- పోలీసు అధికారుల సంఘం వివరణ
- టీడీపీ నేత వర్ల రామయ్యను కలిసిన సంఘం నాయకులు
అమరావతి(చైతన్యరథం): ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు ఇప్పుడు టీడీపీ నేతల్ని బతిమాలుకుంటున్నారు. సంఘం నేతలు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యని కలిసి పలు విషయాలపై వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్ల కారణంగానే గతంలో చంద్రబాబును దూషించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. గత పరిణామాలు మనసులో పెట్టుకోవద్దని, తమను క్షమించాలని కోరారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను నాటి డీజీపీ నిర్వీర్యం చేశారని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. తమను పావులుగా వాడుకున్నారని, తాము చేసిన పనికి చాలా బాధపడ్డామని తెలిపారు. కాగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారుల సంఘం నేతల పేరుతో కొంత మంది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తొడలు కొట్టారు.. బూతులు తిట్టారు. చొక్కా విప్పితే మేమూ రౌడీలమే అన్నారు. ప్రతీ దాంట్లోనూ ముందుకొచ్చి.. వైసీపీ నేతల కన్నా ఓవరాక్షన్ చేసేవారు.