టిడిపి హయాంలో పట్టురైతులకు అమలు పరచిన పథకాలు అన్నింటినీ అధికారంలోకి రాగానే కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం శ్రీసత్యసాయిజిల్లా పట్టు రైతులు లోకేష్ ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ టిడిపి అధికారంలోకి రాగానే రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకుంటామని చెప్పారు.
వైసీపీ హయాంలో అన్నీ రకాల రైతులు నష్టాలలో కూరుకుపోయారని అన్నారు. పట్టు రైతులకు రావలసిన సబ్సిడీ డబ్బులను ఇప్పిస్తామని చెప్పారు. టిడిపి హయాంలో పట్టురైతులకు బై ఓల్టేస్ పట్టుగూడులకు కిలోకు రూ.50 సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపారు. రైతులకు పనిముట్లు, షెడ్ లు, మొక్కలు అన్నీ రాయితీపై అందజేసినట్లు వివరించారు. జగన్ కు వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు.