చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విజన్‌తోనే ప్రగతి వెలుగు

విద్యుత్‌లేని ఊరు నుంచి వచ్చి.. సంస్కరణలు తెచ్చాను

by చైతన్యరధం
Aug 13, 2025 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విజన్‌తోనే ప్రగతి వెలుగు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సంకల్పం పెట్టుకుంటే.. సాధించలేనిది ఉండదు..
నియోజకవర్గ బలాలు బేరీజువేసి అభివృద్ధికి తోడ్పడండి
ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకోండి
యంగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రభుత్వానికీ…నాకూ బలమవ్వాలి
స్వర్ణాంధ్ర విజన్‌-2047 యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు సీఎం పిలుపు
నియమితులకు ధృవీకరణ పత్రాలు అందించిన ప్రణాళిక శాఖ

అమరావతి (చైతన్య రథం): విద్యుత్‌లేని ఊరునుంచి వచ్చాను. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్‌ సంస్కరణలు తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిత్య విద్యార్థిగా ఉంటూ.. అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని యంగ్‌ ప్రొఫెషనల్స్‌ను చైతన్యపర్చారు. నియోజకవర్గాలవారీ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ప్రతి నియోజకవర్గానికి పీజీ చేసిన ఒక యంగ్‌ ప్రొఫెషనల్‌ను నియమిచింది. స్వర్ణాంధ్ర విజన్‌-2047లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాలవారీ విజన్‌ డాక్యుమెంట్లకు అనుగుణంగా పనిచేసేందుకు నియమితులైన ఈ యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రణాళిక శాఖ వారంపాటు శిక్షణ ఇచ్చింది. మంగళవారం సచివాలంయలోని ఐదో బ్లాకులో శిక్షణ ముగించుకున్న యంగ్‌ ప్రొఫెషనల్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘నియోజకవర్గానికో యంగ్‌ ప్రొఫెషనల్‌ నియమించడం కొత్త విధానం. నేను తొలిసారి సీఎం కాగానే ప్రాధాన్యతాంశాలను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్లానింగ్‌ చేసుకున్నాను. యంగ్‌ ప్రొఫెషనల్స్‌ కూడా వారికి కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సహా మిగిలినవారితో సంప్రదింపులు జరిపి నియోజకవర్గాల అభివృద్ధికి కచ్చితంగా ప్లానింగ్‌ చేసుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా పనిచేస్తే… సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు ఏది మంచిదో చెప్పాలి. సరైన విధానాలు అవలంభించకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ప్రజలకు యంగ్‌ ప్రొఫెషనల్స్‌ వివరించాలి. ఎక్కడెక్కడ ఏయే సమస్యలు వస్తాయనే అంశంపైనా ముందుగా అంచనాలు వేయగలగాలి. ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా ఉంది. అయినా ముందుచూపుతో నీటిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లను నింపాం. రికార్డు సమయంలో హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులు పూర్తి చేసి.. నీటిని విడుదల చేశాం. ఫలితంగా రాయలసీమ సహా అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులకున్న సామర్థ్యంలో 80 శాతంమేర నీటిని నిల్వ చేసుకోగలిగాం. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగాయి’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

నియోజకవర్గ బలాలను గుర్తించండి

‘‘ప్రతి నియోజకవర్గానికీ ఓ బలం ఉంటుంది. అభివృద్ధికి దోహదపడే సహజ వనరులు ఉంటాయి. అలాంటి వాటిని యంగ్‌ ప్రొఫెషనల్స్‌ గుర్తించి.. అధ్యయనం చేయాలి. ఆ వనరుల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ మేం చేపడుతున్నాం. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం కోసం పెద్దఎత్తున ఖర్చు పెడుతున్నాం. పాత్‌ హోల్స్‌ నిమిత్తమే రూ.1000 కోట్లు ఖర్చు పెట్టాం. జాతీయ రహదారులను పెద్దఎత్తున నిర్మిస్తున్నాం. ఏపీలో రోడ్లు అమెరికా స్థాయిలో ఉంటాయని నితిన్‌ గడ్కరీ కూడా చెప్పారు. విద్యుత్‌ రంగంలో గ్రీన్‌ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. టెక్నాలజీని అన్ని రంగాల్లో వినియోగించుకుంటున్నాం. రాష్ట్ర సమగ్ర, సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం.

