చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట

పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

చైతన్యరధం by చైతన్యరధం
November 8, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్దపీట
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు
  • ఏ పంచాయతీ నిధులు అక్కడ అభివృద్ధికి వినియోగం
  • త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.750 కోట్లు
  • వాలంటీర్లను గత ప్రభుత్వం మోసం చేసింది
  • పంచాయతీల సమస్యలు వినేందుకు ప్రతి నెలా సమావేశం
  • పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

అమరావతి (చైతన్యరథం): పంచాయతీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామీణాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం నాయకులతో ఉప ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. సంఘం సభ్యులు.. పంచాయతీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్‌ కళ్యాణ్‌ ముందుంచారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఇష్టానుసారం నిర్వీర్యం చేసిందన్నారు. పంచాయతీల్లో స్వపరిపాలన, సుపరిపాలనకు చోటు లేకుండా చేసింది. ఆర్థిక విచ్చలవిడితనంతో పంచాయతీల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. సర్పంచులకు విలువ లేకుండా చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దీనిని సరిచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం అవసరం. ఆయన అనుభవంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట వేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నది మొండి ప్రభుత్వం కాదు. ఇది అందరి మాట వినే ప్రభుత్వం. బలంగా ఉండాల్సిన చోట బలంగా ఉంటుంది. మెత్తగా ఉండాల్సిన చోట మెత్తగా ఉంటుందని పవన్‌ స్పష్టం చేశారు.

సర్పంచ్‌ల డిమాండ్లు పరిష్కరిస్తాం
పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే ముందుకు తీసుకువెళ్తున్నాము. సర్పంచుల నుంచి వచ్చిన డిమాండ్లలో మొదట కీలకమైన వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తున్నాం. ఒకటికి పదిసార్లు చెప్పించుకునే పరిస్థితి లేకుండా చూస్తున్నాం. దేశంలోనే కేరళ పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలమైనది. అక్కడ పని చేసిన ఐఏఎస్‌ అధికారి కృష్ణ తేజ అనుభవాన్ని వాడుకునేందుకు వీలుగా ఆయన్ని డిప్యుటేషన్‌ మీద ఇక్కడికి తీసుకువచ్చాం. శాఖలో అధికారులు అంతా పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆకాంక్ష కలిగిన వారేనని పవన్‌ అన్నారు.

పల్లె వనం ద్వారా పంచాయతీల ఆదాయం పెంపు
గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచేందుకు ఇప్పటికే పల్లెవనం కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పోషించేందుకు పల్లెవనం ప్రారంభించాము. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల ఆదాయం పెంచడంతో పాటు భూ ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మన దేశ అవసరాలకు సరిపడా కలప మనమే పెంచుకోగలిగే విధానాన్ని రూపొందిస్తున్నాం. వెదురు పెంపకంతో పాటు బయో డీజిల్‌ తీసే మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతి పంచాయతీ కలప పెంచే లక్ష్యాలను నిర్దేశిస్తాం. దీంతో పంచాయతీల ఆదాయం పెరగడంతో పాటు పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుందని పవన్‌ అన్నారు.

ఖాతాలు ఫ్రీజ్‌ చేసే విధానం లేదు
గత ప్రభుత్వం 12, 900 పంచాయతీలకు సంబంధించిన రూ. 8,629 కోట్ల నిధులను వివిధ మార్గాల్లో మళ్లించింది. వాటిని తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని సర్పంచులు అడిగారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తాం. 15వ ఆర్థిక సంఘ నిధులు రూ. 750 కోట్లు త్వరలోనే పంచాయతీల ఖాతాలకు జమ అవుతాయి. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే నిధులను వేరే మార్గాలకు మళ్లించడం లేదు. ఏ పంచాయతీ నిధులు అక్కడే వినియోగం అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇప్పటికే పంచాయతీల ఖాతాలు ఫ్రీజ్‌ చేసే పద్ధ్దతిని తీసివేశాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించేసుకున్నారు. పంచాయతీలకు రూపాయి కూడా ఇవ్వలేదు అని సర్పంచులు చెబుతున్నారు. గత పాలకులు తీసుకున్న నిర్ణయాలకు జవాబుదారీతనం లేదు. నిధులు ఇష్టారాజ్యంగా వాడేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేబినెట్‌ లో చర్చిస్తామని పవన్‌ చెప్పారు.

