- ఆవేదన చెప్పుకోవడానికి కూడా ఎమ్మెల్యే అవకాశమీయలేదు
- నా ఉసురు తగిలి వైసీపీ భూస్థాపితం కావడం ఖాయం
- వైసీపీ సైకోల చేతిలో బలైన రబ్బానీ తండ్రి అబ్ధుల్లా ఆవేదన
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
వడ్లమూడి రా!… కదిలి రా బహిరంగసభ లో పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగానికి ముందు వైసిపి మూకల చేతిలో బిడ్డను కోల్పో యిన ఓ తండ్రి ఆవేదన సభికులను కంటతడి పెట్టించింది. పొన్నూరులో కొద్దిరోజుల క్రితం వైసీపీ సైకోల చేతిలో బలైన రబ్బానీ తండ్రి అబ్ధుల్లా సభలో కన్నీరు మున్నీరవుతూ… ‘‘నా కొడుకు రబ్బానీ (24) సినీ హీరో మాదిరి ఆకర్షణీయంగా ఉండేవాడు. ఏమైందో తెలియదు… నాలుగేళ్ల క్రితం కొంతమంది వైసీపీ సైకోలు నా బిడ్డను రోడ్ యాక్సిడెంట్ చేసి చంపి మా కుటుంబానికి కడుపుకోత మిగిల్చారు. నా కుమారుడి మరణంపై సీఎం జగన్?తోపాటు జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు లేఖలు రాసినప్పటికీ నాకు న్యాయం జరగ లేదు. మైనార్టీ యువకుడైన నా బిడ్డ మరణానికి కారణమైన వారిని శిక్షించాలని నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నప్ప టికీ నాకు న్యాయం చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ నా బీసీలు, నా మైనార్టీలు అంటూనే తమలాంటి వారికి తీరని తీరని ద్రోహం చేస్తున్నారు. నా బిడ్డని అకారణంగా చంపిన వారిపై కేసుకూడా లేకుండా మాఫీ చేశారు. మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కిలారు రోశయ్య దగ్గరికి వెళ్తే నా ఆవేదన చెప్పు కోవడానికి కనీసం సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి కారెక్కి వెళ్లిపోయారు. న్యాయం కోసం డీఎస్పీని సంప్రదిస్తే ముద్దాలను వారంలో ట్రేస్ చేస్తానని చెప్పి ఆనక కేసును నీరుగార్చారు. వైసీపీ కార్యకర్తలమైన మాకు ఎమ్మెల్యే రోశయ్య తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రంలో నా బిడ్డ లాంటి వాళ్లు ఎంతోమంది ఈ ప్రభుత్వంలో బలయ్యారు. ఈ అరాచక ప్రభుత్వానికి నా కుటుంబం ఊసురు తగిలి నాశనమైపోవడం ఖాయం. నేను ప్రతి రోజు నా బిడ్డ మరణాన్ని తలచుకొని కన్నీరు పెట్టని రోజు లేదు. తెలుగుదేశం పార్టీలో మాదిరి అక్కడ కార్యకర్తలకు పార్టీ అండలేదు. మా కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నా. కార్యకర్తల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న టీడీపీని అధినాయకత్వానికి రెండు చేతులు ఎత్తి నమష్కరిస్తున్నా. వైసీపీ శ్రేణులు కూడా ఆలోచించి నమ్మకద్రోహం చేసే ఇలాంటి ఎమ్మెల్యే కిలారి లాంటివాళ్లకు బుద్ధి చెప్పాలని కోరుతున్నా. వీరయ్య చౌదరి అభిమానిగా ఉన్నప్పటికీ జగన్ మాయమాటలు నమ్మి వైసిపిలో చేరాం. పార్టీ కోసం రేయింబవళ్లు కృషి చేసినప్పటికీ… మాకు తీరని అన్యాయం చేశారు’’ అంటూ విలపించారు. హృదయ విదారకమైన అబ్ధుల్లా ఆవేదన చూసి వేదికపైన ఉన్న నాయకులంతా చలించిపోయారు. అబ్ధుల్లా కుటుంబానికి తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర భరోసా ఇచ్చి, ఆయనను ఓదార్చారు.