శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్ వద్ద జర్నలిస్ట్ ఈశ్వర్‌పై వైసీపీ నేతల దాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండిరచారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులపై దాడులు అయిపోగా.. ఇప్పుడు పాత్రికేయుల వంతు వచ్చిందా అని ఆక్షేపించారు. వైసీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని లోకేశ్ మండిపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్‌నగర్ వద్ద జర్నలిస్ట్ ఈశ్వర్‌పై వైసీపీ నేత, శ్రీకాళహస్తీశ్వర ఆలయం బోర్డు మెంబర్ జయశ్యామ్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈశ్వర్‌కి చెందిన స్థలాన్ని కబ్జా చెయ్యడమే కాకుండా ప్రశ్నించినందుకు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడటం దారుణమని దుయ్యబట్టారు. జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడిన జయశ్యామ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ స్థలాన్ని తిరిగి ఆయనకి చెందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి సభ్యుడు బుల్లెట్ జయ శ్యామ్.. స్థానిక రాజ్ న్యూస్ విలేకరి ఈశ్వర్‌పై దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీ వద్ద తన ఇంటి స్థలాన్ని జయశ్యామ్ కబ్జా చేసి, పునాదులు వేశారని ఈశ్వర్ ఆరోపించారు. ఇదేం న్యాయమని ప్రశ్నించడంతో జయశ్యామ్ దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టింది. ఇటీవల తెదేపా రాష్ట్ర కార్యదర్శి చలపతినాయుడుపై దాడికి పాల్పడిన జయశ్యామ్.. తాజాగా విలేకరిపైనా దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చిన జగన్‌రెడ్డి
జగన్‌రెడ్డికి జనం ఒక్క అవకాశం ఇస్తే, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చేశారు లోకేష్ ధ్వజమెత్తారు. చట్టాన్ని కాపాడాల్సిన కొంతమంది పోలీసులని సుపారీ గ్యాంగులుగా వైసీపీ వాడుతున్నారని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలుకి చెందిన తెలుగు యువత నేతలు గంజి మాజేష్, గంజి మనోజ్‌లపై తప్పుడు కేసులు పెట్టి హింసించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఓ కేసు దర్యాప్తు కోసమంటూ తీసుకెళ్లి, వైద్యపరీక్షలు పేరు చెప్పి గంజాయి కేసులో ఇరికించాలని చూడటం దారుణం. చట్టప్రకారం వ్యవహరించని పోలీసులు చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని లోకేష్ హెచ్చరించారు.