రాష్ట్ర వ్వాప్తంగా టీడీపీ`జనసేన ఆధ్వర్యంలో నిరసనలు
అమరావతి:రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నిరసనగా టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ‘‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’’కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మొదటిరోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా ఆందోళనలు చేశారు. గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కళ్ళకు కట్టినట్లు వైకాపా ప్రభుత్వా నికి చూపారు. పలుచోట్ల ధర్నాలు, పాదయాత్రలు, ర్యాలీ కార్యక్రమాలు నిర్వ హించి నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా తయారై గుంతలు పడి ప్రజలు అవస్థలు పడుతున్నారని..అయినా పాలకులకు ఇవేమి పట్టించు కోకుండా..ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు.ఇత రరాష్ట్రాలవారు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటేనే భయపడుతున్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ను సమస్యల ఆంధ్రప్రదేశ్‌గా జగన్‌రెడ్డిమార్చాడని ఆందోళనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి..
ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రామ్మోహన్‌రావు ఆధ్వర్యాన టీడీపీ-జనసేన నాయకులు రహదారిపై పాదయాత్ర చేసి నిరసన తెలియజేశారు. నందిగామ నియోజకవర్గం కంచిక చర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో రహదారిలో గుంతలను పరిశీలించి జీఎస్సీ డస్ట్‌తో పూడ్చి నిరసన తెలిపారు.
విజయవాడలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నేత అమ్మిశెట్టి వాసుఆధ్వర్యంలో టీడీపీ-జనసేన నాయకులు,కార్యకర్తలు ఆందోళన చేశారు. ప.గో జిల్లా అత్తిలి మండలం కేసముద్రపుగట్టులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ,రామచంద్రరావు ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రహదారి గుంతల వద్ద ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అన పర్తిలో నల్లమిల్లి, మర్రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన నేతలు సంయుక్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణలు రోడ్డు దుస్థితిపై పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజక వర్గంలో స్థానికి టీడీపీ ఇన్‌ఛార్జ్‌రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వెల్ల వంతెన నుండి ద్రాక్షారామ వెళ్లే రోడ్డు వరకు, తాళ్ళపొలం నుండి ద్రాక్షారామ వరకు పాదయాత్ర చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, జనసేన ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి మందలపర్రు కాలువ వరకు గుంతలు పడ్డ రోడ్లవద్ద నిరసన వ్యక్తం చేశారు. రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజాం టీడీపీ కార్యాలయం నుండి డోలపేట జంక్షన్ వరకు టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. పల్నా డు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో టీడీపీ విభిన్న ప్రతి భావంతుల రాష్ట్ర అధ్యక్షుడు పూదోట ఆంథోనీ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల వెళ్లే రహదారిపై ఉన్న గుంతల్లో కంకర వేసి పూడ్చారు. అచ్చంపేటలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ-జనసేన నాయకుల సంయుక్తంగా రోడ్ల దుస్థతికి నిర సనగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.