- తెలంగాణా పోలింగ్ రోజే రైతులు గుర్తొచ్చారా జగన్?
- ఖేలో ఇండియా పేరుమార్చి ఆడుదాం ఆంధ్ర పేరుతో బిల్డప్
- జగన్‌కు భయం పట్టుకుంది… అందుకే పరదాల యాత్ర
- చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలని చూశారు
- కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దోచిందంతా కక్కిస్తాం
- టీడీపీ కేడర్‌ను వేధించిన వారిని ఎక్కడున్నా వదలను
- కాకినాడ బహిరంగసభలో యువనేత నారా లోకేష్
కాకినాడ: కరవుతో రైతులు అల్లాడుతుంటే కనీసం సమీక్షకూడా చేయని జగన్‌కి తెలంగాణ పోలింగ్ రోజు రైతులు గుర్తొచ్చారు..సాగర్ ఆయకట్టు రైతులపై ప్రేమ పొంగి పొర్లింది, పోలీసుల్ని పంపి నాగార్జున సాగర్‌పై శాంతిభద్రతల సమస్య సృష్టించాడు. ఇదీ మరో కోడి కత్తి, బాబాయ్ గుండెపోటు డ్రామా లాంటిదేనని యువ నేత నారా లోకేష్ దుయ్యబట్టారు. కాకినాడ రూరల్ సర్పవరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన భారీబహిరంగ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ జగన్‌కి భయం పట్టుకుందన్నారు.జగన్‌కి చంద్రబాబుని చూస్తే భయం, పవన్ కళ్యాణ్‌ని చూస్తే భయం,లోకేష్‌ని చూస్తే భయం. చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చేస్తే భయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే భయం, లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే భయం. సొంత అమ్మనిచూసినా భయమే..సొంత చెల్లిని చూసినా భయ మే. ఆఖరికి ప్రజల్ని చూసినా జగన్‌కి భయమే.. అందుకే పరదాలు కట్టుకొని దొంగలా వెళ్తాడు. తెలుగు దేశం ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైసీపీ గజదొంగల పార్టీ అని లోకేష్ అన్నారు.
కోడికత్తి వారియర్స్ అని పేరు పెట్టండి!
జగన్ ఐపీఎల్ టీము పెడతామంటున్నాడు..దీనికి కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుంది.. సీనియర్ బ్యాట్స్‌మెన్ అవినాష్‌రెడ్డి,బెట్టింగ్‌స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి,గంట స్టార్ అవంతి, ఆల్ రౌం డర్ గోరంట్ల మాధవ్, రీల్‌స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు. అబ్బో మా మూలు టీము కాదు.ఈ మధ్య ప్రకటించిన అన్ని కార్య క్రమాలు తుస్సుమన్నాయి. ఇప్పుడో కొత్త స్కీం తెచ్చాడు దాని పేరు ఆడుదాం ఆంధ్రా అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ ఇపుడు ఆడు దాం ఆంధ్రాఅంటూ కొత్త డ్రామా మెదలెట్టాడు. నియో జకవర్గానికి ఓ ఇండోర్ స్టేడియం అన్నాడు. క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. కానీ ప్లేయర్స్ నుండి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. స్టేడియంలు, గ్రౌండుల్లో ప్రాక్టీస్ చేయడానికి, ఆడ్డానికి వచ్చినవాళ్లని ఫీజులు కట్టకపోతే రావొద్దంటూ తరిమేస్తున్నాడు ఈ జగన్. కేంద్ర ప్రభు త్వం ఖేలో ఇండియా కార్యక్రమానికి తెలుగుపేరు పెట్టి బిల్డప్ ఇస్తున్నాడని లోకేష్ విమర్శించారు.
కేక పుట్టించిన కాకినాడ…
కాకినాడ కేక పుట్టించింది. కాకినాడ రూరల్, టౌన్ నియోజకవర్గాల ప్రజలు, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు. కాకినాడ కాజా ఎంత స్వీట్ గా ఉంటుందో ఇక్కడ ప్రజలు అంత స్వీట్‌గా ఉంటారు. శ్రీ భావనారాయణస్వామి ఆలయం, జామి యా మస్జీద్, చర్చ్ స్క్వేర్ ఉన్న పుణ్య భూమి కాకినాడ. గొప్ప చరిత్ర ఉన్న కాకినాడలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. టీడీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టినవారు కాకినాడలోఉన్నా కంబోడియా పారిపోయి నా పట్టుకొచ్చి లోపలేస్తా.చట్టాన్ని ఉల్లంఘించిన అధికా రులకు కూడా శిక్ష తప్పదని లోకేష్ హెచ్చరించారు.