వాలంటీర్లను గత ప్రభుత్వం మోసం చేసింది
గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు.. పంచాయతీలకు సమాంతర వ్యవస్థలా తయారయ్యాయని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. వాలంటీర్‌ వ్యవస్థ వేరు. సచివాలయ వ్యవస్థ వేరు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. జీతాలు పెంచుదామంటే జీవోలు ఎక్కడా కనబడడం లేదు. గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉన్నట్లు రికార్డులు ఉంటే ఆ వ్యవస్థను రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవ వేతనం పెంచే అంశం పరిశీలనలో ఉందని పవన్‌ తెలిపారు.

ప్రభావవంతంగా గ్రామసభలు
గ్రామ సభలు ఇంకా ప్రభావవంతంగా నిర్వహించాలి. తూతూ మంత్రంగా కాకుండా గ్రామ ప్రజలందరు అందులో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. సర్పంచుల సహకారం కూడా ఉంటే పల్లెల్లో అభివృద్ధిని మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకువెళ్తాము. రాజకీయ అంశాలు పక్కన పెట్టి ఎన్నికైన సర్పంచులకు గౌరవ స్థానం ఇవ్వడంతోపాటు ప్రథమ పౌరులుగా గుర్తించే అంశాన్ని పార్టీలకు అతీతతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని పవన్‌ చెప్పారు.

ఇసుక, మైనింగ్‌ సీనరేజ్‌లో పంచాయతీలకు రావాల్సిన వాటాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. క్వారీల్లో పేలుళ్ల వల్ల జరిగే నష్టానికి పరిహారం ఇవ్వాలి. మైనింగ్‌ సీనరేజ్‌లో పంచాయతీల వాటా పంచాయతీలకు ఇప్పించేలా కృషి చేస్తాం. గత ప్రభుత్వం ఎంత మేర బకాయిలు ఉందో వివరాలు తీసుకోవాల్సి ఉంది. ఆర్థికపరమైన డిమాండ్లు ఆర్ధిక శాఖ కార్యదర్శితో చర్చిస్తాము. గత ప్రభుత్వ హయాంలో నరేగా పనుల్లో భారీగా అవకతవకలు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. నిధుల్లో 60 శాతం మెటీరియల్‌ కాంపొనెంట్‌కు, 40 శాతం కూలీల వేతనాల కింద ఇస్తున్నారు. అయితే పనికి రాకుండా మస్తర్లు పెట్టేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి. సోషల్‌ ఆడిట్‌ బలంగా తీసుకు వెళ్లేందుకు ఉన్నత స్థాయి పోలీసు అధికారిని నియమించాము.

జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండేలా ఫీల్డు విజిట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. పల్లె పండుగ పనులు జనవరి నాటికి పూర్తి కావాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. పంచాయతీల్లో సమస్యలపై చర్చించేందుకు నెలకి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుందామని పవన్‌ అన్నారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యుడు పిడుగు హరిప్రసాద్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణ తేజ, మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ గౌరవాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్‌, సర్పంచుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Previous Post

ఏంచేద్దామో మీరూ చెప్పండి?

Next Post

గ్రేట్‌ విజనరీ ఆఫ్‌ ఇండియా’ సీఎం చంద్రబాబు

Next Post
గ్రేట్‌ విజనరీ ఆఫ్‌ ఇండియా’ సీఎం చంద్రబాబు

గ్రేట్‌ విజనరీ ఆఫ్‌ ఇండియా’ సీఎం చంద్రబాబు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.