అమరావతి: కేంద్రం విడుదల చేసిన స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం చివరి స్థానంలో నిలవడంపై తెదేపా నేతలు విచారం వ్యక్తం చేశారు. స్టార్టప్స్ ర్యాంకింగ్స్‌లో బిహార్‌తో పాటు ఏపీ దిగువన ఉండటం దురదృష్టకరమని నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రాన్ని చివరి స్థానంలో నిలిపిన ఘనత జగన్‌రెడ్డిదేనన్నారు. స్టార్ట్ప్స్ ఏర్పాటుకు తెలుగుదేశం హయాంలో చేసిన కృషి వైసీపీ హయాంలో ధ్వంసం అవుతుండటం బాధగా ఉందన్నారు. స్టార్ట్ప్స్ అభివృద్ధిలో 2018-19లో ఏపీ అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. కొత్త ఆలోచనలను ఫలవంతం చేసేందుకు బలమైన వేదికలను సన్‌రైజ్ ఇంక్యుబేషన్ హబ్, ఫిన్‌టెక్ వ్యాలీ లాంటి వ్యవస్థల ద్వారా ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి ద్వారా అనేక స్టార్టప్‌లు తమ ప్రభుత్వ హయాంలో విజయవంతంగా ఏర్పడ్డాయని వెల్లడిరచారు.