అమరావతి: ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరుతో సంయుక్తంగా నిరసనలకు టీడీపీ-జనసేన పిలుపు ఇచ్చాయి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఈ నెల 18,19 తేదీల్లో ఆందోళన చేపట్టనున్నారు. రోడ్ల దుస్థితిపై ఫోటోలు, వీడియోలు తీపి.. #GunthalaRajyamAP #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్ తో పోస్టు చేయాలి.. సైకో సర్కారు మొద్దునిద్ర వదిలించాలి.. జగన్ పరిపాలనలో రాష్ట్రమంతా గుంతలమయమైంది.. అధ్వాన్న రోడ్లపై ప్రయాణం నరకంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ-జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెండు పార్టీలు పిలుపునిచ్చాయి.