అమరావతి: ఒంగోలు మహానాడు ఇచ్చిన జోష్‌తో కదనోత్సాహంతో ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 26జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించి ఇప్పటికే జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, జిల్లా మహానాడు కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధినేత… బుధవారం నుంచి ఈనెల 8వ తేది వరకు రాయలసీమలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి` చంద్రన్న భరోసా పేరిట ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి జిల్లా చోడవంలో నిర్వహించిన తొలి జిల్లా మహానాడు విజయవంతమైంది. అదే ఊపుతో క్రిష్ణా జిల్లా గుడివాడలో రెండో మహానాడు నిర్వహించాలనుకున్నా… వర్షం వల్ల అది వాయిదా పడిరది. దీంతో అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పార్టీ అధినేత చంద్రబాబు మలివిడత పర్యటించనున్నారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగే మినిమహానాడులో చంద్రబాబు పాల్గొంటారు. రేపు పీలేరు నియోజకవర్గం, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటి అయ్యి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించననున్నారు. ఈనెల 8న చిత్తూరు జిల్లాలోని నగిరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్ షో జరగనుంది. టిడిపి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని ప్రాంతాల నుంచే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అక్కడ పార్టీని పటిష్టం చేయడంతో పాటు క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేలా పర్యటనలకు తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేసింది.
పర్యటనను విజయంవతం చేయండి` శ్రేణులకు నేతల పిలుపు
తమ అధినేత చంద్రబాబునాయుడి ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని శ్రేణులకు టిడిపి నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం రేణిగుంటలో జరిగింది. చంద్రబాబు పర్యటన విజయంవతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్,తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జీ సుగుణమ్మ , శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల సుధీర్, స్టేట్, జిల్లా, అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు.