- బెస్ట్ డీఎస్సీ నోటిఫికేషన్తో టీచర్ పోస్టుల భర్తీ
- సమస్యలను సానూకూలంగా పరిష్కరిస్తాం
- టీడీపీ హయాంలో 1.5లక్షల పోస్టులు వేశాం
- శాసనసభలో మంత్రి లోకేష్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం) : గురువులను గౌరవిస్తామని, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించి, విద్యాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసన సభలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సావధానంగా సమాధానం చెప్పారు. ప్రజాదర్బార్లో డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు తనను కలిసినపుడు వారితో చర్చించామన్నారు. 1998 డీఎస్సీకి సంబంధించి పెండిరగ్లో ఉన్న 4,534 పోస్టుల్లో 3939 పోస్టులు భర్తీచేశారన్నారు. ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉందన్నారు. ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారని పరిశీలించి న్యాయం చేస్తామని వెల్లడిరచారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఎంటిఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వారికి ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలని సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యను బాధ్యతగానే నిర్వహించిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నపుడు 11 డీఎస్సీలు నిర్వహించి 1.5లక్షల టీచర్ పోస్టులు భర్తీచేశాం, అందులో 9 డీఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపైనే పెట్టారని గుర్తు చేశారు. అభ్యర్థుల విన్నపాల మేర ముందుగా టెట్ నిర్వహించామని చెప్పారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడిరచారు. గత వైసీపీి ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీచేయలేదని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి ప్రజలు 93శాతం సీట్లు ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులంతా మనవైపు ఆశగా ఎదురుచూస్తున్నారని వెల్లడిరచారు.
ముఖ్యమంత్రి తనను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్గా నియమించారని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామన్నారు. గతంలో డీఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి, లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.