దార్‌. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. గత ప్రభుత్వం చేసిన దరిద్ర పనులతో ఎక్కడిక్కడ గంజాయి వచ్చింది. నాలుగేళ్ల ఆడబిడ్డలపై అత్యాచారాలు చేస్తున్నారు. వాళ్లు మనుషులేనా.? కొవ్వెక్కి ప్రవర్తిస్తే తాట తీస్తా. పోలీసులు కూడా ఆలోచించుకుని పనిచేసి నేరస్తులపై పైచేయి సాధించాలి. పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ అని మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడం భావవ్యక్తీకరణా.? అసభ్యకరమైన, అశ్లీల పోస్టులు పెట్టడమా.? ఏ చట్టం మీకు అధికారం ఇచ్చింది? జడ్జి కుటుంబ సభ్యులపైనా పోస్టులు పెడితే చెప్పుకోలేని పరిస్థితి. ప్రజాచైతన్యం లేకుంటే దుర్మార్గులు చెప్పే మాటలు కొంతమంది కూడా నమ్ముతారు. నేరస్తులకు ఆడబిడ్డలంటే గౌరవం లేదు. ఆ పార్టీలో ఉండే అర్హత ఆడబిడ్డలకు ఉందా? ఏ ఆడబిడ్డపైనా అసభ్యకరమైన పోస్టు పెట్టొద్దని కూటమి పార్టీల కేడర్‌కు కూడా చెప్తున్నా. వైసీపీ వాళ్లకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టి బుద్ధి చెప్తా. రాజకీయంగా మాట్లాడితే తప్పులేదు. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. పద్ధతి ప్రకారం మేం చేసే రాజకీయాన్ని ఎదుర్కోలేక రౌడీలతో బెదిరిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి. దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

మీకూ, మృగాలకు తేడా ఏంటి?
‘‘నేరస్థులు రాజకీయ ముసుగులో ఉన్నారు.. ఘోరాలు చేస్తున్నారు. ఆస్తులు కొట్టేస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం అంటున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో ప్రసారం చేశారు. నేనూ నమ్మాను. ఆ తర్వాత అది భయంకరమైన హత్య అని తేలింది. కరుడుగట్టిన నేరస్థుడు ఎలాంటి పనులు చేస్తాడో గుర్తుపెట్టుకోవాలి. దేశం, ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ అధ్యయనం చేస్తా. ఆడబిడ్డలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే ఖబడ్డార్‌. హద్దులు దాటితే ఉపేక్షించేది లేదు. చేతగానితనం అనుకోవద్దు. మీరు మనుషులేనా? మీకూ, మృగాలకు తేడా ఏంటి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా? అసభ్య, అశ్లీల పోస్టులు పెట్టడమా? ఏ చట్టం మీకు ఈ హక్కు ఇచ్చింది? దీనిపై సీరియస్‌ గా ఆలోచిస్తున్నా. పకడ్బందీగా చట్టం తీసుకొస్తాం. నేరస్థుల కట్టడి చేసేందుకు పోలీసులను సమర్థంగా తీర్చిదిద్దుతాం’’ అని చంద్రబాబు అన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2024

Next Post

ఏంచేద్దామో మీరూ చెప్పండి?

Next Post
ఏంచేద్దామో మీరూ చెప్పండి?

ఏంచేద్దామో మీరూ చెప్పండి?

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.