విజయవాడ: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టళ్లలో రహస్య కెమెరాలు లేవని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. బాలికల హాస్టల్ స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు ఉన్నాయంటూ ఇటీవల విద్యార్థులు ఆందోళను దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా విచారణ జరిపించింది. ఇందుకు సంబంధించి ఐజీ అశోక్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కళాశాలలో రహస్య కెమెరాలేమీ దొరకలేదని వెల్లడిరచారు. విద్యార్థులు,తల్లిదండ్రుల అనుమాలను తీర్చామని చెప్పారు. కెమెరాలు, వీడియోలు చూసినట్లు ఎవరూ చెప్పలేదన్నారు. క్రిమినల్ కేసుల్లో తొలిసారి సీఈఆర్‌టీ సేవలు వినియోగించినట్లు తెలిపారు. ఢల్లీికి చెందిన సీఈఆర్‌టీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందన్నారు. కొందరి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ ఘటనపై ఎలాంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. విద్యార్థుల భద్రపై కళాశాల యాజమాన్యానికి కొన్ని సూచనలు చేశామన్నారు. కళాశాలలో నమోదైన కేసు దర్యాప్తును తనతో పాటు మరో ఇద్దరు ఐజీలు ఎం రవి ప్రకాష్(ఐజి సెబ్), పీహెచ్డీ రామకృష్ణ, ఐ జి (పి అండ్ ఎల్) పర్యవేక్షిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు. హాస్టల్ స్నానాల గదుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో హాస్టల్ స్నానాల గదుల్లో తనిఖీలు చేశాం. స్నానాల గదులు, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించాం. విచారణలో కెమెరాలు,కానీ ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదు.
కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందనే అందరూ విచారణలో చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నాం. మేము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్లు, ఒక ట్యాబ్ ను సీఈఆర్‌టీ బృంద సభ్యులకు అప్పగించాం. విద్యార్థులు ఎవరు భయపడనవసరం లేదు. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదు. ఢిల్లీ సంస్థ సీఈఆర్‌టీ టెక్నికల్ విచారణ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఆ నివేదిక కూడా వస్తుంది. ఈ ఘటనపై ఏటువంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తేవచ్చు. విద్యార్థినీ, విద్యార్థులు వారి వద్ద ఏమైనా సాక్ష్యాలు ఉన్నా, సందేహాలు ఉన్నా అధికారులకు ఇవ్వవచ్చు, తెలియజేయవచ్చు అని ఐజీ అశోక్‌కుమార్ చెప్పారు. ఈ మేరకు ముగ్గురు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ. రమణమ్మ (సీఐ), ఫోన్ నెంబర్: 9866237061 కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ రాఘవేంద్రరావు, ఫోన్ నెంబర్: 9440796400, లతా కుమారి(డీఎస్పీ) ఫోన్ నెంబర్: 9440796508,