- పాల దిగుబడి పెంపే ప్రధాన లక్ష్యంగా అమలు
- పాడి రైతులకు ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహం
- వేతన, సామగ్రి ఖర్చుకు ఎకరానికి రూ.99 వేలు
అమరావతి(చైతన్యరథం): పేద రైతులకు జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాల దిగుబడి పెంపే లక్ష్యంగా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ప్రారం భించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృ ద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు ‘‘ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు’’ పథకం అమలు చేయగా వైసీపీ వచ్చాక పథకం అమలు చేయకపోగా పాల సేకరణలో నిబంధనలు విధించి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతులు (అనగా 5 ఎకరాలలోపు వారు) తమ పొలంలో కనీసం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేందుకు దుక్కి దున్నడం, విత్తనం/ గడ్డి కలుపులు నాటడం, నీటిసరఫరా, ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు. వేతన, సామాగ్రి ఖర్చుకు రెండేళ్ల కాల వ్యవధిలో ఒక ఎకరానికి రూ.99 వేలు లబ్ధి చేకూరుతుందని వెల్లడిరచారు. అర్హులైన ప్రతి రైతుకు అమలుచేయాలని ఉపాధి హామీ, పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశిం చారు.