ఈ సభలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ యువగళం-నవశకం సభ దేశ రాజకీయా ల్లో కీలక ఘట్టం కానుందన్నారు. యువ గళం-నవశకం కార్యక్రమాన్ని జనసము ద్రంగా మార్చిన కార్యకర్తలు.. వీర మహిళ లు.. నిజంగా గర్వపడాల్సిన సమయం. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉత్తరాంధ్ర లో నేడు జరుగుతున్న ఈ కార్యక్రమం మన ప్రాంతంలో జరగడం మన అదృష్టం. దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచిపోయే గొప్ప కార్యక్రమం నేడు మన గడ్డపై జరుగుతోంది. యువగళం పాద యాత్ర ప్రారంభంతో చిత్తూరు చిందు లేస్తే.. కడప కదిలింది. కర్నూలు కన్నుల పండువగా మారింది. అనంతపురం ఆత్మీ యతను చాటుకుంది. నెల్లూరు నడుము బిగించింది. ఒంగోలు ఉరకలేసింది.. గుంటూరు గర్జించింది. కృష్ణా కృష్ణమ్మలా కరుణ చూపింది… గోదావరి గర్జించిం ది.. విశాఖపట్నం విజృంభిస్తే.. విజయ నగరం విజయపతాకం ఎగరేసింది. శ్రీకాకుళం శంఖారావం పూరించి.. ఉత్సాహంతో.. ఉరుముతో ఉద్యమంతో ముందుకు ఉరికింది. నేటి ఈ కార్యక్రమం ముగింపు కాదు… ఇప్పటినుంచే ఆరంభం మొదలవుతుంది. ఇదే ఉత్సాహంతో మరో 100 రోజులు కొనసాగిస్తే.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని చూస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించు కొని సైకోను తరిమితరిమి కొట్టబోతు న్నాం. 100రోజుల్లో దళితులు.. ఆడబిడ్డల పై జరుగుతున్న అన్యాయాలు.. అఘా యిత్యాలను కట్టడి చేయబోతున్నాం. 100 రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవ కాశాలు కల్పించబోతున్నాం. 100 రోజు ల్లో రైతుల ముఖాల్లో ఆనందం నింపి, వారిని రారాజుల్ని చేయబోతున్నాం. 100 రోజుల్లో బడుగుబలహీన వర్గాల్ని పైకి తీసుకురాబోతున్నాం. 100 రోజుల్లో పోల వరం పూర్తిచేయడానికి శంఖారావం ఊద బోతున్నాం.. 100 రోజుల్లో మన రాష్ట్ర రాజధాని ఇదని గర్వంగా చెప్పుకోబోతు న్నాం. అన్నింటికంటే ఘనంగా నేను తెలు గోడిని.. నేను ఆంధ్రుడిని అని ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం గర్వపడేలా రొమ్ము విరుచుకొని నడిచే రోజులు చూడ బోతున్నాం. ఇదే ఉత్సాహంతో నాలుగున్న రేళ్లు పడిన కష్టాలు… బాధలు అధిగ మించి మనం ముందుకు సాగాలి. 2019 ఎన్నికలు ముగిశాక చంద్రబాబు పని అయి పోయింది.. పసుపు రంగు కనిపించదు.. తెలుగుగుదేశం కథ ముగిసింది అన్నారు. అలా అన్నవాళ్లు ఒక్కసారి ఇక్కడికొచ్చి చూస్తే.. కనుచూపు మేరంతా కనిపిస్తున్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తల్ని చూసి అదిరి పడతారు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం – జన సేన కార్యకర్తలు గుండెధైర్యంతోనే ముందు కు సాగారు. రాబోయే 100 రోజులు క్రమ శిక్షణతో, కలిసికట్టుగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఎవరికైనా ఏమై నా ఇబ్బంది కలిగినా.. తప్పు జరిగిందని అనిపించినా పెద్దమనస్సుతో పెద్దమనుషు ల్లా క్షమించి, ఇది మన కార్యక్రమం అను కొని సర్దుకుపోవాలని కోరుతున్నాను. ఈ సభను చూసి బాధపడాల్సింది తాడేపల్లి లోని పిల్లి మాత్రమేనని గుర్తుంచుకోవాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.