ఓటమి భయంతోనే చంద్రబాబు అరెస్టు…
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబుని అరెస్ట్ చేసాడు. న్యాయానికి సంకెళ్లు వేసాడు.. చంద్ర బాబుని 53 రోజులు బంధించాడు. చంద్రబాబు చేసిన తప్పేంటి? ప్రజల తరపున పోరాడటం తప్పా? జగన్ చేసే తప్పులను ప్రశ్నించడం తప్పా? కుటుంబం కంటే ప్రజలే ఎక్కువ అనుకోని రాష్ట్రం కోసం కష్టపడటం తప్పా? లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్న దొంగ జగ న్.. చంద్రబాబుకి అవినీతిమరక అంటించాలని ప్రయ త్నించాడు. ముందు రూ.3వేల కోట్ల అవినీతి అన్నా రు. తర్వాత 370కోట్లు అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్‌కి డబ్బు లు వచ్చాయి అంటున్నా రు. ఆ 27 కోట్లు ఏంటో తెలుసా.. మన పసుపు సైన్యం సభ్యత్వం తీసుకో ని కట్టిన రుసుము. ఆరో పణలు తప్ప ఆధారాలు లేవని బెయిల్ ఇస్తూ హై కోర్టు తేల్చేసిందని లోకేష్ స్పష్టం చేశారు.
చంద్రబాబుది ప్రజాబలం – జగన్‌ది ధనబలం…
జగన్ వ్యవస్థల్ని మ్యానేజ్ చేసి చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టినా ఆఖరికి నిజమే గెలిచింది. వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు ఒక్కరు కూడా నమ్మ లేదు. జగన్ ప్రిజనరీ… చంద్రబాబు అంటే విజనరీ. బాబుది ప్రజా బలం… జగన్ ది ధన బలం. బాబుకి ప్రజల పై నమ్మకం.. జగన్‌కి దొంగ ఓట్ల పై నమ్మకమని లోకేష్ ఎద్దేవా చేశారు.
నాది జగన్ మాదిరి వీక్లీఆఫ్ యాత్రకాదు!
యువగళం పాదయాత్రకి జగన్ పాదయాత్రకి తేడా ఏంటో మీకు తెలియాలి. జగన్ పాదయాత్రకి ప్రతి వారం సెలవులే…కోర్టు వాయిదా పేరుతో హైదరాబాద్ వెళ్లి ప్యాలస్‌లో పడుకునేవాడు. కానీ మీ లోకేష్ యువ గళానికి బ్రేకులు లేవు..శని, ఆదివారం సెలవులు లేవు, కోర్టు కేసులు లేవు, పండగలు లేవు. యువగళం ప్రజా గళంగా మారింది, అందుకే జగన్ పాదయాత్రను అడ్డు కోవడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. పోలీసుల్ని పంపి నన్ను అడ్డుకున్నాడు, నా మైక్ వెహికల్ సీజ్ చేసారు, నా మైక్ పట్టుకెళ్లిపోయారు, నేను నిలబడిన స్టూల్ కూడా తీసుకుపోయారు. జీఓ.1 తెచ్చినప్పుడే జగన్‌కి చెప్పా మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో యువగళం ఆగదు అని. ఆ తరువాత పిల్ల సైకోలను పంపి రాళ్లు, గుడ్లు వేయించాడు… మన వాళ్లు గట్టిగా తన్ని, కట్లు కట్టి పంపారని లోకేష్ అన్నారు.
మా గొంతు నొక్కేవాడు ఇంకా పుట్టలేదు!
జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం.. నాది అంబేద్కర్ రాజ్యాంగం.జగన్ ది తాత ఇచ్చిన అహంకారం.. నాది తాత ఇచ్చిన గొంతు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన గొంతు నొక్కే వాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు.ఏమి పీకలేక జగన్ చంద్రబాబు ని అరెస్ట్‌చేసి నన్ను ఆపాడు. అయినా యువగళం ఆగ దు.. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడతాం. సాగ నిస్తే పాదయాత్ర…అడ్డుకుంటే వైసీపీకి శవయాత్ర.జగ న్‌ని చూస్తే పిట్టలదొరగుర్తొస్తాడని లోకేష్ అన్నారు.
ఇసుకలో బొక్కింది రూ.5400 కోట్లు!
జగన్ రోజూ పందికొక్కులా ఇసుక తింటున్నాడు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1500, జగన్ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.5000. రోజుకి ఇసుక దోపిడీ లో జగన్ వాటా ఎంతో తెలుసా రూ. 3 కోట్లు, నెలకి రూ.90కోట్లు, సంవత్సరానికి రూ.1080 కోట్లు. ఐదేళ్లలో జగన్ భవననిర్మాణ కార్మికుల పొట్టకొట్టి సం పాదించిన ఇసుక ఆదాయం ఎంతో తెలుసా రూ.5,400 కోట్లు. జగనాసురుడి ఇసుక దాహానికి ఏకంగా అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. గుం డ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. కరువు-జగ న్ కవల పిల్లలు. జగన్ ది దరిద్ర పాదం. 122 ఏళ్లలో ఎప్పుడూ లేని కరువు రాష్ట్రాన్ని శనిలా పట్టిపీడిస్తోంది. సాగునీరు లేక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని లోకేష్ విమర్శించారు.
కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ జగన్…
జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. జగన్‌కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్‌లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ వెయ్యటం కాదు. కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్ అని లోకేష్ విమర్శించారు.
మహిళల డబ్బు కొట్టేసిన జగన్…
జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగు తున్నాడు. 45ఏళ్లకే బీసీ, ఎస్సీ,ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచు కున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కొట్టే సాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తా ను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. మహా శక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి: 18 ఏళ్లు నిండిన మహిళలకు ` నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం: ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం: ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4)ఉచిత ప్రయాణం: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
యువగళం నిధితో ఆదుకుంటాం…
జగన్ యువత భవిష్యత్తుపై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుం టున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, డీఎస్సీ లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జీఓ 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువు తున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం…
టీడీపీ-జనసేన అధికారంలోకివచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండిరగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహ త్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టీడీపీ మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టీడీపీ అధికారం లోకి వచ్చిన వెంటనే అన్న దాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని లోకేష్ చెప్పారు.
ఉద్యోగులు, పోలీసులకూ ఎగనామం…
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీ ఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జీపీఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్ లీవులు, 8 టీఏ, డీఏలు పెండిరగ్ పెట్టాడు. ఆఖరికి జీపీఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడు తుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకం గా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్‌ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్‌కి 8 వేలు, కానిస్టేబుల్‌కి 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జీఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యథాతథంగా ఇస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం…
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. బీసీ బాలుడు అమర్నాధ్ గౌడ్‌ని పెట్రోల్ పోసి చంపే సారు. సైకో పాలనలో 26వేల మండి బీసీలపై అక్రమ కేసులు పెట్టారు. నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారు.టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చి న వెంటనే ఉపకులాల వారీగా నిధులు ఇస్తాం. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. జగన్ పాలన లో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. మైనా రిటీల్లో అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బలయ్యారు. మైనార్టీలకు ఉన్న అన్నిసంక్షేమ కార్యక్రమాలు రద్దుచేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇస్లా మిక్ బ్యాంక్ ఏర్పాటుచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
దళితులను వేధించేవారిపై కఠిన చర్యలు…
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి కొవ్వూరులో మహేం ద్ర వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి వైసీపీ నాయకులకు జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దుచేసాడు. టీడీపీ-జనసేన అధికారం లోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం.జగన్ రద్దుచేసిన 27దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగిప్రారంభిస్తామని లోకేష్ చెప్పారు.
రూరల్ లో అవినీతి ఫుల్!
కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని కన్నబాబుని ప్రజలు గెలిపించారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి కూడా అయ్యారు.