అమరావతి: చంద్రబాబునాయుడి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని జగన్ రెడ్డి నీలి మీడియా, దాని అనుబంధ కూలి మీడియా వక్రీకరించి, ప్రజల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయని, దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యల్ని కూడా నిర్భయంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వక్రీకరించే సాహసానికి నీలి మీడియా దిగజారిందని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా నీలి మీడియా విషప్రచారం చేసిందన్నారు. చంద్రబాబుకు బెయిల్ షరతులు విధించిన సుప్రీంకోర్టు… గతంలో ఎలాంటి షరతులు లేవు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవరించిన సుప్రీంకోర్టు… చంద్రబాబు బెయిల్ షరతులు పాటించాల్సిందే.. బాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించకూడదు.. కేసుకు సంబంధించిన వివరాలు మీడియాతో మాట్లాడవద్దు.. అని నీలి మీడియా విషప్రచారం చేసింది. చంద్రబాబు పేరు వింటేనే జగన్ రెడ్డి భయపడుతున్నాడు అనడానికి న్యాయస్థానం చెప్పని దాన్ని చెప్పినట్టుగా నీలిమీడియా చేసిన ప్రచారమే నిదర్శనం. సింగిల్ గా వస్తుందంటున్న సింహం నేడు నక్కలా కుయుక్తులు, అబద్ధాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని శ్రీనివాస రెడ్డి దుయ్యబట్టారు.
న్యాయస్థానం వ్యాఖ్యల్ని తప్పుపడతారా?
సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 17- ఏ పై తీర్పు వచ్చేవరకు బెయిల్ రద్దు కేసు విచారణ చేపట్టలేమని ఏపీ సీఐడీకి తేల్చి చెప్పింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు చంద్రబాబు బెయిల్ రద్దుకు సంబం ధించి ఎలాంటి విచారణ చేపట్టబోమని చెప్పింది. అదే సమయంలో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలపై తాము జోక్యం చేసుకోబోమని దేశ సర్వో న్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. బెయిల్ నిబంధనలు రద్దు చేయాలని సీఐడీ కోరడం కూడా తప్పని చెప్పింది.చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొన వచ్చని, రాజకీయ సమావేశాలు పెట్టవచ్చని, ప్రజల్లో తిరగవచ్చని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఎవరికి మొట్టి కాయ పడిరదనేది జగన్ ప్రభుత్వానికి… అతని నీలి మీడియాకు అర్థమైనట్టు లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఉభయుల్లో ఎవరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి పదేపదే మీడియా తో మాట్లాడిరది సీఐడీ చీఫ్ సంజయ్,ఏఏజీ పొన్నవో లు సుధాకర్‌రెడ్డి, జగన్ ప్రభుత్వమే. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని జగన్‌రెడ్డి ప్రభుత్వానికి, అ తని జేబు సంస్థలకు సుప్రీంకోర్టు చెబితే..చంద్రబాబుకి చెప్పినట్టు నీలిమీడియా వక్రకరించింది. చంద్రబాబు ఎప్పుడైనా..ఎక్కడైనా ఇన్ని రోజుల్లో కేసు గురించి మీడి యాతో మాట్లాడారా అని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నాడంటే జగన్ రెడ్డి ఎందుకింతలా వణికిపోతున్నాడు?
నీలిమీడియా చేస్తున్న విషప్రచారం ముమ్మాటికీ జగన్‌రెడ్డి భయానికి నిదర్శనమే. 99శాతం హామీలు అమలుచేశానని ప్రగల్బాలు పలుకుతున్న జగన్‌రెడ్డి.. చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే ఎందుకింతలా వణికి పోతున్నాడు? చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తే తన దోపిడీ, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దురాగతాలు అన్నీ పూసగుచ్చినట్టు ప్రజలకు వివరించి, తన రాజకీయ జీవితానికి ఘోరీ కడతాడన్న భయంతోనే, జగన్ రెడ్డి నేడు తన చేతిలోని నీలి మీడియా.. కూలి మీడియా సాయంతో ఆఖరికి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా వక్రీ రించే దుస్థితికి దిగజారాడు. మోసకారి జగన్‌రెడ్డి, అబద్ధాల జగన్‌రెడ్డి, పదేపదే అబద్ధాలతోనే నెగ్గుకు రావాలని చూస్తున్నాడని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వారికి నోటికొ చ్చిందల్లా చెప్పి, అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతో నయవంచన చేశాడు. ఇప్పుడు అధికారాంతా నికి వచ్చాక కూడా అవే అబద్ధాలు, మోసాలతో ప్రజల్ని వంచించేందుకు కిందామీదా పడుతున్నాడు. హైకోర్టు చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వగానే ఆగమేఘా లపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన జగన్‌రెడ్డి.. రాయల సీమకు నీళ్లందించే హంద్రీనీవా, గాలేరు-నగరి, మచ్చుమర్రి, తెలుగుగంగ వంటి పథకాలన్నీ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ పున:సమీక్షతో ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తితే దానిపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలి. ఒక వైపు యువగళ పాదయాత్ర పున:ప్రారంభం.. మరోవైపున భువనేశ్వరి నేత్రత్వంలో నిజం గెలవాలి కార్యక్రమం డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ రెడ్డి… అతని జేగ్యాంగ్‌లో వణుకు మొదలైంది. ఆ రెండు కార్యక్రమా లకు తోడు.. చంద్రబాబు ప్రజల్లోకి రానున్నారని తెలిసే చివరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా తనకు అను కూలంగా ప్రచారం చేసుకునే దురవస్థకు జగన్ రెడ్డి వచ్చాడు. చరమాంకంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని శాశ్వతంగా పాతాళంలోకి నెట్టేందుకు ప్రభాత సూర్యుడిలా చంద్రబాబు త్వరలోనే కదనరంగం లోకి దిగనున్నారు. జగన్‌రెడ్డి బలంగా నమ్మే అబద్ధాలు.. మోసాలతో ఎల్లకాలం ప్రజల్ని వంచించలేడు. జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా… తలకిందులుగా తపస్సుచేసినా చంద్రబాబు తప్పు చేశా డని నిరూపించలేరు. జగన్‌రెడ్డి ఆలోచనాధోరణి.. అత ని ప్రభుత్వ వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.