నందిగామ : నందిగామ మండలంలోని ఈ క్రాఫ్ట్ నమోదులో జరిగిన అవకతవకలను మరియు పంటబీమా రాని రైతులకు పంట బీమా వెంటనే చెల్లించాలని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. అవకతవకలను పరిశీలించి వెంటనే సరిచేయాలని నందిగామ వ్యవసాయ అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతుకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రైతు పట్ల ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పార్టీకి చెందిన రైతులకే పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని దుయ్యబట్టారు. రైతు భరోసా కేంద్రాలు కావు అవి బోగస్ కేంద్రాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో సహాయక మండలి ఏం చేస్తోందని మండ్డిపడ్డారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో ఈ పంట నష్టం పరిహారం వివరాలను తెలుసుకోవాలి కానీ వారి పర్యవేక్షణ ఎక్కడ కనబడలేదన్నారు. విఏఏ లు వైసీపీ నాయకుల కనుసన్నలలో పనిచేస్తున్నారు విఏఏలు వాలంటీర్లు ఇచ్చిన లిస్టులను పై అధికారులకు తీసుకొని వెళ్లి ఇస్తున్నారని విమర్శంచారు. పంట నష్టపరిహారం కింద కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని ఆరోపణలు చేశారు. నిజమైన రైతులకు పంట నష్టపరిహారం అందలేదన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందే వరకు తెలుగుదేశం పార్టీ రైతు పక్షాన పోరాటం చేస్తోందని తంగిరాల సౌమ్య గారు తెలియజేశారు