- జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటం
- వైసీపీ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశాలు
- జగన్ పాలనలో ఎస్సీ, మైనార్టీలకు జరిగిన సామాజిక అన్యాయాన్ని ఎండగట్టడం
- నియోజకవర్గాల వారీగా టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు
అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూప కల్పనలో పెద్దఎత్తున జరుగుతున్న అవతకవకలను రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోని పరిస్థితుల్లో ఈ అంశంపై జాతీయస్థాయిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశంపార్టీ నిర్ణ యించింది. ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమి టీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు,నక్కా ఆనం ద్‌బాబు, కొల్లు రవీంద్ర, ఎంఎ షరీఫ్, వంగలపూడి అనిత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ పరుచూరి అశో క్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఓటరులిస్టులో అవకతవకలను బయటకు తీసి రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవ డంతో, లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ఎన్నికల సం ఘంపై వత్తిడి తేవాలని సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ దోపిడీ, వైఫల్యాలు, దళితులు, బీసీలు, మైనా రిటీలపై జరుగుతున్న దాడులు, ఆయా వర్గాలకు జరు గుతున్న అన్యాయాలపై ప్రజలను మరింత చైతన్యం చేయాలని, అదే విధంగా పార్టీ చేపట్టిన భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసే విషయమై చర్చించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:
1). ఇందులో భాగంగా ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలు త్వరలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌ని కలవాలని నిర్ణయించారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కోసం జాతీయస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు.వాలంటీర్ వ్యవస్థ ద్వారా అధికారపార్టీ చేస్తున్న అక్రమాలపై సీఈసీికి ఫిర్యా దు చేయాలని, నియోజకవర్గాల వారీగా అక్రమా లపై నేరుగా సీఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణ యించారు. గురువారం జరగబోయే టీడీపీ, జన సేన సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులకు సంబంధించి న్యాయపోరాటానికి పార్టీతరపున న్యాయసహాయం అందించాలని నిర్ణయించారు.
2). ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజు ల యాక్షన్‌ప్లాన్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. టీడీపీ-జనసేన పార్టీలు నియోజకవర్గ స్థాయిల్లో ఉమ్మడి ఆత్మీయసమావేశాలు నిర్వహించాలని నిర్ణ యించారు. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రభుత్వ వైఫల్యాల పై చార్జిషీట్లు, వైసీపీ హయాంలో జరుగుతున్న దోపిడీపై ఆయా సమావేశాల్లో చర్చించాలని నిర్ణ యించారు. ఇరుపార్టీలు కృష్ణాజలాలు, విద్యుత్ ఛార్జీల పెంపు,కరువు వంటి అంశాలపై నియోజక వర్గ స్థాయిల్లో పోరాడాలని నిర్ణయించారు. అదే విధంగా నిరుద్యోగ సమస్య, విద్యుత్‌ఛార్జీల పెంపు, రోడ్లు, పేదల గృహనిర్మాణంలో అవకతవకలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఇసుక దోపిడీ వంటి అంశాలను మరింత సమర్థవంతంగా ప్రజ ల్లోకి తీసుకువెళ్లి ప్రజల తరపున పోరాడాలి అని నిర్ణయించారు.
3). రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండను జాతీయ స్థాయిలో ఎండగడుతూ ప్రత్యేక కార్యక్ర మాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడేలా ప్రత్యేకకార్యక్రమంతో పాటు, భారీ దళిత గౌరవ సభ నిర్వహించాలని, ఎస్సీ హక్కుల కోసం పోరాడే వారందరినీ ఈ సమావేశా లకు ఆహ్వానించాలని నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల హత్యలు, స్కీముల రద్దు, దళితులపై వేధింపులు వంటివాటిని ప్రజల్లోకి తీసు కెళ్లాలని నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి చైతన్యం తీసుకురావా లని, ఇందుకోసం త్వరలోనే ఎజెండా, విధివిధా నాలు రూపొందించాలని నిర్ణయించారు.
4). జగన్మోహన్‌రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యా యంపై రాష్ట్రవ్యాప్తంగా 25పార్లమెంటు నియోజక వర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించా లని, బీసీ సంఘాలు, తటస్థులను ఈ సమావేశాల్లో భాగస్వాములుగా చేయాలని సమావేశం నిర్ణయిం చింది. దీంతో పాటు బీసీ సాధికార సమితి సభ్యు లంతా సంబంధిత కులాలవారీతో సమావేశాలు నిర్వహించి ఆయా కులాలకు గత నాలుగున్నరేళ్ల జగన్‌పాలనలో జరిగిన అన్యాయంపై చైతన్యవం తం చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్త య్యాయని మిగిలిన చోట్ల కూడా నిర్వహించాలని నిర్ణయించారు.
5). రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలకు జరుగుతున్న అన్యా యం,దాడులపై మతపెద్దలు, తటస్థులు, మైనారిటీ ల హక్కులకోసం పోరాడే సంఘాలతో కలిపి సమా వేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.రాష్ట్రస్థాయి లోని మైనారిటీ ముఖ్యనేతలు నాలుగు బృందాలు గా ఏర్పడి 100రోజుల యాక్షన్ ప్లాన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. మైనారిటీలతో సమావేశా లు, బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
6). భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమంపై సమావేశంలో చర్చించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుచేసే సంక్షేమ కార్యక్రమాలు, ఒక్కో కుటుం బానికి జరిగే మేలుని వివరిస్తూ రూపొందించిన బాండ్స్‌ని ప్రజలకి అందజేయడం, ప్రజలకు అన్ని సంక్షేమకార్యక్రమాల గురించి వివరించడం లాంటి కార్యక్రమాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసా రు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించే వారిని గుర్తించి అభినందించాలని నిర్ణయించారు.