కడప: మూడేళ్లలో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి భ్రష్ట్ పట్టించాడని కడప జిల్లా టీడీపీ నేతలు విమర్శించారు. వైసీపీ పాలనలో కూల్చివేతలు తప్ప మరేం లేవన్నారు. కడప నగరం అశోక్‌నగర్‌లో అర్థరాత్రి సమయంలో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా పేదల ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత మహిళలు…. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీనికి టీడీపీ నేతలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కడప టీడీపీ ఇంఛార్జ్ అమీర్ బాబు, పట్టణ అధ్యక్షుడు సానపు రెడ్డి శివకొండారెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి రవి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.