- ముంపు బాధితులకు ఇంటి పట్టాలు పంపిణీ
రైల్వేకోడూరు(చైతన్యరథం): మంగంపేట ముంపు బాధితులకు కేటాయించిన ఆర్‌ఆర్-5 లేఅవుట్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ కాపువల్లి, అరుంధతీవాడ, గిరిజన ముంపు బాధితులకు కేటాయించిన ఆర్‌ఆర్-5, లే అవుట్‌లో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో కలిసి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండిపల్లి మాట్లాడుతూ మంగపేట ముంపు బాధితులకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారా లు అందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ లేఅవుట్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజ్, స్కూల్ బిల్డింగ్, విద్యుత్, ఆట ప్రాంగణం, బరియల్ గ్రౌండ్, పార్క్ తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కాలనీలో విశాలమైన రోడ్లు ఉన్నాయని, రోడ్డు కిరువైపులా గ్రీనరీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ లేఅవుట్ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్ చేతులమీదుగా లబ్ధిదా రులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ రూపానంద్, రాజంపేట సబ్‌కలెక్టర్ నదియాదేవి, తహసీల్దారు పేరు మున్ని, ఏపీఎస్‌పీడీసీఎల్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.