ఇలా జరుగుతున్న అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను యంగ్‌ ప్రొఫెషనల్స్‌ నిరంతరం చూసుకుంటూ ఉండాలి. యంగ్‌ ప్రొఫెషనల్సుకు ఇదో అద్భుతమైన అవకాశం. మంచి అనుభవం కూడా వస్తుంది. ఇన్నాళ్లు సీఎంగా పనిచేసిన నాకు ఎంత అనుభవం వచ్చిందో… మీకూ అంతే అనుభవం వస్తుంది. యంగ్‌ ప్రొఫెషనల్స్‌గా విధుల్లో చేరాక.. ఇబ్బందులూ ఎదురవుతాయి.. ప్రజాప్రతినిధులను అధికారులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. సరైన సమాచారం మీ దగ్గర లేకుంటే.. మిమ్మల్ని పరిగణనలోకి తీసుకోరు. అందుకే ప్రతి అంశాన్నీ అధ్యయనం చేయండి. అప్డేట్‌ అవ్వండి. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు… అభివృద్ధి కోసం మీరు చేసే ఆలోచనలను అమలు చేయడానికి ఆకాశమే హద్దు అని యంగ్‌ ప్రొఫెషనల్స్‌ గుర్తించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చైతన్యపర్చరు.

మనసు పెట్టి పని చేయండి… విజయం మీతోనే ఉంటుంది

‘‘ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉండాలి. వినూత్నంగా ఆలోచనలు చేయాలి. ఏదోక ఉద్యోగం మాదిరిగా విధులు నిర్వహించవద్దు. మనసుపెట్టి పనిచేస్తే మీకూ ఉపయోగం… నియోజకవర్గానికి ఉపయోగం. 1995లో సంస్కరణలు వచ్చినప్పుడు నేర్చుకుని.. తెలుసుకుని.. అధ్యయనం చేసి.. మనకు అన్వయించుకున్నాం కాబట్టే అభివృద్ధి సాధించగలిగాం. ప్రపంచంలో తెలుగు వారికి ప్రత్యేకస్థానం ఉండేలా చేయగలిగాం. అప్పట్లో సంస్కరణల గురించి మాట్లాడితేనే.. పేదలకు వ్యతిరేకమనే భావన ఉండేది. కానీ సంపద సృష్టిస్తే సంక్షేమం చేసి పేదలకు పంచవచ్చని నమ్మి సంస్కరణలు అమలు చేశాం. విజన్‌ అంటే ఏమిటో ఇప్పుడు కొందరికి అర్థమవుతోంది. నేను విజన్‌ 2020 పెట్టినప్పుడు చాలామంది విమర్శించారు.

నేను రూపొందించిన విజన్‌ 2020 హైదరాబాద్‌ విషయంలో 100 శాతం నిజమైంది. సంపద సృష్టించడమే కాకుండా.. పేదలకు ఎంతవరకు లబ్ది చేకూర్చగలిగామనేది కూడా విజన్‌ డాక్యుమెంటులో భాగమే. ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత కొత్తగా ఉందని.. ఒత్తిడిగా ఉందని యంగ్‌ ప్రొఫెషనల్స్‌ భావించకూడదు. కష్టంతో కాకుండా.. ఇష్టంతో పని చేయండి. నియోజకవర్గంలో 9మంది సభ్యులతో కలిసి యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పని చేయాలి. అందర్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. క్షేత్రస్థాయికి వెళ్లిన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రభుత్వానికి.. నాకూ బలంగా ఉండాలి. మీ సత్తా ఏంటో నిరూపించాలి. సీఎం మంచి వాళ్లను తమ నియోజకవర్గానికి పంపించారని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. మీరు మంచి పేరు తెచ్చుకోండి.

నాకూ మంచి పేరు తీసుకురండి. ఇవాళే ఓ డెవలప్మెంట్‌ జరిగింది. ఏపీకి సెమీకండక్టర్‌ యూనిట్‌ను కేంద్రం కేటాయించింది. ఇది మంచి పరిణామం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ ఎకో సిస్టం ఏర్పడడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం దొహదపడుంది’’ అని సీఎం చంద్రబాబు వివరించారు. శిక్షణ ముగించుకున్న 175 యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రణాళిక శాఖ నియామక పత్రాలు అందచేసింది. కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్‌, పీ`4 ఫౌండేషన్‌ వైఎస్‌ ఛైర్మన్‌ కుటుంబరావు, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Previous Post

తూర్పు అభివృద్ధిపై దృష్టిపెట్టండి

Next Post

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లో

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist