హైదరాబాద్ : నందమూరి నట సింహాం, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను టీఆర్ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు సాయి నాగార్జున ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్‌ను కట్ చేసి నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ… అన్ని పార్లమెంట్ స్థాయిలలో నందమూరి బాలకృష్ణ అభిమానులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించారని అన్నారు. సినిమా రంగంలో తనదైనా ముద్ర వేసుకొని డైలాగ్ తో యువతిని ఉర్రూతలూగించిన నటసింహం బాలకృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలను తీసి విజయాలను సాధించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి అజ్మీర రాజు నాయక్, అధికార ప్రతినితి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రచారి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యకక్షులు శ్రీపతి సతీష్ కుమార్, టీఎన్టీయూసి ఉపాధ్యకక్షులు ఎబికె మోహన్‌రావు, కర్నాటి శంకర్, మునిగడప శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.